Oppo A59 స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపు.. డిస్కౌంట్, సేల్ వివరాలు..!!
ఒప్పో సంస్థ తన బడ్జెట్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ ధరను తగ్గించింది. గత సంవత్సరం విడుదలైన Oppo A59 స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రెండు వేరియంట్లలో కొనుగోలుకు అందుబాటులో ఉండగా.. రెండింటి పైనా తగ్గింపు ధరను పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత OSను కలిగి ఉంటుంది. మరియు 5000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ మెరుగైన బ్యాటరీ టెక్నాలజీని కలిగి ఉంటుంది.
గత సంవత్సరం డిసెంబర్‌లో ఒప్పో A59 స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్ 4GB ర్యామ్, 6GB ర్యామ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. 4GB ర్యామ్ వేరియంట్‌పై రూ.1000 ధర తగ్గి.. ప్రస్తుతం రూ.13999 కు కొనుగోలు చేయవచ్చు. అదే 6GB ర్యామ్ వేరియంట్‌పై రూ.500 తగ్గి.. రూ.15499 వద్ద కొనుగోలు చేయవచ్చు.

ఒప్పో A59 స్పెసిఫికేషన్లు : ఒప్పో A59 5G స్మార్ట్‌ఫోన్ 90Hz రీఫ్రెష్ రేట్‌తో 6.56 అంగుళాల IPS LCD ను కలిగి ఉంటుంది. 720*1612 పిక్సల్ రిజల్యూషన్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ColorOS 13.1 OS ను కలిగి ఉంటుంది. మరియు 7nm మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్‌పైన పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ రెండు రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. స్టార్రీ బ్లాక్, సిల్క్ గోల్డ్ రంగుల్లో లభిస్తుంది.
5000mAh బ్యాటరీ ప్యాక్ : ఈ ఒప్పో A59 స్మార్ట్‌ఫోన్ 33W వూక్ ఛార్జింగ్ సపోర్టుతో 5000 mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ టెక్నాలజీ 80 శాతం వద్ద బ్యాటరీ ఛార్జింగ్‌ను నిలిపివేస్తుంది. యూజర్లు పూర్తి ఛార్జింగ్ చేయాలని భావిస్తేనే అనుమతిస్తుంది. మరియు సూపర్ పవర్ సేవింగ్ మోడ్ బ్యాటరీ పనితీరును కాపాడుతుంది.

6GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ : ఎక్కువ కాలం బ్యాటరీ మన్నికను కోరుకొనే వినియోగదారులు ఈ ఫోన్ మెరుగైన పనితీరును కనబరుస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ గరిష్ఠంగా 6GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. మరియు ఈ ఒప్పో హ్యాండ్‌సెట్ IP54 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్‌తో వస్తుంది.
డ్యూయల్ కెమెరా : ఈ ఒప్పో A59 స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. అందులో 13MP ప్రధాన కెమెరా మరియు 2MP సెకండరీ కెమెరాను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ స్మార్ట్‌ఫోన్ 8MP కెమెరాను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఒప్పో ఆన్‌లైన్ స్టోర్ సహా ఇతర ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫాంలు, ఇతర రిటైల్ స్టోర్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications