OpenAI వాయిస్ ఇంజిన్ ద్వారా 15 సెకన్ల వాయిస్ శాంపిల్‌తో నిజమైన వాయిస్‌ను క్రియేట్ చేయవచ్చు..!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial intelligence) టెక్నాలజీ రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది. తాజాగా ప్రముఖ ఏఐ స్టార్టప్ ఓపెన్‌ఏఐ వినూత్న ఆవిష్కరణకు తెరతీసింది. తమ ఏఐ మోడల్ సింథటిక్ ఆడియోను రూపొందించగలదని వెల్లడించింది. ఇందుకు సంబంధించిన వాయిస్ ఇంజిన్‌ను (Open AI Voice Engine) ఆవిష్కరించింది.
కేవలం 15 సెకన్ల ఒరిజినల్ వాయిస్ ఇన్‌పుట్ ద్వారా ఈ వాయిస్ ఇంజిన్ సింథటిక్ వాయిస్‌ను రూపొందించగలదని ఓపెన్ ఏఐ వెల్లడించింది. ఎమోషనల్ మరియు నిజమైన వాయిస్‌లను రూపొందించగలదని సంస్థ తెలిపింది. టెక్ సెక్టార్‌లో ఈ వాయిస్ ఇంజిన్‌ను సురక్షితమైన పద్ధతిలో అందుబాటులో ఉంచే మార్గాలను సంస్థ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

దీంతోపాటు ఈ ఏఐ మోడల్ వాయిస్ ఇంజిన్ పనితీరు ఆధారంగా రీడింగ్ అసిస్టెంట్‌గా లేదా వాయిస్ ఓవర్‌ను రూపొందించడంలో ఉపయోగించవచ్చని తెలుస్తోంది. దీంతోపాటు ఒక వ్యక్తి వాయిస్‌తో కంటెంట్‌ను అనేక భాషల్లోకి మార్చేందుకు కూడా ఈ ఫీచర్ ఉపయోగపడే అవకాశం ఉంది.
ఎన్నికల సమయంలో తీవ్రమైన పరిణామాలు..!: ఎన్నికల సమయంలో ఇలాంటి ఓపెన్ ఏఐ వాయిస్ ఇంజిన్ ఫీచర్ల కారణంగా తీవ్రమైన పరిణామాలు చోటుచేసుకొనే అవకాశం ఉండడంతో తన భాగస్వామ్య పక్షాలతో ఈ పరిస్థితులను గురించి చర్చించి వారి నుంచి అభిప్రాయాలను తీసుకుంటున్నట్లు పేర్కొంది.
దీంతోపాటు ప్రభుత్వం, మీడియా, వినోదం, ఎడ్యుకేషన్, ప్రజలు సహా అమెరికా సహా ఇతర అంతర్జాతీయ భాగస్వామ్య పక్షాలతో ఈ అంశంపై మాట్లాడుతున్నట్లు ఓపెన్ ఏఐ పేర్కొంది. వారి అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని ఓపెన్‌ఏఐ సంస్థ వెల్లడించింది.
టెస్టింగ్ దశలో ఒరిజినల్ వాయిస్ ఇచ్చిన వ్యక్తి అనుమతి, వాటర్ మార్క్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో రూపొందించినట్లు తెలిపే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉన్న డేటా మరియు ఇతర అనుమతి పొందిన సమాచారం ఆధారంగా వాయిస్ ఇంజిన్‌కు శిక్షణ ఇచ్చినట్లు తెలిపింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో దీన్ని పూర్తిస్థాయిలో విడుదల చేయడం లేదని పేర్కొంది.
** ఓపెన్ ఏఐ సీఈవో నియామకంలో నవంబర్‌లో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. సీఈవోగా ఉన్న శామ్ ఆల్ట్‌మాన్‌ను ఓపెన్ ఏఐ డైరెక్టర్ల బోర్డు తొలగించింది. అయితే అనంతరం పరిణామాల్లో శామ్ ఆల్ట్‌మాన్‌ను ఓపెన్ ఏఐ సంస్థ తిరిగి సీఈవోగా నియమితులు అయ్యారు. అయితే అందుకు కొన్ని షరతులు విధించారు. తనమీద చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకోవడం సహా ప్రస్తుత బోర్డును రద్దు చేయాలంటూ మరో షరతు విధించారు.
ఈ రెండింటికి అంగీకరించిన సంస్థ ఏకంగా బోర్డు సభ్యుల్లోనూ మార్పులు చేసింది. ఓపెన్ ఏఐలో పెట్టుబడులు పెట్టిన మైక్రోసాఫ్ట్ సంస్థ డైరెక్టర్ల బోర్డులో చేరింది. నాన్ ఓటింగ్ అబ్జర్వర్‌గా చేరింది. అంటే ఓపెన్ ఏఐ సంస్థ బోర్డు సమావేశాలకు మైక్రోసాఫ్ట్ హాజరవుకావచ్చు మరియు వారి రహస్య సమాచారాన్ని యాక్సెస్ చేయవచ్చు. అయితే బోర్డు తీసుకొనే నిర్ణయాలలో ఓటు వేసే హక్కు లేదు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








