Oppo A54 స్మార్ట్‌ఫోన్ ఇండియాలో విడుదలైంది!! ధరలు, ఫీచర్స్ ఇవిగో...
BBK యాజమాన్యంలోని కన్స్యూమర్ టెక్నాలజీ బ్రాండ్ ఒప్పో సంస్థ నేడు ఇండియాలో మరొక కొత్త స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేసింది. ఒప్పో A54 పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను బడ్జెట్ ధరలో విడుదల చేసింది. అంతర్జాతీయ మార్కెట్ లో ఇప్పటికే విడుదలైన ఈ ఫోన్ నేడు ఇండియాలో కూడా విడుదలైంది. ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ SoC చేత రన్ అవుతూ 6GB వరకు RAM తో జతచేయబడి ఉంటుంది. వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ మరియు సూక్ష్మమైన డిజైన్‌ను కలిగి ఉండే ఒప్పో A54 గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఒప్పో A54 స్మార్ట్‌ఫోన్ ధరల వివరాలు
ఒప్పో A54 స్మార్ట్‌ఫోన్ ఇండియాలో మూడు వేర్వేరు వేరియంట్లలో విడుదల అయింది. ఇందులో 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర 13,490 రూపాయలు. 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర 14,490 రూపాయలు. చివరగా 6GB ర్యామ్ + 128GB వేరియంట్ యొక్క ధర రూ.15,990. ఇది మూన్లైట్ గోల్డ్, స్టార్రి బ్లూ మరియు క్రిస్టల్ బ్లాక్ అనే మూడు కలర్ ఎంపికలలో లభిస్తుంది. ఈ ఫోన్ యొక్క మొదటి అమ్మకం రేపు అంటే ఏప్రిల్ 20న మధ్యాహ్నం 12 గంటలకు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ లో మొదలుకానున్నాయి.

ఒప్పో A54 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్
Oppo A54 స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది స్టాండర్డ్ 60Hz రిఫ్రెష్ రేట్ మద్దతుతో 6.51-అంగుళాల HD + డిస్ప్లేను కలిగి ఉంటుంది. అలాగే ఇది 89.2% స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో లభిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 10 అవుట్ ఆఫ్ బాక్స్ ఆధారంగా డివైస్ కలర్ ఓఎస్ 7.2 లో రన్ అవుతుంది. అలాగే ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో P35 SoC చిప్ సెట్ ను కలిగి ఉండి 6GB RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో జతచేయబడి వస్తుంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ సహాయంతో మెమొరీని 256GB వరకు విస్తరించవచ్చు.

ఒప్పో A54 ట్రిపుల్-కెమెరా సెటప్ ఫీచర్స్
Oppo A54 స్మార్ట్‌ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 13MP లెన్స్ తో ప్రైమరీ సెన్సార్ కెమెరా, 2MP మాక్రో సెన్సార్ మరియు 2MP బోకె సెన్సార్ కెమెరాలు జతచేయబడి వస్తాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ఫోన్ ముందు భాగంలో 16MP సెల్ఫీ సెన్సార్ కెమెరాను కలిగి ఉంది.

ఒప్పో A54 స్మార్ట్‌ఫోన్ 5,000mAh బ్యాటరీ ఫీచర్స్
Oppo A54 స్మార్ట్‌ఫోన్ యొక్క ఇతర ఫీచర్ల విషయానికి వస్తే ఇది 5,000mAh పెద్ద బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్కు మద్దతును ఇస్తుంది. అదనపు భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ను కలిగి ఉంది. దీనితో పాటుగా ఈ ఫోన్ ఫేస్ అన్‌లాక్‌కు కూడా మద్దతును ఇస్తుంది. దీని యొక్క కనెక్టివిటీ ఎంపికల విషయానికి వస్తే ఇది వై-ఫై, బ్లూటూత్ 5, 4G మరియు USB టైప్-సి పోర్ట్ మరియు 3.5mm ఆడియో జాక్ వంటి ఎంపికలను కలిగి ఉంటుంది.


Click it and Unblock the Notifications








