OPPO A52 రివ్యూ : అద్భుతమైన డిజైన్ & శక్తివంతమైన పనితీరు, కెమెరా సెటప్...

|

ఇండియాలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లో మంచి పేరును పొందిన ఒప్పో సంస్థ ఇప్పుడు కొత్త కొత్త సాంకేతిక ఆవిష్కరణలను విడుదల చేస్తున్నది. సరసమైన ధరల విభాగంలో పాయింట్-ఇన్-క్లాస్ టెక్నాలజీ వంటి ఫీచర్లను అందించడం ద్వారా సంస్థ తన వినియోగదారులకు మెరుగైన వినియోగదారు అనుభవాన్ని అందించడానికి ప్రయత్నిస్తుంది. OPPO సంస్థ ఇప్పుడు తన A- సిరీస్ ఫోన్లతో శక్తివంతమైన పనితీరు, అద్భుతమైన డిజైన్, భారీ బ్యాటరీ వంటి ఫీచర్ ఫోన్లను అందిస్తున్నది. ఇందులో భాగంగా OPPO ఇప్పుడు ఇండియాలో తన సరికొత్త OPPO A52 స్మార్ట్‌ఫోన్‌ను మిడ్ - రేంజ్ విభాగంలో విడుదల చేసింది.

 

OPPO A52 స్మార్ట్‌ఫోన్‌

OPPO A52 స్మార్ట్‌ఫోన్‌

OPPO A52 స్మార్ట్‌ఫోన్‌ 18 వేల లోపు ధరల విభాగంలో అద్భుతమైన ఫీచర్లతో ప్యాక్ చేయబడి ఉంది. ఇది శక్తివంతమైన 6.5-అంగుళాల FHD + పంచ్-హోల్ డిస్ప్లే మరియు 18W ఫాస్ట్ ఛార్జ్ టెక్నాలజీ మద్దతుతో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉన్నాయి. OPPO A52 స్మార్ట్‌ఫోన్‌ యొక్క టెక్నాలజీ, సాఫ్ట్ వెర్ , డిజైన్ మరియు కెమెరా పనితీరు గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

OPPO A52 స్మార్ట్‌ఫోన్ యొక్క 6.5

OPPO A52 స్మార్ట్‌ఫోన్ యొక్క 6.5 "FHD + పంచ్ హోల్ డిస్ప్లే

OPPO A52 స్మార్ట్‌ఫోన్ మల్టీమీడియా స్ట్రీమింగ్ కోసం ఉత్తమమైన డిస్ప్లే ను కలిగి ఉంది. ఇది 2400 × 1080 రిజల్యూషన్ మరియు ఆకట్టుకునే 405 ppi తో 6.5-అంగుళాల ఫుల్ HD + డిస్ప్లేను కలిగి ఉంది. దీని యొక్క 1080P నియో-స్క్రీన్‌లో టెక్స్ట్, వీడియోలు మరియు గేమ్ లు అద్భుతంగా కనిపిస్తాయి. ఇందులో సైడ్ బెజల్స్ కేవలం 1.73mm మాత్రమే లీనమయ్యే మల్టీమీడియా ప్లేబ్యాక్ కోసం ఆల్-స్క్రీన్ వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది. ఇది ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ లలోని HD లో వీడియోలను సులభంగా యాక్సిస్ చేయవచ్చు. మీరు మీకు ఇష్టమైన సినిమాలు, సిరీస్‌లను HD క్వాలిటీతో చూడవచ్చు.

OPPO A52 స్మార్ట్‌ఫోన్ డిస్ప్లే అనుభవం
 

OPPO A52 స్మార్ట్‌ఫోన్ డిస్ప్లే అనుభవం

ఒప్పో యొక్క కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఆరుబయట ఉపయోగించడంలో మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. ఇందులో గల 1080P నియో-స్క్రీన్‌ డిస్ప్లే 480 నిట్ల గరిష్ట ప్రకాశాన్ని కలిగి ఉండి బలమైన సూర్యకాంతిలో కూడా కంటెంట్ స్పష్టంగా కనిపించడానికి వీలుగా ఉంటుంది. TüV రీన్లాండ్ సర్టిఫైడ్ స్క్రీన్ తక్కువ-కాంతిలో సౌకర్యవంతమైన వీక్షణ అనుభవాన్ని కూడా అందిస్తుంది. ఇది 'ఐ కేర్ మోడ్' ను కలిగి ఉండి మీ కళ్ళకు హాని కలిగించే నీలి కాంతిని సమర్థవంతంగా ఫిల్టర్ చేస్తుంది.

వన్-హ్యాండ్ ఉపయోగం కోసం

వన్-హ్యాండ్ ఉపయోగం కోసం

OP5O A52 స్మార్ట్‌ఫోన్‌ తయారీలో ఎర్గోనామిక్స్ పట్ల తీవ్ర శ్రద్ధ తీసుకున్నారు. ఇది 6.5-ఇంచ్ భారీ 1080P నియో డిస్ప్లే ను కలిగి ఉన్నప్పటికీ స్మార్ట్‌ఫోన్‌ను ఒక చేతితో ఉపయోగించడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. ఆప్టిమైజ్ కర్వ్ మరియు క్లాస్-లీడింగ్ 90.5% స్క్రీన్-టు-బాడీ రేషియో మరియు 3D క్వాడ్-కర్వ్ డిజైన్ కారణంగా దీనిని సులభంగా ఉపయోగించవచ్చు. ఈ ఫోన్ 8.9mm మందంతో 192గ్రాముల బరువును కలిగి ఉంది. మీరు ఎటువంటి సమస్యలు ఎదురుకోకుండా సులభంగా కేవలం ఒక చేతితో మెసేజ్ లను చేయడం మరియు కాల్స్ చేయడం వంటివి చేయవచ్చు.

Oppo A52 స్మార్ట్‌ఫోన్ బాడీ డిజైన్

Oppo A52 స్మార్ట్‌ఫోన్ బాడీ డిజైన్

Oppo A52 స్మార్ట్‌ఫోన్‌ ట్విలైట్ బ్లాక్ మరియు స్ట్రీమ్ వైట్ అనే రెండు విలక్షణమైన కలర్ వేరియంట్లలో లభిస్తుంది. అద్భుతమైన కాన్స్టెలేషన్ డిజైన్ ను కలిగి ఉండి దృశ్యమానంగా సొగసైనదిగా ఉంది. ఈ రెండు వేరియంట్లు ప్రత్యేకమైన కలర్ ముగింపును అందిస్తాయి. దీని యొక్క ప్రీమియం నిగనిగలాడే ముగింపుతో మరియు బ్యాక్ ప్యానెల్ కాంతి కిరణాలను ప్రతిబింబించే అన్ని కోణాలలో అందంగా కనిపిస్తాయి.

Oppo A52 స్మార్ట్‌ఫోన్ సైడ్ డిజైన్

Oppo A52 స్మార్ట్‌ఫోన్ సైడ్ డిజైన్

Oppo A52 స్మార్ట్‌ఫోన్ యొక్క కుడి పక్కన ఉన్న సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ దీని యొక్క డిజైన్ ను మరింత మెరుగుపరుస్తుంది. పవర్ బటన్ మరియు బయోమెట్రిక్ స్కానర్ యొక్క ఇంటిగ్రేటెడ్ ప్లేస్‌మెంట్ ఒక వైపు ఉన్నందున రోజువారీ దినచర్యలో ఫోన్‌ను ఉపయోగించడం చాలా సులభంగా ఉంటుంది. భౌతిక స్కానర్ స్క్రీన్‌ స్కానర్ కంటే ఎక్కువ స్థిరంగా ఉంటుంది. మీరు హ్యాండ్‌సెట్‌ను అన్‌లాక్ చేయాలనుకున్న ప్రతిసారీ డిస్ప్లే లో మీ ఫింగర్ ను ఉంచనవసరం లేకుండా స్క్రీన్ స్మడ్జ్ లేకుండా ఉంచుతుంది.

