సెకనుకు పైసా తప్పనిసరి

Posted By: Staff

సెకనుకు పైసా తప్పనిసరి

 

టెలికాం ఆపరేటర్లు తమ మొబైల్ కస్టమర్లకు సెకనుకు ఒక పైసా టారిఫ్ ప్లాన్ తప్పక అమలుచేయాలని భారత టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) సూచించింది. ఈ మేరకు ట్రాయ్ తాజాగా టారిఫ్ సవరణ ఉత్తర్వును జారీచేసింది. టెలికాం ఆపరేటర్లు ఒక్కో సర్వీస్ ఏరియాలో పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్ ఖాతాదార్ల కోసం ‘ఒక సెకను’ పల్స్‌రేటుతో కనీసం ఒక్కో టారిఫ్ ప్లాన్ అమలుచేయడం ఆనవాయితీగా ఉండాలని ఉత్తర్వులో పేర్కొంది. అలాగే మొత్తం మీద 25 టారిఫ్ ప్లాన్‌లు దాటని విధంగా ఏ పల్స్‌రేటుతోనైనా ప్రత్యామ్నాయ టారిఫ్ ప్లాన్‌లను అమలుచేసుకునే స్వేచ్ఛ ఆపరేటర్లకు ఉన్నదని ట్రాయ్ ఒక ప్రకటనలో పేర్కొంది.

యునినార్ ఆశాభావం

హైదరాబాద్, ఏప్రిల్ 21: 2జి సమస్యలపై తగు పరిష్కారం త్వరలోనే లభించగలదనే ఆశాభావాన్ని యునినార్ వ్యక్తం చేసింది. ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సిగ్వే బ్రెక్కే హైదరాబాద్ కు వచ్చిన సందర్భంగా విలేఖరులతో మాట్లాడారు. 2జి కుంభకోణంలో నిబంధనలకు విరుద్ధంగా పొందిన 122 లైసెన్సులను సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇందులో యునినార్‌వి 22 లైసెన్సులున్న నేపథ్యంలో బ్రెక్కే పైవిధంగా స్పందించారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting