Home
News

OPPO నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌.. డిజైన్‌, ఫీచర్లు లీక్‌..!!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో నుంచి కొత్త ఫోన్‌ త్వరలో విడుదల కానుంది. ఒప్పో తన అధికారిక సోషల్‌ మీడియా వేదికల ద్వారా Oppo A78 ఫోన్‌ ఫస్ట్‌లుక్‌ను షేర్‌ చేసింది. ఈ ఫోన్‌ గ్రీన్‌ షేడ్‌ను కలిగి ఉంది. కింది వైపు USB టైప్‌-C పోర్టును కలిగి ఉంది.

ఒప్పో A78 స్మార్ట్‌ఫోన్‌ ప్లాట్‌ సైడ్‌లతో రానుంది. మరియు డ్యూయల్‌ కెమెరా, LED ఫ్లాష్‌ లైట్‌ను కలిగి ఉంటుంది. ఎడమవైపున సిమ్‌ ట్రే ఉంది. ఈ ఫోన్‌ ఇటీవలే ఇండోనేషియాలో విడుదల చేశారు. అదే స్పెసిఫికేషన్లు కలిగిన ఫోన్‌ను భారత్‌లోనూ లాంచ్‌ చేసే అవకాశం ఉంది. ఈ ఫోన్‌ వివరాలు కొన్ని లీక్‌ అయ్యాయి.

Oppo A78 4g smartphone

ఒప్పో A78 స్మార్ట్‌ఫోన్‌ 6.43 అంగుళాల పుల్‌ HD+ అమోలెడ్‌ డిస్‌ప్లేతో రానుంది. ఈ ఫోన్‌ 90Hz రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉంటుంది. 2400*1080 పిక్సల్స్‌ రిజల్యూషన్‌తో వస్తుంది. ఈ ఫోన్ 183 గ్రాముల బరువు ఉంటుంది. మరియు 7.93 థిక్‌నెస్‌తో రానుంది. మెరుగైన మల్టీమీడియా అనుభూతి కోసం ఈ ఫోన్‌ డ్యూయల్‌ స్టీరియో స్పీకర్లను కలిగి ఉండే అవకాశం ఉంది.

ఒప్పో కొత్త ఫోన్‌ స్నాప్‌ డ్రాగన్‌ 680 చిప్‌సెట్‌తో వచ్చే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత కలర్‌OS 13.1పై పనిచేస్తుంది. ఈ ఒప్పో A78 ఫోన్‌ 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మరియు 67W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో రానున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ 8GB ర్యామ్‌, 256GB అంతర్గత స్టోరేజీని కలిగి ఉంటుందని తెలుస్తోంది. మిగిలిన వేరియంట్ల వివరాలు తెలియాల్సి ఉంది.

ఒప్పో స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలు కలిగి ఉండే అవకాశం ఉంది. 50MP ప్రైమరీ కెమెరా సహా 2MP సెకండ్రీ కెమెరాలను కలిగి ఉంటుంది. ముందు వైపు 8MP కెమెరాతో రానున్నట్లు తెలుస్తోంది. కొన్ని నివేదికల ప్రకారం ఈ A78 స్మార్ట్‌ఫోన్‌ ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది.

ఒప్పో ఈ కొత్త ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి ఆగస్టులో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ A78 స్మార్ట్‌ఫోన్‌ రూ.20,000 కంటే తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఫోన్‌ స్పెసిఫికేషన్ల, ధర, విడుదల తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఒప్పో భారత్‌ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌పై అధిక దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఒప్పొ రెనో 10 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. రెనో 10, రెనో 10 ప్రో, రెనో 10 ప్రో+ ఫోన్లలో కెమెరా విభాగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. తొలిసారి ఈ ఫోన్లు టెలిఫోటో కెమెరాలను కలిగి ఉన్నాయి. అత్యాధునిక ఇమేజింగ్‌ టెక్నాలజీని కలిగి ఉంది. ఈ ఫోన్లు ఛార్జింగ్‌ సహా డిజైన్‌, ఇతర ఫీచర్లు వినియోగదారులను త్వరగానే ఆకట్టుకున్నాయి.

దీంతోపాటు ఒప్పో నుంచి k11 5G స్మార్ట్‌ఫోన్‌ కూడా త్వరలో లాంచ్‌ కానుంది. ఇందుకు సంబంధించిన కొన్ని కీలక స్పెసిఫికేషన్లను సంస్థ టీజర్‌ రూపంలో విడుదల చేసింది. దీంతోపాటు ఈ ఫోన్‌ కీలక సమాచారం ఇప్పటికే లీక్‌ అయింది. 50MP ప్రైమరీ కెమెరా సహా 80W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Oppo A78 4g smartphone may launch in august in india under rs 20000 segment
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X