6GB ర్యామ్ మరియు 128GB ROM గిగాబైట్ల స్టోరేజ్

6GB ర్యామ్ మరియు 128GB ROM గిగాబైట్ల స్టోరేజ్

OPPO A52 ఫోన్ ఎక్కువగా ఫోన్ ను వినియోగిస్తున్న వారికి అనుకూలంగా రూపొందించబడింది. ఇది మునుపటి తరం RAM యొక్క రెట్టింపు పనితీరుతో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6GB LPDDR4x డ్యూయల్-ఛానల్ మెమరీని కలిగి ఉన్నందున ఇది అధిక శాతం మెమరీని ఇంటర్నల్ లో సేవ్ చేయడానికి వీలుగా ఉంటుంది. స్నాపి 8-కోర్ 64-బిట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్ మరియు 128GB యుఎఫ్ఎస్ 2.1 స్టోరేజ్‌తో కలిపి ఒప్పో A52 ఫోన్ పనితీరు అద్భుతంగా పనిచేస్తుంది. శక్తివంతమైన హార్డ్‌వేర్ తాజా కలర్‌ఓఎస్ 7.1 తో సంపూర్ణంగా ఉంటుంది. ఇది OPPO యొక్క ఆండ్రాయిడ్ 10-ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా రన్ అవుతుంది.

Oppo A52 సున్నితమైన మల్టీ టాస్కింగ్

OPPO A52 ఫోన్ లో మీరు Chrome లో ఒకే సారి 10 కంటే ఎక్కువ క్రియాశీల ట్యాబ్‌లను ఓపెన్ చేయడానికి అనుమతిని ఇస్తుంది. అలాగే ఇది వీడియోలను సవరించడానికి, ఇన్‌స్టాగ్రామ్‌లో చిత్రాలను పోస్ట్ చేయడానికి, యూట్యూబ్‌లో వీడియోలను ప్లే చేయడానికి మరియు పనితీరు మందగమనం లేకుండా Google మ్యాప్స్‌తో నావిగేట్ చేయడానికి ఇంకా తగినంత మెమరీ వనరులను కలిగి ఉంది. ఇందులో గల సమర్థవంతమైన RM-ROM తో తక్కువ పవర్ వినియోగంతో CPU రోజంతా సున్నితమైన పనితీరును అందిస్తుంది.

ఫాస్ట్ ఛార్జింగ్ తో బెస్ట్-ఇన్-క్లాస్ 5,000 mAh బ్యాటరీ

ఫాస్ట్ ఛార్జింగ్ తో బెస్ట్-ఇన్-క్లాస్ 5,000 mAh బ్యాటరీ

OPPO A52 స్మార్ట్‌ఫోన్ అతి పెద్ద బ్యాటరీని కలిగి ఉంది. ఇది ఒక ఛార్జ్ మీద రెండు రోజుల వరకు ఫోన్‌ను ఉపయోగించడానికి వీలుగా బ్యాటరీ శక్తిని కోల్పోకుండా ఉంటుంది. OPPO A52 యొక్క 5,000 mAh బ్యాటరీ యూనిట్ మితమైన వాడకంతో రెండు రోజుల వరకు సులభంగా ఉపయోగించవచ్చు. ఇది USB టైప్-సి ఛార్జింగ్ పోర్టును కలిగి ఉండి 18W ఫాస్ట్ ఛార్జ్ టెక్నాలజీ మద్దతుతో వస్తుంది. వేగవంతమైన ఈ ఛార్జింగ్ అడాప్టర్ దీని పెద్ద బ్యాటరీని త్వరగా ఛార్జ్ చేయడానికి అనుమతిని ఇస్తుంది. ఇది కేవలం 40 నిమిషాలలో మొత్తం బ్యాటరీని ఫుల్ చేయగలదు.

OPPO A52 గేమింగ్ ఫీచర్స్

OPPO A52 గేమింగ్ ఫీచర్స్

OPPO A52 స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన గేమింగ్ ఫీచర్లను అందిస్తున్నది. ఇది ప్రసిద్ధ చెందిన అన్ని రకాల ఆటలను ఆడదానికి అనుమతిని ఇస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ OPPO యొక్క అంతర్గత 'హైపర్ బూస్ట్' సాంకేతికతతో వస్తుంది. ఇది CPU-GPU ప్రాసెసింగ్ వేగాన్ని మరియు RAM-ROM పనితీరును సమర్ధవంతంగా పెంచుతుంది. మొత్తం సిస్టమ్ పనితీరుపై ఎటువంటి ప్రభావం లేకుండా హ్యాండ్‌సెట్ నేపథ్యంలో గేమ్ గ్రాఫిక్స్ మరియు క్రియాశీల యాప్ లను సమర్ధవంతంగా నిర్వహించడానికి అనుమతిస్తుంది. PUBG మరియు కాల్ ఆఫ్ డ్యూటీ వంటి ఆటలను ఈ మిడ్ -రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లో గ్రాఫిక్‌లలో ఎటువంటి అంతరాయం లేకుండా ఆడడానికి వీలుగా ఉంటుంది.

