ఓపెన్‌ఏఐ నుంచి GPT 5 మోడల్ విడుదల.. అందరికీ అందుబాటులో కొత్త మోడల్.. కానీ..!
OpenAI GPT-5 : ఓపెన్‌ఏఐ తాజాగా GPT-5 ని ఆవిష్కరించింది. ప్రస్తుతం ChatGPT యూజర్లు మరియు డెవలపర్‌లకు అందుబాటులో ఉంది. గత మోడల్స్ తో పోలిస్తే దీనిని అడ్వాన్స్‌డ్ మోడల్ గా పేర్కొన్నారు. ఈ కొత్త మోడల్ స్మార్ట్, ఫాస్ట్ గా పేర్కొంటున్నారు. మరియు దీని ద్వారా లోపాలకు చాలా తక్కువ అవకాశం ఉంటుందని తెలిపారు. కోడింగ్, హెల్త్ కేర్, రైటింగ్ వంటి రంగాల్లో అద్భుతంగా పనిచేస్తుందని చెబుతున్నారు.
ఆటోమేటిక్ గా లాజికల్ వెర్షన్ :
GPT 5 మెరుగైన ఇంటర్‌ఫేస్ ను కలిగి ఉంటుంది మరియు సులభమైన మరియు మెరుగైన అనుభూతిని అందిస్తుంది. సంక్లిష్టమైన ప్రశ్నలకు సులభంగా గుర్తిస్తుంది. మరియు ఆటోమేటిక్ గా లాజికల్ వెర్షన్ గా మారుతుంది. కోడింగ్ లో ప్రపంచంలోనే అత్యుత్తమ మోడల్ గా ఆల్టమన్ తెలిపారు.

ఒకే మోడల్ గా :
ఈ కొత్త మోడల్ రెగ్యూలర్, రీజనింగ్ టాస్క్‌ల కోసం విడివిడిగా కాకుండా ఒకే మోడల్ గా పనిచేస్తుంది. సంక్లిష్టమైన టాస్క్‌ల సమయంలో ప్రాంప్ట్‌ల ఆధారంగా ఆటోమేటిక్‌గా రీజనింగ్ వెర్షన్ కు మారుతుంది. ఈ కొత్త మోడల్ యూజర్లను ఆకట్టుకుంటుందని, విశ్వాసాన్ని సంపాదిస్తుందని ChatGPT అధిపతి ఆశాభావం వ్యక్తం చేశారు.
యూజర్ లు అందరికీ అందుబాటులోకి :
GPT -5 మోడల్ చాట్‌జీపీటీ వినియోగదారులు అందరికీ అందుబాటులో ఉంటుంది. ఉచిత వినియోగదారులకు కొన్ని పరిమితులు ఉన్నాయి. కొన్ని అదనపు ఫీచర్లతో మినీ వెర్షన్ అందుబాటులో ఉంటుంది. ఓపెన్‌ఏఐ డెవలపర్ ల కోసం GPT -5, GPT -5 మినీ, GPT -5 నానో వంటి మూడు వెర్షన్ లను విడుదల చేసింది.
నాలుగు థీమ్స్ విడుదల :
దీంతోపాటు సైనిక్, రోబోట్, లిజనర్, నెర్డ్ వంటి నాలుగు థీమ్స్ ను పరిచయం చేసింది. కొత్త మోడల్ GPT -5 అసాధారణ కోడింగ్ సామర్థ్యాలను కలిగి ఉంది. SWE Bench మరియు Aider Polyglot వంటి మోడల్స్‌ను అధిగమించిందని ఆల్టమన్ తెలిపారు.
ఐదు వేల గంటలపాటు టెస్టింగ్ :
అలెక్స్ బ్యూటెల్ ప్రకారం భద్రతా ప్రమాణాలను అంచనా వేసేందుకు వీలుగా GPT-5 ఐదు వేల గంటలకు పైగా పరీక్షలు చేసినట్లు తెలిపారు. ఈ మోడల్ యూజర్లను తప్పుదోవ పట్టించకుండా చూడడంపైన ప్రధానంగా దృష్టిసారించినట్లు తెలుస్తోంది. గత మోడల్స్ తో పోలిస్తే తక్కువ తప్పుడు సమాధానాలు ఇస్తున్నప్పటికీ, ఈ సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదని అంగీకరించారు.
ఈ కొత్త మోడల్ కచ్చితంగా మెరుగైనదే అని, ఈ విభాగంలో కీలక ముందడుగని ఆల్టమన్ చెప్పారు. ఇందులో పురోగతి ఉన్నప్పటికీ, నిరంతరం నేర్చుకొనే సామర్థ్యం ఈ మోడల్ కు లేదని గుర్తించారు. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ( AGI ) అభివృద్ధికి ఈ లక్షణం అవసరమని చెప్పారు.
ఈ కొత్త మోడల్ శిక్షణ కోసం ఎటువంటి నిర్దిష్టమైన డేటాను ఉపయోగించారో తెలియలేదు. ఈ వివరాలను సంస్థ వెల్లడించలేదు. ఈ ఫీచర్ యూజర్ లకు మరింత ఉపయోగపడే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








