Home
News

హైదరాబాద్ లో ఒప్పో తొలి R&D సెంటర్‌

సెల్ఫీ ఆధారిత స్మార్ట్‌ఫోన్ల సరికొత్త ట్రెండ్‌కు తెరతీసిన ఒప్పో తన మొదటి రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కార్యాలయాన్ని ఇండియాలో ప్రారభించనుంది.

సెల్ఫీ ఆధారిత స్మార్ట్‌ఫోన్ల సరికొత్త ట్రెండ్‌కు తెరతీసిన ఒప్పో తన మొదటి రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కార్యాలయాన్ని ఇండియాలో ప్రారభించనుంది. అయితే ఈ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం మరో విశేషం .ఈ విషయాన్ని ఒప్పో కంపెనీ సోమవారం ప్రకటించింది. అలాగే కంపెనీ ఆర్‌ అండ్‌ డీ హెడ్‌గా తస్లీమ్‌ ఆరిఫ్‌ను నియమించినట్టు ఒక ప్రకటనలో తెలిపింది.కాగా ఒప్పో కంటే ముందు శాంసంగ్ మేక్ ఇండియా ఇన్నోవేషన్స్ (R&D) సెంటర్ లో ఆరిఫ్‌ పనిచేశారు .

హైదరాబాద్‌ నగరంలో మొదటి ఆర్‌ అండ్‌ డీ కార్యాలయం....

హైదరాబాద్‌ నగరంలో మొదటి ఆర్‌ అండ్‌ డీ కార్యాలయం....

నూతన ఆవిష్కరణలు, సాంకేతిక సామర్ధ్యాలతో భారత వినియోగదారులకు ప్రత్యేకమైన అనుభవాలను అందించే దిశగా దృష్టి కేంద్రీకరిస్తున్నామనీ, ఈ క్రమంలో హైదరాబాద్‌ నగరంలో మొదటి ఆర్‌ అండ్‌ డీ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నామని ఒప్పో ఇండియా ప్రెసిడెంట్ చార్లెస్ వాంగ్ తెలిపారు.

మొబైల్ సాఫ్ట్‌వేర్ డిజైన్, డెవలప్‌మెంట్‌ లో 15 ఏళ్ల అనుభవం ఉన్న....

మొబైల్ సాఫ్ట్‌వేర్ డిజైన్, డెవలప్‌మెంట్‌ లో 15 ఏళ్ల అనుభవం ఉన్న....

మొబైల్ సాఫ్ట్‌వేర్ డిజైన్, డెవలప్‌మెంట్‌ లో దాదాపు 15 ఏళ్ల అనుభవం ఉన్న ఆరిఫ్‌ నైపుణ్యంతో ఒక బలమైన టీంను నిర్మించనున్నామనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు చైనా తర్వాత హైదరాబాద్‌ కేంద్రం రెండో అతిపెద్ద స్థానంగా ఉంటుందనే ధీమాను వ్యక్తం చేశారు.

 

 

ప్రపంచవ్యాప్తంగా ఆరు కేంద్రాలున్నాయి....

ప్రపంచవ్యాప్తంగా ఆరు కేంద్రాలున్నాయి....

ప్రపంచవ్యాప్తంగా జపాన్‌, చైనా,అమెరికా సహా ఇతర దేశాల్లో దాదాపు ఆరు కేంద్రాలున్నాయి. త్వరలోనే ఏడవ ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌ హైదరాబాద్‌లో నగరంలో కొలువు దీరనుంది.

Best Mobiles in India

English summary
Oppo Announces First India R&D Center in Hyderabad.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X