సంవత్సరం వరకు ChatGPT Go ఉచితం.. ఓపెన్ఏఐ సంస్థ కీలక నిర్ణయం..!
ChatGPT ను ప్రస్తుతం అనేక మంది వినియోగిస్తున్నారు. ఈ సంవత్సరం ఆగస్టు నెలలో చాట్‌జీపీటీ గో (ChatGPT Go) ప్లా్న్ ను భారత్‌లో ఓపెన్‌ఏఐ (OpenAI) సంస్థ తీసుకొచ్చింది. నెలవారీ రూ.399 ధరకు ఈ ప్లాన్ అందుబాటులో ఉంది. దీంతోపాటు ప్లస్, ప్రో ప్లాన్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.
అయితే తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సంస్థ ఓపెన్ ఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరం నవంబర్ నుంచి చాట్‌జీపీటీ గో ప్లాన్ ను సంవత్సరం వరకు ఉచితంగా వినియోగించుకోవచ్చని తెలిపింది. కొత్త యూజర్లతోపాటు ప్రస్తుతం చాట్‌జీపీటీ గో ఉపయోగిస్తున్న యూజర్లు కూడా ఈ ఆఫర్ ను పొందవచ్చని తెలిపింది.

భారత్ లో నవంబర్ 4 నుంచి ఈ ఆఫర్ ప్రారంభం కానుంది. అప్పటి నుంచి సంవత్సరం వరకు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను మరింత మందికి అందుబాటులోకి తీసుకురావడమే దీని వెనుక ఉన్న ఉద్దేశమని ఓపెన్‌ఏఐ వైస్ ప్రెసిడెంట్, చాట్‌జీపీటీ అధిపతి నిక్ టర్లీ తెలిపారు.
చాట్‌జీపీటీ ఉచిత ప్లాన్ తో పోలిస్తే చాట్‌జీపీటీ గో ప్లాన్‌లో అనేక అదనపు ప్రయోజనాలను పొందవచ్చు. ఇమేజ్ జనరేషన్, ఫైల్స్ లేదా ఇమేజ్ అప్‌లోడ్‌లను 10 రెట్లు అదనంగా చేసుకోవచ్చు. ఉచిత ప్లాన్ తో పోలిస్తే రెండు రెట్లు మెమొరీని పొందవచ్చు.
చాట్‌జీపీటీ ప్లాన్ నెలవారీ ధర రూ.399 గా ఉంది. అదే రూ.1,999 ధరకు చాట్‌జీపీటీ ప్లస్ ప్లా్న్ అందుబాటులో ఉంది. దీంతోపాటు ప్రో ప్లాన్ ను కూడా తీసుకొచ్చింది. సంస్థలు సహా ఇతర నిపుణుల కోసం ఈ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ధర రూ.19,900 గా ఉంది.
ఈ ఆఫర్‌ను ఎలా ఉపయోగించుకోవాలి? :
> చాట్‌జీపీటీ వెబ్‌సైట్ లేదా యాప్‌ను ఓపెన్ చేయాలి.
> అకౌంట్ ను క్రియేట్ చేసుకోవాలి.
> అనంతరం అక్కడ చాట్‌జీపీటీ గో ప్లాన్ ను ఎంచుకోవాలి.
> అక్కడ గో ప్లా్న్ ధర రూ.399 గా ఉంటుంది.
> మీరు చాట్‌జీపీటీ గో యూజర్ అయితే ఆటోమేటిక్ గా ఆఫర్ యాక్టివేట్ అవుతుంది. అంటే 12 నెలల వరకు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.
> చాట్‌జీపీటీ గో ప్రస్తుత యూజర్లతోపాటు కొత్త యూజర్లు కూడా ఈ ఉచిత ఆఫర్ వర్తించనుంది.
ఇటీవలే ఓపెన్ ఏఐ సంస్థ అట్లాస్ పేరుతో వెబ్‌బ్రౌజర్ ను లాంచ్ చేసింది. ప్రస్తుతానికి macOS యూజర్లు మాత్రమే వినియోగించుకొనే వీలుంది. త్వరలో విండోస్, iOS, ఆండ్రాయిడ్ OS లకు కూడా అందుబాటులోకి రానుంది. ప్లస్, ప్రో, బిజినెస్ యూజర్ల కోసం ప్రివ్యూలో బ్రౌజర్ ఏజెంట్ మోడ్ కూడా ఉంటుంది.
బ్రౌజర్ అంటే ఏంటి, ఎలా ఉపయోగించాలనే దానిపై ప్రజలు తిరిగి ఆలోచించేలా అట్లాస్ వెబ్ బ్రౌజర్‌ను రూపొందించినట్లు ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్టమాన్ అన్నారు. సాధారణంగా బ్రౌజర్ లో ఉండే URL బార్‌ను ప్రస్తుతం AI చాట్ ఇంటర్‌ఫేస్ తో భర్తీ చేయవచ్చని చెప్పారు. అట్లాస్ బ్రౌజర్ లో ప్రత్యేకంగా మూడు ఫీచర్లు ఉన్నాయన్నారు.


Click it and Unblock the Notifications








