ఒప్పో A16K స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది!! ధరలు, ఫీచర్స్ ఇవిగో...

|

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు ఒప్పో మిడ్-సిరీస్ విభాగంలో కొత్తగా A-సిరీస్ విభాగంలోని స్మార్ట్‌ఫోన్లలో Oppo A16K హ్యాండ్‌సెట్‌ను సరికొత్త ఫోన్ కొత్త వేరియంట్‌గా ఆవిష్కరించింది. ఒప్పో A16K అనేది ఒప్పో A16 యొక్క టోన్డ్-డౌన్ వెర్షన్‌గా వస్తుంది. Oppo A16K ఫోన్ వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్ డిస్‌ప్లేను కలిగి ఉండడమే కాకుండా ఇది మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. 13-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా మరియు 5-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 4,230mAh బ్యాటరీని వంటి ఫీచర్లను కలిగి ఉండే ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Oppo A16K ధర మరియు లభ్యత వివరాలు

Oppo A16K ధర మరియు లభ్యత వివరాలు

ఒప్పో A16K స్మార్ట్‌ఫోన్ కేవలం ఒకే ఒక వేరియంట్ లో లాంచ్ అయింది. 3GB RAM మరియు 32GB స్టోరేజ్ ఒకే ఒక వేరియంట్లో లభించే ఈ ఫోన్ యొక్క ధర PHP 6,999. ఇండియా యొక్క కరెన్సీ ప్రకారం దీని విలువ దాదాపు రూ.10,300. ఈ స్మార్ట్‌ఫోన్ బ్లాక్ మరియు బ్లూ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. ఇది ప్రస్తుతం ఫిలిప్పీన్స్‌లో షాపీ మరియు లాజాడాలో మాత్రమే కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. భారతదేశంతో సహా ఇతర మార్కెట్‌లలో దీని లభ్యత మరియు ధర గురించి వివరాలు ప్రకటించబడలేదు.

Spotify 3 నెలల ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందడం ఎలా?Spotify 3 నెలల ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందడం ఎలా?

ఒప్పో A16K స్పెసిఫికేషన్స్
 

ఒప్పో A16K స్పెసిఫికేషన్స్

ఒప్పో A16K స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి కలర్OS 11.1 Liteతో ఆండ్రాయిడ్ 11లో రన్ అవుతుంది. ఈ హ్యాండ్‌సెట్ 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.52-అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను 1,600x720 పిక్సెల్‌లు మరియు 269 పిక్సెల్‌ల పిక్సెల్ సాంద్రత (ppi)ని కలిగి ఉంది. Oppo ప్రకారం ఈ హ్యాండ్‌సెట్‌లో "ఐ-కేర్" స్క్రీన్ ఉంది. ఒప్పోA16K స్మార్ట్ ఫోన్ 3GB LPDDR4X RAM మరియు 32GB స్టోరేజ్‌తో జత చేయబడిన ఆక్టా-కోర్ Mediatek Helio G35 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇందులో గల అదనపు మైక్రో SD కార్డ్ సహాయంతో ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ను 256GB వరకు విస్తరించవచ్చు.

ఆప్టిక్స్

ఒప్పో A16K స్మార్ట్‌ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో సింగిల్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఇందులో ఒకే 13-మెగాపిక్సెల్ వెనుక కెమెరా మరియు 5-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఏది ఏమైనప్పటికీ వనిల్లా ఒప్పో A16తో పోల్చినప్పుడు ఇది ఒక పెద్ద డౌన్‌గ్రేడ్. ఒప్పో A16 13-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2-మెగాపిక్సెల్ బోకె (డెప్త్) సెన్సార్ మరియు 2-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్ లేకుండా వాట్సాప్ వెబ్‌ను ఉపయోగించడం ఎలా?స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్ లేకుండా వాట్సాప్ వెబ్‌ను ఉపయోగించడం ఎలా?

కనెక్టివిటీ

Oppo A16Kలోని కనెక్టివిటీ ఎంపికలలో డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ v5, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, GPS మరియు USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఇది 5V/ 2A ఛార్జింగ్‌కు మద్దతుతో 4,230mAh బ్యాటరీతో వస్తుంది. కొత్త Oppo హ్యాండ్‌సెట్‌లో సూపర్ పవర్ సేవింగ్ మోడ్, నైట్ ఫిల్టర్‌లు మరియు ఆప్టిమైజ్ చేయబడిన నైట్ ఛార్జింగ్ కూడా ఉన్నాయి. దీని కొలతలు 164.0x75.4x7.85mm మరియు బరువు 175 గ్రాములు. ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో Oppo A16 భారతదేశంలో 4GB RAM + 64GB స్టోరేజ్ ఏకైక వేరియంట్ రూ.13,990 ధర ట్యాగ్‌తో పరిచయం చేయబడింది.

Best Mobiles in India

English summary
Oppo A16K Released With MediaTek Helio G35 Chipset: Price, Specs, India Launch Date, Features and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X