64 gb ఇంటర్నెల్ మెమొరీ, 5.7 ఇంచుల స్క్రీన్ తో ఒప్పో A83 2018 లాంచ్ అయింది

|

ఒప్పో ఈరోజు తన కొత్త ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ ను ఇండియా లో అనౌన్స్ చేసింది. ఈ సంవత్సరం జనవరి లో లాంచ్ చేసిన ఒప్పో A83 కు అప్గ్రేడ్ వర్షన్ గా ఒప్పోA83 2018 ను పేర్కొంది. ఈ స్మార్ట్ ఫోన్ నికరంగా 15,990 రూపాయలుగా ఉండి, అమెజాన్, ఫ్లిప్కార్ట్ మరియు పేటీయం లలో మాత్రమే కాకుండా ఆఫ్లైన్ మార్కెట్ లో కూడా లభించనుందని తెలిపారు. ఈ స్మార్ట్ ఫోన్ నీలం మరియు గోల్డ్ రంగులలో లభ్యమవుతున్నాయి.

64 gb ఇంటర్నెల్ మెమొరీ, 5.7 ఇంచుల స్క్రీన్ తో ఒప్పో A83 2018 లాంచ్

 

స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే, ఈ ఒప్పో A83 2018., 5.7 ఇంచుల ఫుల్ స్క్రీన్ డిస్ప్లే కలిగి 1440 x 720 పిక్సెల్స్ రిసొల్యూషన్ , 282 PPI కలిగి ఉంటుంది. మరియు MT6763T ఆక్టాకోర్ ప్రాసెసర్ ను కలిగి ఉండి, 4GB రాం,64 GB అంతర్గత మెమొరీ, 256 GB విస్తరించుకోగలిగిన ఎక్స్పాన్డబుల్ మెమరీ కార్డ్ స్లాట్ సౌకర్యంతో వచ్చింది.

ఇక కెమరా డిపార్ట్మెంట్ కిందకు వస్తే ఈ ఒప్పో A83 2018, అల్ట్రా HD మోడ్ కలిగిన 13 మెగా పిక్సెల్స్ రేర్ కెమరా, బ్యూటీ రికగ్నిషన్ టెక్నాలజీతో 8 మెగా పిక్సెల్స్ సెల్ఫీ కెమరా నిక్షిప్తమై ఉంటుoది.

సాఫ్ట్వేర్ విభాగంలో ఒప్పో A83 2018, ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ తో తమ వ్యక్తిగత UI అయిన Color OS 3.2 తో తీసుకుని వచ్చారు. మరియు ఇందులో 3,180 mah బాటరీని కలిగి ఉండగా, ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ మాత్రం లేదు.

ఈ డ్యూయల్ సిం ఫోన్, వేగవంతమైన ఫేషియల్ అన్లాక్ ఫీచర్ ను కూడా కలిగి ఉంటుంది. కానీ ఫింగర్ ప్రింట్ సౌకర్యం లేదు.

ఆంధ్రప్రదేశ్‌లో లక్షా 30 వేల వ్యక్తిగత వివరాలు లీక్ ! విచారణ దిశగా..

ఒప్పో ఇండియా డైరెక్టర్ విల్ యాంగ్ మాటల్లో “ ఈ ఒప్పో A83 2018 మొబైల్ ను కేవలం యువతను దృష్టిలో ఉంచుకుని విడుదల చేయడమైనది. మంచి ఫొటోలతో కూడిన సెల్ఫీ ఎక్స్పీరియన్స్ ఇచ్చే విధంగా A మరియు F సిరీస్ లను రూపొందించడమైనది. ఒప్పో A83 ద్వారా మేము అపారమైన స్పందనను చూరగొన్నాం, ఈ A83 విజయంలో భాగంగానే , అప్గ్రేడ్ వర్షన్ అయిన ఒప్పో A83 2018ను విడుదల చేస్తున్నాం. తద్వారా ఈ ఒప్పో A83 2018 లో ఉత్తమమైన సెల్ఫీ ఫీచర్లను కలిగి యువతకు మంచి అనుభవాన్ని ఇవ్వగలదని భావిస్తున్నాం” అని తెలిపారు.

మరియు ఈ ఒప్పో A83 2018 లోని AI టెక్నాలజీ, అపారమైన స్టోరేజ్, పనితీరు మొదలైన అంశాల ద్వారా కుటుంబ సభ్యులతో మరియు స్నేహితులతో మంచి జ్ఞాపకాలను కాప్చర్ చేసుకోగలరు, అని ఆశాభావం వ్యక్తం చేసారు.

ఒప్పో A83 2018 , A83 కు మైనర్ అప్గ్రేడ్ అని మాత్రమే చెప్పవచ్చు. స్టోరేజ్, రాం లలో మాత్రమే మార్పులు చేసి 2000 రూపాయలు అదనంగా మార్కెట్లో అవైలబుల్ లో ఉంచారు.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Oppo today launched a new entry-level smartphone in India. Dubbed as the Oppo A83 2018, it is an upgrade of the Oppo A83 that was launched in January this year. The A83 2018 carries a price tag of Rs. 15,990, and it will be available for sale on Amazon, Flipkart, and Paytm as well as offline stores.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more