Oppo A54 మొదటి సేల్ నేడే మొదలు!! రూ.1000 తగ్గింపుతో గొప్ప అవకాశం...

|

చైనా యొక్క ప్రముఖ కన్స్యూమర్ టెక్నాలజీ బ్రాండ్ ఒప్పో సంస్థ ఇండియాలో ఇటీవల ఒప్పో A54 స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేసింది. బడ్జెట్ ధరలో లభించే ఈ ఫోన్ మొదటిసారి అమ్మకానికి అందుబాటులోకి రానున్నది. ఈ స్మార్ట్‌ఫోన్ ను కొనుగోలు చేయాలనుకునే వారు మధ్యాహ్నం 12 గంటలకు ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఆక్టా-కోర్ మీడియాటెక్ SoC, ట్రిపుల్ కెమెరా సెటప్ వంటి అద్భుతమైన ఫీచర్లను కలిగిన ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఒప్పో A54 స్మార్ట్‌ఫోన్ యొక్క మొదటి అమ్మకంలో మూడు వేర్వేరు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్ 13,490 రూపాయల ధర వద్ద మరియు 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.14,490 ధర వద్ద మరియు చివరగా 6GB ర్యామ్ + 128GB వేరియంట్ రూ.15,990 ధర వద్ద లభిస్తుంది. ఇది మూన్లైట్ గోల్డ్, స్టార్రి బ్లూ మరియు క్రిస్టల్ బ్లాక్ అనే మూడు కలర్ ఎంపికలలో లభిస్తుంది. ఈ రోజు ఫ్లిప్‌కార్ట్ అమ్మకంలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసిన వారికి రూ.1000 వరకు తగ్గింపు లభిస్తుంది.

ఒప్పో A54 మీడియాటెక్ హెలియో P35 SoC స్పెసిఫికేషన్స్

ఒప్పో A54 మీడియాటెక్ హెలియో P35 SoC స్పెసిఫికేషన్స్

Oppo A54 స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది‌ స్టాండర్డ్ 60Hz రిఫ్రెష్ రేట్‌ మద్దతుతో 6.51-అంగుళాల HD + డిస్ప్లేను కలిగి ఉంటుంది. అలాగే ఇది 89.2% స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో లభిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 10 అవుట్ ఆఫ్ బాక్స్ ఆధారంగా డివైస్ కలర్ ఓఎస్ 7.2 లో రన్ అవుతుంది. అలాగే ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో P35 SoC చిప్ సెట్ ను కలిగి ఉండి 6GB RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో జతచేయబడి వస్తుంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ సహాయంతో మెమొరీని 256GB వరకు విస్తరించవచ్చు.

ఒప్పో A54 15W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్స్

ఒప్పో A54 15W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్స్

Oppo A54 స్మార్ట్‌ఫోన్ యొక్క ఇతర ఫీచర్ల విషయానికి వస్తే ఇది 5,000mAh పెద్ద బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్కు మద్దతును ఇస్తుంది. అదనపు భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ను కలిగి ఉంది. దీనితో పాటుగా ఈ ఫోన్ ఫేస్ అన్‌లాక్‌కు కూడా మద్దతును ఇస్తుంది. దీని యొక్క కనెక్టివిటీ ఎంపికల విషయానికి వస్తే ఇది వై-ఫై, బ్లూటూత్ 5, 4G మరియు USB టైప్-సి పోర్ట్‌ మరియు 3.5mm ఆడియో జాక్ వంటి ఎంపికలను కలిగి ఉంటుంది.

ఒప్పో A54 ట్రిపుల్-కెమెరా సెటప్ ఫీచర్స్

ఒప్పో A54 ట్రిపుల్-కెమెరా సెటప్ ఫీచర్స్

Oppo A54 స్మార్ట్‌ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 13MP లెన్స్ తో ప్రైమరీ సెన్సార్ కెమెరా, 2MP మాక్రో సెన్సార్ మరియు 2MP బోకె సెన్సార్ కెమెరాలు జతచేయబడి వస్తాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ఫోన్ ముందు భాగంలో 16MP సెల్ఫీ సెన్సార్ కెమెరాను కలిగి ఉంది.

Best Mobiles in India

English summary
Oppo A54 Budget Smartphone First Sale Starts in India Today at 12pm via Flipkart

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X