ఇండియా లో 5G ల్యాబ్ ను ఏర్పాటు చేయనున్న Oppo. ఎక్కడో కాదు మన హైదరాబాద్ లోనే.

By Maheswara
|

Oppo తన మొదటి 5G ఇన్నోవేషన్ ల్యాబ్‌ను తన స్వదేశమైన చైనా వెలుపల మొట్టమొదటి సారి ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త 5 జి ల్యాబ్‌ను భారతదేశంలోని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నారు. భారతదేశం మరియు చైనా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ఇలాంటి వార్తలు రావడం గమనించవలసిన విషయం.

5G ఇన్నోవేషన్స్ ల్యాబ్‌

భారతదేశం 5G నెట్‌వర్కింగ్‌ను స్వీకరించడానికి ఆసక్తి చూపడంతో, ఒప్పో ఈ ప్రాంతంలో సొంతంగా 5G ఇన్నోవేషన్స్ ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఏది ఏమయినప్పటికీ, భారతదేశం మరియు చైనాల మధ్య రాజకీయ ఘర్షణల మధ్య ఈ ప్రకటన రావడం విశేషం. ఇది చైనాతో సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక చైనా సంస్థలపై నిషేధాన్ని విధించింది. ఈ వివరాలు ప్రముఖ వార్త సంస్థల ద్వారా వెలువడ్డాయి.కొత్త మరియు వేగవంతమైన బ్యాండ్‌విడ్త్‌ను స్వీకరించే ప్రయత్నాలను వేగవంతం చేయడానికి సన్నాహాలు జఱుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి, రిలయన్స్ జియో ను  దేశంలో 5G సేవలను అందించే మొట్టమొదటి స్థానిక టెలికం ఆపరేటర్‌గా భావిస్తున్నారు. దాని సేవలు 2021 రెండవ భాగంలో ప్రారంభించబడతాయి.

Also Read: అమ్మాయిలకే ప్రత్యేకంగా కొత్త ఫోన్ ! ధర కూడా తక్కువే ...రూ.6,888 మాత్రమే!Also Read: అమ్మాయిలకే ప్రత్యేకంగా కొత్త ఫోన్ ! ధర కూడా తక్కువే ...రూ.6,888 మాత్రమే!

5G కోసం పరిశోధన మరియు అభివృద్ధి ప్రయత్నాల కోసం
 

5G కోసం పరిశోధన మరియు అభివృద్ధి ప్రయత్నాల కోసం

ఇంకా, ఈ చైనీస్ టెక్ దిగ్గజం కొత్త పెట్టుబడి కూడా ఈ ప్రాంతంలోని 5G కోసం పరిశోధన మరియు అభివృద్ధి ప్రయత్నాలను పెంచుతుంది. ఒప్పో ఇండియా వైస్ ప్రెసిడెంట్ మరియు రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ హెడ్ తస్లీమ్ ఆరిఫ్ ప్రకారం, "ఇది విదేశాలలో ఒప్పో యొక్క మొదటి 5G ల్యాబ్. ఈ ల్యాబ్ ‌తో, మేము 5G శకం కోసం కోర్ టెక్నాలజీలను అభివృద్ధి చేయడానికి మరియు మొత్తం పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి కృషి చేస్తాము, ఇంకా భారతదేశాన్ని 5G ప్రయాణంలో మద్దతు ఇవ్వడం కూడా మేము లక్ష్యంగా పెట్టుకున్నాము."అని వివరించారు.

చైనాలో ఉన్న ల్యాబ్ తర్వాత రెండవది

చైనాలో ఉన్న ల్యాబ్ తర్వాత రెండవది

ఈ క్రొత్త ప్రయోగశాల చైనాలో ఉన్న ల్యాబ్ తర్వాత రెండవది. ముఖ్యంగా, ఒప్పో అదనపు ఫంక్షనల్ ల్యాబ్‌లను వ్యవస్థాపించాలని యోచిస్తోంది. ఇది కెమెరా, పవర్ మరియు బ్యాటరీ మరియు దాని స్మార్ట్‌ఫోన్‌ల పనితీరుతో సహా పరిశోధన మరియు అభివృద్ధి కోసం వివిధ వర్గాలలో ప్రత్యేకత కలిగి ఉంటుంది. ఈ క్రొత్త సదుపాయం సంస్థకు "ప్రపంచ వ్యాప్తం ఎదగడానికి మరియు గుర్తింపు పొందటానికి " సహాయపడే టెక్నాలజీ ని అందిస్తుంది.  మరియు దాని అంతర్జాతీయ మరియు భారతీయ కస్టమర్ల కోసం ఉత్పత్తుల అభివృద్ధికి కూడా సహాయపడుతుంది.

Best Mobiles in India

English summary
Oppo Announces Its Plans To Setup New 5G innovation Lab In Hyderabad,India.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X