ఒప్పో A54, F19 స్మార్ట్‌ఫోన్‌ల ధరలు పెరిగాయి!! ఎంతనో తెలుసా??

|

భారతదేశంలో ఒప్పో బ్రాండ్ కొత్తగా ఒక స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. సాధారణంగా కొత్త ఫోన్‌ను విడుదల చేసినప్పుడు పాత స్మార్ట్‌ఫోన్‌ల ధరలను తగ్గించే ఈ బ్రాండ్ ఈ సారి దీనికి విరుద్ధంగా ఒప్పో A54 మరియు ఒప్పో F19 ధరల మీద రూ.1,000 పెంచింది. ఒప్పో సంస్థ యొక్క ప్రత్యర్థులు రియల్‌మి మరియు షియోమి సంస్థలు దేశంలోని తమ స్మార్ట్‌ఫోన్‌ల ధరలను పెంచిన కొద్ది రోజుల తర్వాత ఈ తాజా సవరణను అమలుచేసాయి. Oppo A54 మరియు Oppo F19 రెండూ కూడా ఏప్రిల్‌లో భారతీయ మార్కెట్లో విడుదలయ్యాయి. ఈ ఫోన్‌లు ట్రిపుల్ రియర్ కెమెరా మరియు హోల్-పంచ్ డిస్‌ప్లేలతో వస్తాయి. Oppo F19 ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లే మరియు 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో వస్తుంది. మరోవైపు ఒప్పో A54 HD+ LCD ప్యానెల్ మరియు 13-మెగాపిక్సెల్ ప్రైమరీ స్నాపర్‌తో వస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఒప్పో A54, F19 కొత్త ధరల వివరాలు

ఒప్పో A54, F19 కొత్త ధరల వివరాలు

భారతదేశంలో ఏప్రిల్‌లో ఒప్పో A54 స్మార్ట్‌ఫోన్‌ రూ.13,490 ధర వద్ద లాంచ్ అయింది. ఇప్పుడు కొత్తగా రూ.1000 ధరల పెరుగుదలను అందుకున్న తరువాత 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ బేస్ వేరియంట్‌ రూ.13,990 కు బదులుగా రూ.14,990 ధర వద్ద లభిస్తుంది. అలాగే ఈ ఫోన్ దేశంలో 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మరియు 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్‌లు వరుసగా రూ.14,490 మరియు రూ.15,990 ధరల వద్ద లాంచ్ అయ్యాయి. వీటి మీద కూడా ధరల పెంపును అందుకున్నాయి. Oppo A54 తో పాటు Oppo F19 కూడా భారతదేశంలో ధరల పెరుగుదలను అందుకున్నాయి. వీటిలో 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,990 కు బదులుగా రూ.19,990 లకు పెరిగింది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఫోన్ సింగిల్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో లాంచ్ చేయబడింది. ఫ్లిప్‌కార్ట్ మరియు ఒప్పో యొక్క ఆన్‌లైన్ స్టోర్‌తో సహా ఇ-కామర్స్ మార్కెట్‌లో ఈ కొత్త ధరలు ఇంకా చూపలేదు. అయితే ఆఫ్‌లైన్ రిటైలర్లు సవరించిన ధరలతో ఫోన్‌ను అమ్మడం ప్రారంభించారు.

Amazon Great Indian Festival సేల్ మొదలుకానున్నది!! వీటిపై భారీ ఆఫర్లు ఉన్నాయిAmazon Great Indian Festival సేల్ మొదలుకానున్నది!! వీటిపై భారీ ఆఫర్లు ఉన్నాయి

ఒప్పో A54 స్పెసిఫికేషన్స్

ఒప్పో A54 స్పెసిఫికేషన్స్

ఒప్పో A54 స్మార్ట్‌ఫోన్‌ యొక్క స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఇది ఆండ్రాయిడ్ 10 ఆధారిత కలర్‌ఓఎస్ 7.1 తో రన్ అవుతుంది. ఇది 1,080x2,400 పిక్సెల్స్ పరిమాణంలో 6.5-అంగుళాల డిస్ప్లేని 90.5 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 SoC చేత శక్తిని కలిగి ఉండి 8GB RAMతో జత చేయబడి ఉంటుంది. కెమెరాల విషయానికొస్తే ఇది వెనుక భాగంలో దీర్ఘచతురస్రాకారంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 12 మెగాపిక్సెల్ సెన్సార్ తో మెయిన్ కెమెరా, అల్ట్రా-వైడ్ లెన్స్‌ సెన్సార్ తో 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. వీటితో పాటుగా 2 మెగాపిక్సెల్ ఇమేజ్ సెన్సార్లతో కూడిన రెండు కెమెరాలను కూడా కలిగి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందుభాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. అలాగే కనెక్టివిటీ ఎంపికలలో ఇది డ్యూయల్ సిమ్ స్లాట్ ను కలిగి ఉంది. అలాగే వై-ఫై, LTE, బ్లూటూత్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ మరియు ఛార్జింగ్ కోసం యుఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ మద్దతుతో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. చివరగా ఈ ఫోన్ 162.0x75.5x8.9mm కొలతలతో 192 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.

ఒప్పో F19 స్పెసిఫికేషన్స్

ఒప్పో F19 స్పెసిఫికేషన్స్

ఒప్పో F19 ఆండ్రాయిడ్ 11 పై కలర్‌ఓఎస్ 11.1 తో నడుస్తుంది. ఇది 6.43-అంగుళాల పూర్తి HD+ (1,080x2,400 పిక్సెల్స్) AMOLED డిస్‌ప్లేను 20: 9 కారక నిష్పత్తితో కలిగి ఉంది. ఇది 6GB RAM తో పాటు ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 SoC ని కలిగి ఉంది. ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది, ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ ఉన్నాయి. ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. Oppo F19 లో కంపెనీ 128GB అంతర్గత నిల్వను అందించింది. ఫోన్‌లో డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 4G LTE, Wi-Fi, బ్లూటూత్, USB టైప్-సి మరియు 3.5 మిమీ హెడ్‌ఫోన్ జాక్‌తో సహా సాధారణ కనెక్టివిటీ ఎంపికలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా, ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.

Best Mobiles in India

Read more about:
English summary
Oppo A54, Oppo F19 Smartphones Price Increased Up to Rs.1,000 in India: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X