ఒపెరా మినీ ద్వారా మొబైల్ డేటా లేకున్న ఫైల్స్ షేర్ చేయవచ్చు

|

ఏవైనా ఫైల్‌లను మరొకరికి పంపడానికి లేదా వారి నుండి స్వీకరించడానికి షేరింగ్ ఫీచర్‌ను ఉపయోగిస్తారు.కానీ షేరింగ్ ఫీచర్‌ ద్వారా ఫైల్‌లను షేర్ చేయడానికి మొబైల్ డేటా లేదా ఇంటర్నెట్ అవసరం అవుతుంది. డేటా లేనప్పుడు షేర్ చేయడం వీలు కాదు. ఇలాంటి సమస్యను ఒపెరా మినీ ఇప్పుడు తీరుస్తోంది. మీ వద్ద మొబైల్ డేటా లేకపొయినా కూడా ఫైల్‌లను షేర్ చేసే కొత్త ఫీచర్ ను తీసుకువచ్చింది.

ఆఫ్‌లైన్ ఫైల్ షేరింగ్ ఫీచర్‌
 

ఒపెరా మినీ బ్రౌజర్ తన వినియోగదారులకు కొత్తగా ఆఫ్‌లైన్ ఫైల్ షేరింగ్ ఫీచర్‌ను పరిచయం చేసింది.దీని ద్వారా వినియోగదారులు తమ మొబైల్ డేటాను ఉపయోగించకుండా సమీపంలో ఉన్న పరికరాల మధ్య ఫోటోలు, వీడియోలు మరియు ఆడియో ఫైళ్ళను అధిక వేగంతో షేర్ చేసుకోవచ్చు.

ఒపెరా మినీ

ఒపెరా మినీలో కొత్త ఆఫ్‌లైన్ ఫైల్ షేరింగ్ ఫీచర్‌తో ప్రత్యేకమైన ఫైల్ షేరింగ్ యాప్ ను డౌన్‌లోడ్ చేయవలసిన అవసరం లేదు. ఒపెరా మినీలోని స్థానిక ఆఫ్‌లైన్ ఫైల్ షేరింగ్ ఫీచర్ 300MB / s వేగంతో ఫైల్‌లను బదిలీ చేయగలదు. ఇది ఫైల్ షేరింగ్‌కు వేగవంతమైన పరిష్కారం.

RS.10,000 భారీ డిస్కౌంట్ ధరతో గూగుల్ పిక్సెల్ 3A

మొబైల్ బ్రౌజర్

ఒపెరా మినీ అనేది వంద మిలియన్లకు పైగా ప్రజలకు నచ్చిన మొబైల్ బ్రౌజర్. కొత్త ఆఫ్‌లైన్ ఫైల్ షేరింగ్ ఫీచర్‌తో ఒపెరా మినీ యూజర్లు ఇప్పుడు తక్కువ వేగంతో లేదా ఖరీదైన మొబైల్ డేటా గురించి చింతించకుండా తమ దగ్గరలో ఉన్న వ్యక్తులతో అధిక వేగంతో ఫైల్‌లను పంచుకునేందుకు ఎంచుకోవచ్చు అని ఒపెరా బ్రౌజర్‌ల హెడ్ కిస్టియన్ కోలోండ్రా పత్రిక ప్రకటనలో తెలిపారు.

జియోఫైబర్ ల్యాండ్‌లైన్ వాయిస్ కాల్స్ స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా చేయడం ఎలా?

QR కోడ్‌
 

ఏవైనా ఫైల్‌లను పంపడం లేదా స్వీకరించడం వంటివి ప్రారంభించడానికి వినియోగదారుడు మెనులోని ఫైల్ షేరింగ్‌ను ఓపెన్ చేసి ఫైల్‌లను పంపడం లేదా స్వీకరించడంను ఎంచుకోవాలి. పరికరాలను కనెక్ట్ చేస్తూ సమీప పరికరాన్ని స్కాన్ చేయడానికి ఒపెరా మినీ QR కోడ్‌ను కూడా అందిస్తుంది. ఫైల్ విజయవంతంగా బదిలీ అయిన తర్వాత పంపినవారికి తెలియజేయబడుతుంది. అంతేకాకుండా ఒపెరా మినీలో చూపిన స్వీకరించిన ట్యాబ్‌లోని ఫైల్‌ను రిసీవర్ యాక్సెస్ చేయగలదు.

ఒపెరా ఫర్ ఆండ్రాయిడ్ 51

మార్చిలో ఒపెరా తన మొబైల్ యాప్ యొక్క "ఒపెరా ఫర్ ఆండ్రాయిడ్ 51" అనే కొత్త వెర్షన్‌ను విడుదల చేసింది. ఇది ఉచిత అంతర్నిర్మిత వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (VPN) సర్వీస్ ను ప్రవేశపెట్టింది. ఇది ప్రారంభించినప్పుడు అంతర్నిర్మిత VPN 256-బిట్ ఎన్క్రిప్షన్ అల్గారిథమ్‌లను ఉపయోగించి డివైస్ లు మరియు రిమోట్ VPN సర్వర్‌ల మధ్య ప్రైవేట్ మరియు గుప్తీకరించిన కనెక్షన్‌ను సృష్టిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 650 మిలియన్లకు పైగా ప్రజలు VPN సేవలను ఉపయోగిస్తున్నారు. వీరిలో 33 శాతం మంది వినియోగదారులు భారతదేశానికి చెందినవారు కావడం గమనార్హం.

Most Read Articles
Best Mobiles in India

English summary
Opera Mini New Feature: Share Files without Mobile Data

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X