OPPO A52 మెరుగైన ఆడియో ప్లేబ్యాక్

OPPO A52 మెరుగైన ఆడియో ప్లేబ్యాక్

OPPO A52 ఫోన్ గేమింగ్, ఆడియో మరియు వీడియో ప్లేబ్యాక్ మెరుగైన అనుభవం కోసం ఎగువ మరియు దిగువ భాగంలో అల్ట్రా-లైన్ డ్యూయల్ స్పీకర్లను కలిగి ఉంది. ఇవి బిగ్గరగా మరియు స్పష్టమైన ఆడియోను పంపింగ్ చేసే విధంగా తయారుచేయబడి ఉన్నాయి. డ్యూయల్-స్పీకర్ సెటప్ మల్టీమీడియా ప్లేబ్యాక్ కోసం లీనమయ్యే సరౌండ్ ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది. ఆడియో అనుభవాన్ని విస్తరించడానికి మీరు 'ఎన్‌కో డబ్ల్యూ 11' వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లను కూడా పొందవచ్చు.

OPPO A52 ఇయర్‌ఫోన్‌లు

OPPO A52 ఇయర్‌ఫోన్‌లు

బీన్ ఆకారంలో ఉన్న ఇయర్ డిజైన్ ఇయర్‌ఫోన్‌లు నీటి-నిరోధకత కోసం IP55 రేట్ తో చేయబడ్డాయి. ఇది వ్యాయామ సెషన్‌లు మరియు సాహసాలకు సరైనది. ఇవి ఎన్కో డబ్ల్యూ 11 టైప్-సి ఛార్జింగ్ పోర్టుతో వస్తుంది. ఇది ఒక ఛార్జీ మీద 5 గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను అందిస్తుంది. మొత్తం బ్యాటరీ వ్యవధి 20 గంటల వరకు ఉంటుంది. హెడ్‌ఫోన్‌లు OPPO Enco Q1 నుండి తాజా OPPO Enco W11 వరకు ఉన్నాయి. OPPO ఎన్కో W11 వైట్ కలర్‌లో 2, 499 రూపాయల ధర వద్ద ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది.

OPPO A52 స్మార్ట్‌ఫోన్ క్వాడ్-లెన్స్ కెమెరా సెటప్

OPPO A52 స్మార్ట్‌ఫోన్ క్వాడ్-లెన్స్ కెమెరా సెటప్

OPPO A52 స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో ప్రత్యేకమైన C-ఆకారపు కెమెరా మాడ్యూల్ వద్ద క్వాడ్-లెన్స్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 1/2 "సెన్సార్ మరియు ప్రకాశవంతమైన ఎఫ్ / 1.8 ఎపర్చర్‌తో 12MP అల్ట్రా హెచ్‌డి ప్రైమరీ కెమెరా ఉంది. అలాగే 8MP సెకండరీ కెమెరా అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో 119.1° ఫీల్డ్-ఆఫ్ వ్యూతో జత చేయబడి ఉంది. దీని 4-లెన్స్ కెమెరా సెటప్‌లో సిస్టమ్‌ను ఎక్కువ దూరంలో ఉన్న వాటిని ఫోటోలను తీయడానికి మీకు సహాయపడటానికి 2MP మోనో లెన్స్ మరియు 2MP పోర్ట్రెయిట్ లెన్స్ కూడా ఉన్నాయి. నాలుగు కెమెరాల సమ్మేళనంతో మీరు పూర్తి స్పష్టతతో సహజసిద్దమైన చిత్రాలను క్లిక్ చేయవచ్చు.

OPPO A52 కెమెరా సెటప్‌ సిస్టమ్‌

OPPO A52 కెమెరా సెటప్‌ సిస్టమ్‌

ఒప్పో A52 స్మార్ట్‌ఫోన్ యొక్క కెమెరా సెటప్‌ శక్తివంతమైన కలర్ సమ్మేళనంను కలిగి ఉండి ఆకట్టుకునే డైనమిక్ పరిధితో అధిక-నాణ్యత గల 4K వీడియోలను చిత్రీకరించడానికి సహాయపడుతుంది. ఈ ఫోన్ యొక్క అంతర్నిర్మిత గైరోస్కోప్ మరియు EIS (ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సహాయంతో మీరు బైక్ నడుపుతున్నప్పుడు, నడుస్తున్నప్పుడు కూడా షేక్-ఫ్రీ ఫుటేజీని షూట్ చేయడానికి అనుమతిస్తుంది. అలాగే ఈ ఫోన్ అంకితమైన 8MP అల్ట్రా వైడ్-యాంగిల్ లెన్స్‌తో వైడ్-యాంగిల్ వీడియోలను కూడా రికార్డ్ చేయగలదు.

