నవంబర్ 16 న లాంచ్ కానున్న Oppo కొత్త ఫోన్! స్పెసిఫికేషన్ల వివరాలు 

By Maheswara
|

Oppo అనేక కొత్త స్మార్ట్‌ఫోన్‌లపై పని చేస్తోంది, ఇవి సంవత్సరం ముగిసేలోపు లాంచ్ చేయబడతాయని అంచనాలున్నాయి. వీటిలో హై-ఎండ్ ఫ్లాగ్‌షిప్‌లతో పాటు, బ్రాండ్ మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను కూడా లాంచ్ చేస్తోంది. అయితే ప్రస్తుతం,108MP కెమెరాతో Oppo A1 Pro 5G స్మార్ట్ ఫోన్ ను నవంబర్ 16న చైనాలో అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రీమియం Oppo ఫోన్ ఎలాంటి ఫీచర్లతో రాబోతోందో గమనించండి.

Oppo

Oppo యొక్క అధికారిక Weibo ఖాతా లో తదుపరి తరం A-సిరీస్ స్మార్ట్‌ఫోన్ యొక్క కొన్ని వివరాలను పంచుకుంది. ఈ రాబోయే Oppo A1 Pro 5G స్మార్ట్ ఫోన్ కొత్తగా లాంచ్ చేయబడిన  Realme 10 లైనప్ మాదిరిగానే కర్వ్ డిజైన్‌ డిస్ప్లే తో వస్తుందని తెలుస్తోంది. ఈ ఫోన్ బహుళ ధృవీకరణ వెబ్‌సైట్‌లలో కూడా గుర్తించబడింది, ఈ ఫోన్ నుంచి ఏమి ఆశించాలో మనకు ఒక అవగాహన వస్తుంది.

Oppo A1 Pro 5G లాంచ్ వివరాలు

Oppo A1 Pro 5G లాంచ్ వివరాలు

Oppo A1 Pro 5G స్మార్ట్ఫోన్ నవంబర్ 16న బీజింగ్ కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు) లాంచ్ అవుతుందని అధికారిక పోస్టర్ ధృవీకరిస్తోంది. Oppo A58 5Gతో సహా బ్రాండ్ నుండి ఇటీవలి లాంచ్‌ జాబితాలో ఈ కొత్త ఫోన్ చేరింది.

Oppo A1 Pro 5G ఫీచర్ల లో ఏమి ఆశించాలి?

Oppo A1 Pro 5G ఫీచర్ల లో ఏమి ఆశించాలి?

రాబోయే Oppo A1 Pro 5G కర్వ్డ్ ఎడ్జ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ FHD+ రిజల్యూషన్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ మరియు 10-బిట్ కలర్ సపోర్ట్‌తో 6.7-అంగుళాల AMOLED ప్యానెల్‌ డిస్ప్లే ను తీసుకువస్తుందని చెప్పబడింది. ఈ డిస్ప్లే రాబోయే Oppo Reno 9 లైనప్‌తో సమానంగా ఉండవచ్చు.

అలాగే, Oppo A1 Pro 5G స్నాప్‌డ్రాగన్ 697 చిప్‌సెట్ ద్వారా శక్తిని తీసుకుంటుందని చెప్పబడింది. కొన్ని సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లు ఇది 12GB వరకు LPDDR4x RAM మరియు 256GB UFS 3.1 స్టోరేజ్‌ను అందించవచ్చని పేర్కొంది. మరింత స్టోరేజీ ని పెంచుకోవడం కోసం మైక్రో SD కార్డ్ స్లాట్‌ను కూడా ఆశించవచ్చు.

మరీ ముఖ్యంగా, Oppo A1 Pro 5G LED ఫ్లాష్‌తో 108MP డ్యూయల్-కెమెరా సెటప్‌లో ప్యాక్ చేయబడుతుంది. టీజర్ పోస్టర్ వెనుక ప్యానెల్‌లోని రెండు కెమెరాలను హైలైట్ చేస్తుంది, ఇక్కడ సెకండరీ లెన్స్ 2MP మాక్రో షూటర్‌గా చెప్పబడింది. 16MP ఫ్రంట్ కెమెరాను కూడా ఆశించవచ్చు.

67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో

67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో

Oppo A1 Pro 5G కూడా 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 mAh బ్యాటరీని అందిస్తుందని చెప్పబడింది. దాని రూపాన్ని బట్టి, రాబోయే Oppo స్మార్ట్‌ఫోన్ ప్రీమియం కేటగిరి లో వస్తుంది. 108MP కెమెరా, 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు సొగసైన కర్వ్డ్ డిజైన్ దీనికి గొప్ప అనుభవాన్ని అందిస్తాయి. కొత్త Oppo A1 Pro 5G Motorola, Xiaomi, Redmi, Samsung మరియు Realme ఫోన్‌లతో పోటీపడుతుంది.

Oppo రెనో 9 సిరీస్

Oppo రెనో 9 సిరీస్

అలాగే,Oppo నవంబర్ చివరి నాటికి చైనాలో రెనో 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ఫోన్ల ఫీచర్లు ఇంతకు ముందు లీక్ అయ్యాయి, దీని ప్రకారం రెనో 9, రెనో 9 ప్రో మరియు రెనో 9 ప్రో+ స్మార్ట్‌ఫోన్‌లు ఇక నుంచి మార్కెట్లో సందడి చేయబోతున్నాయి. టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ దీనికి సంబంధించి లీక్ అయిన సమాచారాన్ని నివేదించింది.  

Best Mobiles in India

Read more about:
English summary
Oppo A1 Pro 5G Scheduled To Launch November 16 With 108MP Camera And Other Features. Details Here.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X