Just In
Don't Miss
- Automobiles
చెన్నైలో కొత్త డీలర్షిప్ ప్రారంభించిన వోల్వో.. పూర్తి వివరాలు
- Finance
4 రోజులుగా ఒత్తిడిలో బంగారం ధరలు, 8 నెలల కనిష్టానికి
- Movies
Naandhi 7 days collections: అల్లరి నరేష్ బాక్సాఫీస్ హిట్.. మొత్తం లాభం ఎంతంటే?
- Sports
WTC: ఇంగ్లండ్ ఔట్.. టాప్ ప్లేస్‌కు ఇండియా.. ఆఖరి మ్యాచ్‌లో ఓడితే ఆసీస్‌కు చాన్స్!
- News
భీమవరంలో ఉద్రిక్తత: అంబేద్కర్ విగ్రహానికి చెప్పులదండ: పాలాభిషేకం చేసిన వైసీపీ ఎమ్మెల్యే
- Lifestyle
శుక్రవారం దినఫలాలు : ఓ రాశి వారు ఈరోజు చాలా శక్తివంతంగా ఉంటారు...!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Oppo A12 స్మార్ట్‌ఫోన్ మీద భారీ ధర తగ్గింపు!! మిస్ అవ్వకండి
ఇండియాలో ఒప్పో A12 స్మార్ట్‌ఫోన్ యొక్క ధరను సంస్థ ఇప్పుడు తగ్గించింది. ఒప్పో F17, ఒప్పో A15 మరియు ఒప్పో రెనో 3 ప్రోల ధరలు తగ్గిన కొన్ని రోజుల తరువాత చివరిగా ఒప్పో A12 ఫోన్ యొక్క ధరలు కూడా తగ్గింపును అందుకున్నాయి. డ్యూయల్ రియర్ కెమెరా, వాటర్‌డ్రాప్ డిస్ప్లే నాచ్ వంటి ఫీచర్లతో ఎంట్రీ లెవల్ ప్రైస్ ఆఫర్‌లో భాగంగా జూన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో విడుదల చేశారు. ఈ తగ్గింపు ధరల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఒప్పో A12 స్మార్ట్‌ఫోన్ తగ్గింపు ధరల వివరాలు
భారతదేశంలో రూ.8,990 ధర వద్ద విడుదల అయిన ఒప్పో A12 స్మార్ట్‌ఫోన్ యొక్క 3GB ర్యామ్ + 32GB స్టోరేజ్ వేరియంట్‌ను ఇప్పుడు రూ.8,490 ధరకు తగ్గించారు. అలాగే 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధరను ఇప్పుడు రూ.11,490 నుండి రూ. 10,990 తగ్గించారు. అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్‌తో సహా అన్ని ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ మార్కెట్లలో ఈ కొత్త ధరల వద్ద వీటిని పొందవచ్చు.

ఒప్పో A12 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్
ఒప్పో A12 స్మార్ట్ ఫోన్ డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 9 పై కలర్ OS 6.1 తో రన్ అవుతుంది. ఈ ఫోన్ 19: 9 కారక నిష్పత్తితో మరియు 720x1,520 పిక్సెల్స్ సాంద్రతతో 6.22-అంగుళాల HD + డిస్ప్లేని కలిగి ఉంది. ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో P35 SoCని కలిగి ఉండి 4GB వరకు RAMతో జతచేయబడి వస్తుంది. ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్ / 2.2 లెన్స్ 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ముందు భాగంలో ఎఫ్ / 2.4 లెన్స్ 5 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ ఉంది.

ఒప్పో A12 స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ ఫీచర్స్
ఒప్పో A12 స్మార్ట్‌ఫోన్ యొక్క స్టోరేజ్ విషయానికి వస్తే ఇందులో 32GB మరియు 64GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఎంపికలు ఉన్నాయి. అలాగే ఇందులో గల అంకితమైన మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 256GB వరకు విస్తరించవచ్చు. కనెక్టివిటీ ఎంపికలలో 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్, GPS / A-GPS మరియు మైక్రో-USB పోర్ట్ వంటివి ఉన్నాయి. ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అమర్చబడి ఉండి ఇది 4,320mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190