OPPO A52 ఫ్రంట్ కెమెరా సెటప్

OPPO A52 ఫ్రంట్ కెమెరా సెటప్

ఒప్పో A52 స్మార్ట్‌ఫోన్ యొక్క ముందు భాగంలో సెల్ఫీల కోసం ఎఫ్ / 2.0 ఎపర్చర్‌తో 16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది. దీని యొక్క సెల్ఫీ కెమెరా AI బ్యూటిఫికేషన్ మోడ్‌ను కలిగి ఉంది. ఇది స్కిన్ టోన్ మరియు ఇతర పేస్ ఫీచర్లను వివిధ లైటింగ్ పరిస్థితులలో మెరుగుపరచడానికి సంక్లిష్టమైన మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్‌లను ఉపయోగిస్తుంది. అలాగే ఇది తక్కువ లైటింగ్ పరిస్థితులలో కూడా మెరుగైన షాట్లను సంగ్రహించడానికి 'అల్ట్రా నైట్ మోడ్ 2.0' మోడ్‌ను కూడా అందిస్తుంది. ఈ ఫీచర్ తక్కువ-కాంతి దృశ్యాలలో మనం చూడలేని వివరాలను బయటకు తీసుకురావడానికి మెరుగైన డైనమిక్ పరిధి మిళితంను ఉపయోగిస్తుంది.

OPPO A52 స్మార్ట్‌ఫోన్ ధరల వివరాలు

OPPO A52 స్మార్ట్‌ఫోన్ ధరల వివరాలు

OPPO A52 స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతానికి 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్లో రూ.16,990 ధర వద్ద విడుదల అయింది. దీనిని ప్రముఖ ఈ-కామెర్స్ సంస్థలు అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ యొక్క ఆన్‌లైన్ సైట్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ త్వరలోనే 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మరియు 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్లలో కూడా లభిస్తుంది.

OPPO A52 స్మార్ట్‌ఫోన్ సేల్స్ ఆఫర్స్

OPPO A52 స్మార్ట్‌ఫోన్ సేల్స్ ఆఫర్స్

ఆఫ్‌లైన్ స్టోర్లు మరియు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో OPPO A52 కొనుగోలుపై అనేక ఉత్తేజకరమైన ఆఫర్‌లు కూడా ఉన్నాయి. ఇందులో భాగంగా OPPO A52 ను బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డులు మరియు ఫెడరల్ బ్యాంక్ డెబిట్ కార్డులపై కొనుగోలు చేస్తే కనుక 5% వరకు క్యాష్‌బ్యాక్ మొత్తాన్ని పొందవచ్చు. అలాగే క్రెడిట్ కార్డ్ EMI మరియు డెబిట్ కార్డ్ EMI లావాదేవీలపై 6 నెలల వరకు నో కాస్ట్ EMI ప్రయోజనాలను పొందవచ్చు. అంతేకాకుండా బజాజ్ ఫిన్సర్వ్, IDFC ఫస్ట్ బ్యాంక్, హోమ్ క్రెడిట్, HDB ఫైనాన్షియల్ సర్వీసెస్, HDFC బ్యాంక్ మరియు ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క కార్డుల మీద ఒప్పో A52 కొనుగోలుపై అనేక ఆకర్షణీయమైన EMI ఎంపికలు కూడా ఉన్నాయి. మిడ్ రేంజ్ ధరల విభాగంలో టాప్-ఆఫ్-ది-లైన్ స్పెసిఫికేషన్లతో సరికొత్త OPPO A52 మిలియన్ల హృదయాలను గెలుచుకుంటుంది. 2020 లో ఉత్తమమైన మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ లలో ఇది కూడా ఒకటి.

Best Mobiles in India

English summary
OPPO A52: Elevating The Consumer Experience With Impeccable Design & Powerful Performance

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X