ఒపెరా బ్రౌజర్ దూసుకువెళుతోంది..

గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్‌ఫాక్స్ వంటి ప్రముఖ ఇంటర్నెట్ వెబ్ బ్రౌజర్‌లకు ఏ మాత్రం తీసుపోకుండా ఒపెరా (Opera) మొబైల్ వెబ్ బ్రౌజర్ భారత్‌లో 100 మిలియన్ యూజర్ల లక్ష్యంగా దూసుకువెళుతోంది. తమ మొబైల్ ఫోన్ ఇంటర్నెట్ బ్రౌజర్ గడిచిన నెలలో భారత మార్కెట్లో 50 మిలయన్ యూజర్ మార్క్ ను దాటినట్లు ఒపెరా సాఫ్ట్‌వేర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ శుక్రవారం ఓ ప్రముఖ న్యూస్ ఏజెన్సీకి తెలిపారు. భారత్ మార్కెట్లో స్మార్ట్ ఫోన్ ల వినియోగం శరవేగంగా విస్తరిస్తోన్న నేపధ్యంలో ఇక్కడ తమ యూజర్ల సంఖ్య రానున్న నెలల్లో 100 మిలియన్ లకు చేరుంతుందన్న ఆశాభావాన్ని లార్స్ బాయిల్సిన్ తెలిపారు.
ఒపెరా బ్రౌజర్ గురించి క్లప్తంగా... ఈ మొట్ట మొదటి మొబైల్ వెబ్ బ్రౌజర్ నెట్‌వర్క్ నెమ్మదిగా ఉన్నప్పటికి వేగంగా స్పందించగలదు. ఈ బ్రౌజర్‌లో నిక్షిప్తం చేసిన ప్రత్యేకమైన సాంకేతికత బ్రౌజింగ్ సమయంలో వెబ్‌సైట్‌ల ద్వారా అందే సమచారాన్ని బాగా కంప్రెస్ చేస్తుంది. దాంతో డేటా బిల్లులను తగ్గించుకోవచ్చు. ఆండ్రాయిడ్, యాపిల్, బ్లాక్‌బెర్రీ, సింబియాన్ వంటి అన్నిరకాల ఆపరేటింగ్ ప్లాట్‌ఫామ్‌లను ఈ బ్రౌజర్ సపోర్ట్ చేస్తుంది. ఒపెరా బ్రౌజర్‌లో ఏర్పాటు చేసిన ‘స్మార్ట్ పేజ్' ఫీచర్ ద్వారాసోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌లు ఇంకా ఇతర వెబ్ పేజీలకు వేగంగా కనెక్ట్ కావచ్చు. ఇతర బ్రౌజర్‌లతో పోలిస్లే ఒపెరా మినీ బ్రౌజర్ పదోవంతు బ్యాండ్ విడ్త్ మాత్రమే ఉపయోగిస్తుంది.
అలాగే బ్రౌజర్‌లో ఏర్పాటు చేసిన డేటా సేవింగ్ కాలిక్యులేటర్ ద్వారా డేటా వినియోగానికి సంబంధించి వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. వ్యక్తిగత మెయిల్, సోషల్ నెట్‌వర్కింగ్, బ్యాంకింగ్ ఇలా అనేకమైన ఆన్‌లైన్ అకౌంట్‌లకు సంబంధించి మీరు ఉపయోగించే పాస్‌వర్డ్‌లన్నింటిని ఒక దగ్గర సురక్షితంగా స్టోర్ చేసుకునేందుకు పాస్‌వర్డ్ మేనేజర్ ఉంటుంది. డెస్క్‌టాప్ తరహాలోనే ఒక విండోలోనే అనేక వెబ్‌సైట్‌లు ఓపెన్ చేసుకునేందకు అలానే అవసరమైన వెబ్ పేజీని సలువుగా ఎంచుకునేందుకు ట్యాబ్ బ్రౌజింగ్ సౌకర్యాన్ని ఈ బ్రౌజర్‌లో ఏర్పాటు చేసారు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








