ఒప్పో A56 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది!! ధరలు, ఫీచర్స్ ఇవిగో...

|

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో తన యొక్క పోర్ట్‌ఫోలియోను విస్తరించుకోవడానికి కంపెనీ A-సిరీస్ విభాగంలో ఒప్పోA56 5G ను చైనీస్ మార్కెట్‌లో లాంచ్ చేసింది. మిడ్-రేంజ్ విభాగంలో లభించే ఈ హ్యాండ్‌సెట్‌ డ్యూయల్ కెమెరా సెటప్ మరియు ముందు భాగంలో వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్ వంటి ఫీచర్స్ ఉండి మీడియాటెక్ డైమెన్సిటీ 700 SoC ద్వారా శక్తిని పొందుతూ 5,000mAh పెద్ద బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఈ ఫోన్ మూడు కలర్ ఆప్షన్లలో లాంచ్ చేయబడింది. వెనుక కెమెరా మాడ్యూల్ దీర్ఘచతురస్రాకారంలో ఉండి రెండు సెన్సార్‌లు ఒకదానికొకటి క్రింద మరొకటి ఉండి మరియు పక్కన ఫ్లాష్ అమర్చబడి ఉంచబడుతుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

ఒప్పో A56 5G ధరల వివరాలు

ఒప్పో A56 5G ధరల వివరాలు

ఒప్పో బ్రాండ్ యొక్క కొత్త ఫోన్ ఒప్పో A56 5G చైనాలో 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ఏకైక ఎంపికలో విడుదల చేసింది. దీని యొక్క ధర CNY 1,599 (దాదాపు రూ. 18,800)గా ఉంది. క్లౌడ్ స్మోక్ బ్లూ, సాఫ్ట్ ఫాగ్ బ్లాక్ మరియు విండ్ చిమ్ పర్పుల్ అనే మూడు కలర్ ఆప్షన్‌లలో లభించే ఈ ఫోన్ ఇండియాలో కూడా దాదాపుగా ఇదే ధరల వద్ద త్వరలోనే లాంచ్ చేసే అవకాశం ఉంది. Oppo A56 5G ప్రస్తుతం చైనాలో ప్రీ-ఆర్డర్ల కోసం సిద్ధంగా ఉంది.

జియో కంటే వోడాఫోన్ ఐడియా (Vi) ప్రీపెయిడ్ ప్లాన్‌లు మెరుగ్గా ఉండడానికి కారణాలు ఇవే...జియో కంటే వోడాఫోన్ ఐడియా (Vi) ప్రీపెయిడ్ ప్లాన్‌లు మెరుగ్గా ఉండడానికి కారణాలు ఇవే...

ఒప్పో A56 5G స్పెసిఫికేషన్స్
 

ఒప్పో A56 5G స్పెసిఫికేషన్స్

ఒప్పో A56 5G యొక్క స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఇది ఆండ్రాయిడ్11-ఆధారిత కలర్OS 11.1తో రన్ అవుతుంది. ఇది 60Hz రిఫ్రెష్ రేట్, 120Hz టచ్ శాంప్లింగ్ రేట్, 269ppi పిక్సెల్ డెన్సిటీ, 480 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ మరియు 88.7 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో 6.5-అంగుళాల HD+ (720x1,600 పిక్సెల్‌లు) A-Si డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది గ్లాస్ 3 ప్రొటెక్షన్ ను కలిగి ఉంటుంది. ఇది MediaTek డైమెన్సిటీ 700 ఆక్టా-కోర్ SoC ద్వారా అందించబడుతుంది. ఇది Mali-G57 MC2 GPU మరియు 6GB RAMతో జత చేయబడింది. SDXC కార్డ్‌ని ఉపయోగించి మరింత విస్తరించుకునే ఎంపికతో ఇంటర్నల్ స్టోరేజ్ 128GB వద్ద జాబితా చేయబడింది.

వోడాఫోన్ ఐడియా(Vi) 180 రోజుల వాలిడిటీ ప్లాన్‌లో అద్బుతమైన ప్రయోజనాలు ఎన్నో!!వోడాఫోన్ ఐడియా(Vi) 180 రోజుల వాలిడిటీ ప్లాన్‌లో అద్బుతమైన ప్రయోజనాలు ఎన్నో!!

ఒప్పో A56 5G

ఒప్పో A56 5G యొక్క ఆప్టిక్స్ విషయానికొస్తే ఇది డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో f/2.2 ఎపర్చర్‌తో 13-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ మరియు f/2.4 ఎపర్చర్‌తో 2-మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. వెనుక కెమెరా ఫీచర్లలో నైట్ సీన్ మోడ్, వీడియో, పోర్ట్రెయిట్, స్లో మోషన్, టైమ్-లాప్స్ వంటివి మరిన్ని ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాల్ కోసం ముందు భాగంలో f/2.0 ఎపర్చర్‌తో 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. అలాగే ఇది 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఇది ఫేస్ అన్‌లాక్‌ని కూడా సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో డ్యూయల్-సిమ్ (నానో) స్లాట్‌లు, USB టైప్-సి పోర్ట్, బ్లూటూత్ v5.1, Wi-Fi 5, 3.5mm ఆడియో జాక్, GPS మరియు మరిన్ని ఉన్నాయి. ఫోన్ 163.8x75.6x8.4mm కొలతలు మరియు 189.5 గ్రాముల బరువు ఉంటుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Oppo A56 5G Smartphone Launched With MediaTek Dimensity 700 SoC and 5,000mAh Battery: Price, Specs, India Launch Date and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X