Home
News

Oppo నుంచి మరో కొత్త 5G ఫోన్ లాంచ్ అయింది! ధర, స్పెసిఫికేషన్లు

By Maheswara

ఒప్పో సంస్థ ఫోన్లకు ఇండియాలో మంచి డిమాండ్ ఉంది. విభిన్నమైన డిజైన్ లతో సెల్ఫీ కెమెరా మాడ్యూల్ మరియు బ్యాటరీ బ్యాకప్‌ల కారణంగా ఒప్పో ఫోన్‌లకు ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పుడు ఒప్పో కంపెనీ భారతదేశంలో కొత్త Oppo A79 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇది బడ్జెట్ ధరలో మధ్య శ్రేణి స్మార్ట్‌ఫోన్ గా లాంచ్ అయింది.

అవును, Oppo A79 5G స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం భారత మార్కెట్‌లో లాంచ్ అయింది. ఇది మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ అయినప్పటికీ, ఇది ప్రీమియం ఫోన్ లాగా కనిపించేలా రూపొందించబడింది. ఇది మీడియా టెక్ డైమెన్సిటీ 6020 SoC ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న ఇతర ఫీచర్లు ఏమిటో తెలుసుకోవడానికి ఈ కథనాన్ని చదవండి.

Oppo A79 5G With 6.7inch Display, 50MP AI Camera And 5000mAh Battery Launched In India. Price,Specifications Here

Oppo A79 5G డిస్‌ప్లే డిజైన్ ఎలా ఉంది?
Oppo A79 5G స్మార్ట్‌ఫోన్ 6.72-అంగుళాల FullHD ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 2400x1080 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. ఇది 91.4% డిస్ప్లే టు ఫారమ్ రేషియోను కలిగి ఉంది. ఇంకా, డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది మరియు "ఆల్-డే AI ఐ కంఫర్ట్" టెక్నాలజీ ని కలిగి ఉంది.

Oppo A79 5G ప్రాసెసర్ వివరాలు
Oppo A79 5G స్మార్ట్‌ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 6020 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది ColorOS 13 సపోర్ట్‌తో ఆండ్రాయిడ్ 13 OSలో రన్ అవుతుంది. ఇది 8GB RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీతో కూడా రానుంది. మెమరీ కార్డ్ మద్దతుతో 1TB వరకు స్టోరేజీ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఈ స్మార్ట్‌ఫోన్ అనుమతిస్తుంది.

Oppo A79 5G కెమెరా సెటప్ వివరాలు
Oppo A79 5G స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను పొందుతుంది. ప్రధాన కెమెరాలో 50 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. రెండవ కెమెరా పోర్ట్రెయిట్ లెన్స్‌తో కూడిన 2-మెగాపిక్సెల్ సెన్సార్. ఇది కాకుండా, 8 మెగాపిక్సెల్ సెన్సార్ సామర్థ్యం గల సెల్ఫీ కెమెరా అందించబడింది. ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క ప్రధాన హైలైట్ ఏమిటంటే వెనుక కెమెరాలు మెరిసే రింగ్ హౌసింగ్‌లో ఉంచబడ్డాయి.

Oppo A79 5G బ్యాటరీ మరియు ఇతర వివరాలు
Oppo A79 5G స్మార్ట్‌ఫోన్‌ 5,000mAh కెపాసిటీ బ్యాటరీని కలిగి ఉంది. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇతర కనెక్టివిటీ ఎంపికలలో బ్లూటూత్ 5.3, USB టైప్-C, ఇయర్‌ఫోన్ జాక్ ఉన్నాయి. అంతేకాకుండా, ఈ స్మార్ట్‌ఫోన్ 3.5mm స్టీరియో సపోర్ట్‌తో డ్యూయల్ స్పీకర్ సెటప్‌ను కలిగి ఉంది.

Oppo A79 5G ధర మరియు లభ్యత వివరాలు
Oppo A79 5G స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో ధర రూ.19,999 కి లాంచ్ అయింది. అలాగే, లాంచ్ ఆఫర్ లో రూ. 4,000 వరకు క్యాష్‌బ్యాక్ మరియు నో కాస్ట్ EMI ఎంపికలను అందిస్తుంది. ఇది కాకుండా, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో రూ.4,000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్ గ్లోయింగ్ గ్రీన్ మరియు మిస్టరీ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ అక్టోబర్ 28 నుంచి అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Oppo A79 5G With 6.7inch Display, 50MP AI Camera And 5000mAh Battery Launched In India. Price,Specifications Here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X