ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌తో Oppo A83

Posted By: BOMMU SIVANJANEYULU

ప్రముఖ చైనా ఫోన్‌ల కంపెనీ ఒప్పో, సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. ఒప్పో ఏ83 పేరుతో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. 18:9 ఫుల్ విజన్ డిస్‌ప్లే, ఫేషియల్ రికగ్నిషన్ వంటి విప్లవాత్మక ఫీచర్లతో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ ధర చైనా మార్కెట్లో 1,399 యువాన్‌లు (ఇండియన్ కరెన్సీలో ఈ విలువ షుమారుగా రూ.13,700).

ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌తో Oppo A83

బ్లాక్ ఇంకా చాంపేన్ కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. సేల్ డిసెంబర్ 26 నుంచి ప్రారంభమవుతుంది. ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్ అందుబాటుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావల్సి ఉంది.

ఒప్పో ఏ83 (Oppo A83) స్పెసిఫికేషన్స్..

5.7 అంగుళాల హైడెఫినిషన్ ప్లస్ (720x 1440 పిక్సల్స్) ఎల్‌సీడీ డిస్‌ప్లే విత్ 18:9 యాస్పెక్ట్ రేషియో, ఆండ్రాయిడ్ నౌగట్ ఆధారిత కలర్ 3.2 వర్షన్ ఆపరేటింగ్ సిస్టం, 2.5గిగాహెట్జ్ ఆక్టా-కోర్ ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్ సపోర్ట్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, వై-ఫై, జీపీఎస్, బ్లుటూత్ 4.2, 3.5ఎమ్ఎమ్
హెడ్‌ఫోన్ జాక్, వై-ఫై డైరెక్ట్), ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ (ఈ ఫీచర్ ద్వారా 0.18 సెకనల్లో ఫోన్‌ను అన్ లాక్ చేసుకోవచ్చు), 3090mAh బ్యాటరీ.

గిజ్‌బాట్ కాంటెస్ట్‌లో పాల్గొనండి, Honor 7X గెలుపొందండి !

ఒప్పో ఏ83లో నిక్షిప్తం చేసిన ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ యూజర్ ముఖానికి సంబంధించి 128 యునిక్ ఫీచర్ పాయింట్లను ఉపయోగించుకుంటుంది. 150.5x73.1x7.7 మిల్లీ మీటర్ల చుట్టుకొలతతో వస్తోన్న ఈ డివైస్ బరువు 143 గ్రాములుగా ఉంటుంది.

English summary
Oppo A83 sports a 5.7-inch Full HD+ display with a screen resolution of 1,440×720 pixels and an aspect ratio of 18:9.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot