Oppo Smart TV త్వరలో లాంచ్ కానున్నాయి!!! అందుబాటు ధరలోనే...
ఒప్పో సంస్థ కూడా అన్ని మొబైల్ కంపెనీల వలె స్మార్ట్‌ఫోన్లతో పాటు స్మార్ట్ టీవీలను తయారుచేయడం మొదలుపెట్టింది. ఈ చైనా సంస్థ వచ్చే నెలలో కొత్తగా మరొక రెండు రకాల స్మార్ట్ టీవీ మోడల్లను లాంచ్ చేయనున్నట్లు ధృవీకరించింది.

ఒప్పో డెవలపర్ కాన్ఫరెన్స్ (ODC) 2020
ఒప్పో డెవలపర్ కాన్ఫరెన్స్ (ODC) 2020 సందర్భంగా కంపెనీ మార్కెట్లో కలర్‌ఓఎస్ 11 మరియు ఒప్పో వాచ్ ECG ఎడిషన్‌ను ఆవిష్కరించింది. ఒప్పో ఇంకా ఖచ్చితమైన లాంచ్ తేదీని షేర్ చేయలేదు. ఒప్పో తన పోర్ట్‌ఫోలియోలో స్మార్ట్ టీవీని అందుబాటు ధరలో చేర్చడాన్ని గత కొంతకాలంగా టీజ్ చేస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఒప్పో స్మార్ట్ టీవీ ఎడిషన్ లాంచ్
చైనీస్ మైక్రో-బ్లాగింగ్ వెబ్‌సైట్ వీబోలో ODC 2020 లైవ్ స్ట్రీమ్ ప్లాట్‌ఫాంలోని ఒక కథనం ప్రకారం ఒప్పో సంస్థ తన మొదటి స్మార్ట్ టివిని అక్టోబర్ నెలలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దీని కంటే మరిన్ని వివరాలు పంచుకోలేదు. ఒప్పో స్మార్ట్ టీవీల గురించి పుకార్లు గత ఏడాది డిసెంబర్‌లో మొదటిసారిగా వచ్చాయి. ఈ ఏడాది జూన్‌లో చైనాలో 5G ని వాణిజ్యీకరించిన మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకునే కార్యక్రమంలో స్మార్ట్ టివిని మార్కెట్‌లోకి లాంచ్ చేయనున్నట్లు ఒప్పో ధృవీకరించింది.

ఒప్పో స్మార్ట్ టీవీల SIG సర్టిఫికేషన్
ఒప్పో స్మార్ట్ టివిల గురించి విడుదలైన కొన్ని పుకార్ల వివరాల విషయానికి వస్తే ఇవి 55-అంగుళాల మరియు 65-అంగుళాల మోడళ్లను 3C సర్టిఫికేషన్ తో వెబ్‌సైట్‌లో గుర్తించడం జరిగింది. అదే సమయంలో మైస్మార్ట్‌ప్రైస్ యొక్క నివేదిక ప్రకారం ఒప్పో స్మార్ట్ టీవీ మోడళ్ల రిమోట్ బ్లూటూత్ SIG సర్టిఫికేషన్ తో వస్తున్నట్లు వెబ్‌సైట్‌లో గుర్తించబడిందని పేర్కొంది. 3C ధృవీకరణలో రెండు టీవీ పరిమాణాలకు వేర్వేరు మోడల్ సంఖ్యలతో 10 వేరియంట్లతో విడుదల చేయనున్నాయి. వీటి యొక్క రిమోట్ కోసం బ్లూటూత్ SIG జాబితా మోడల్ నంబర్ RC-001D తో వస్తున్నట్లు ‘ఒప్పో రిమోట్ కంట్రోల్' అని పేర్కొంది. Oppo స్మార్ట్ టివిల యొక్క సైజు మరియు రిమోట్ కంట్రోల్ గురించి ఎటువంటి సమాచారాన్ని కంపెనీ షేర్ చేయలేదు.


Click it and Unblock the Notifications