Home
News

Oppo Reno 11 సిరీస్ ప్రాసెసర్ వివరాలు విడులయ్యాయి! స్పెసిఫికేషన్లు

By Maheswara

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఒప్పో,తన Oppo Reno 11 సిరీస్ ను చైనాలో నవంబర్ 23న కనీసం రెండు ఎంట్రీలతో అధికారికంగా విడుదల చేయనుంది. Oppo Reno 11 మరియు Reno 11 Pro. రెండు మోడల్‌లు ప్రస్తుతం దేశంలో ముందస్తు రిజర్వేషన్‌ల కోసం సిద్ధంగా ఉన్నాయి. లాంచ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ, ఒప్పో తన సోషల్ మీడియా ఛానెల్‌లో లైనప్ గురించి మరిన్ని వివరాలను వెల్లడిస్తోంది.

ఈ రెండు ఫోన్లు ఫ్లాగ్‌షిప్ ఇమేజింగ్ అల్గారిథమ్‌లతో వస్తాయని పేర్కొన్నారు. సాధారణ Oppo Reno 11 ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 8200 SoC ప్రాసెసర్ పై పనిచేస్తుందని నిర్ధారించబడింది. రాబోయే ఈ ఫోన్‌ల యొక్క కెమెరా డిజైన్ లను కూడా కంపెనీ షేర్ చేసింది.

Oppo 11 Series Confirmed To Feature With MediaTek Dimensity 8200 SoC Processor. Camera Specifications Leaked.

చైనా సోషల్ మీడియా యాప్ అయిన Weiboలో పోస్ట్‌ల ద్వారా, ఒప్పో సంస్థ Oppo Reno 11 సిరీస్ డిజైన్ మరియు స్పెసిఫికేషన్‌లను టీజ్ చేస్తోంది. ఒప్పో రెనో 11 హుడ్ కింద మీడియా టెక్ డైమెన్సిటీ 8200 SoC ప్రాసెసర్ ని ప్యాక్ చేసినట్లు నిర్ధారించబడింది. ఇది గత లీక్‌లకు అనుగుణంగా ఉంది. ఈ ఏడాది వేసవిలో అధికారికంగా విడుదలైన రెనో 10 ప్రో కూడా అదే మొబైల్ చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది.

ఇంకా, ఒప్పో రెనో 11 స్మార్ట్ ఫోన్ యొక్క కెమెరా వివరాలు గమనిస్తే, 50-మెగాపిక్సెల్ SLR-స్థాయి పోర్ట్రెయిట్ లెన్స్ మరియు 47mm ఫోకల్ లెంగ్త్‌తో 32-మెగాపిక్సెల్ సెన్సార్‌తో ప్యాక్ చేయబడింది. రాబోయే ఈ మోడల్‌లు ఒప్పో యొక్క ఫైండ్ సిరీస్ నుండి ఫ్లాగ్‌షిప్ ఇమేజింగ్ అల్గారిథమ్‌లను కలిగి ఉన్నట్లు నిర్ధారించబడింది.

ఒప్పో సంస్థ తన వీబో ఖాతాలో రెనో 11 మరియు రెనో 11 ప్రో నుండి కొన్ని కెమెరా నమూనాలను పంచుకుంది. ఈ కెమెరా నమూనాలు ఫోటో, వీడియో మరియు జూమ్ నాణ్యతలో దాని కెమెరా యూనిట్ పనితీరును ప్రదర్శిస్తాయి. పోర్ట్రెయిట్ మోడ్‌లో క్యాప్చర్ చేయబడిన చిత్రాలు కొత్త 'SLR-స్థాయి పోర్ట్రెయిట్ లెన్స్' యొక్క కెమెరా పురోగతిని మరియు ప్రకాశవంతమైన బహిరంగ పరిస్థితుల్లో దాని పరిధిని హైలైట్ చేస్తాయి.

ఒప్పో రెనో 11 సిరీస్ నవంబర్ 23న అధికారికంగా విడుదల కానుంది. లాంచ్ ఈవెంట్ చైనాలో స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:00 గంటలకు (భారత కాలమానం లో ఉదయం 11:30 IST) జరుగుతుంది.

ఈ రెండు రెనో హ్యాండ్‌సెట్‌లు ప్రస్తుతం చైనాలో ముందస్తు రిజర్వేషన్‌ల కోసం అందుబాటులో ఉన్నాయి. ఒప్పో రెనో 11 లైనప్ ఫ్లోరైట్ బ్లూ, మూన్‌స్టోన్, టర్కోయిస్ మరియు అబ్సిడియన్ బ్లాక్ (చైనీస్ నుండి అనువదించబడింది) రంగు ఎంపికలలో అందుబాటులోకి వస్తుంది.

ఒప్పో ప్యాడ్ ఎయిర్ 2 టాబ్లెట్ కూడా దానితో పాటు లాంచ్ అవుతుంది. అంటే Oppo Pad Air 2 మోడల్ 11.35-అంగుళాల 2.8K డిస్ప్లేతో లాంచ్ అవుతుంది. ఈ టాబ్లెట్ మోడల్ డిస్‌ప్లే 120 Hz రిఫ్రెష్ రేట్, 600 nits బ్రైట్‌నెస్, 240 Hz టచ్ శాంప్లింగ్ రేట్ మరియు అద్భుతమైన సెక్యూరిటీ ఫీచర్‌లను కూడా కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Oppo 11 Series Confirmed To Feature With MediaTek Dimensity 8200 SoC Processor. Camera Specifications Leaked.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X