15 నిమిషాల్లో ఫుల్ చార్జింగ్

Written By:

బార్సిలోనాలో జరుగుతోన్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2016లో భాగంగా ప్రముఖ చైనా ఫోన్‌ల కంపెనీ Oppo తన సరికొత్త VOOC charging టెక్నాలజీని అనౌన్స్ చేసింది. ఈ టెక్నాలజీని భవిష్యత్ ఒప్పో ఫోన్‌లలో పొందుపరచనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ VOOC charging టెక్నాలజీ 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీని 15 నిమిషాల్లో పూర్తిగా చార్జ్ చేయగలదట. కేవలం 5 నిమిషాల వ్యవధిలో 45% చార్జ్‌ను ఈ టెక్నాలజీ పూర్తి చేయటం విశేషం.

15 నిమిషాల్లో ఫుల్ చార్జింగ్

తమ సూపర్ ఫాస్ట్ VOOC charging మైక్రోయూఎస్బీ అలానే యూఎస్బీ టైప్-సీ పోర్ట్‌లను సపోర్ట్ చేస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ టెక్నాలజీని సపోర్ట్ చేసే విధంగా Super VOOC ఫ్లాష్ చార్జర్ ప్లగ్, స్పెషల్ క్వాలిటీ కేబుల్ అలానే హైక్వాలిటీ మిలటరీ గ్రేడ్ మెటీరియల్స్‌తో కనెక్టర్‌లను అభివృద్ధి చేస్తున్నట్లు ఒప్పో సంస్థ వెల్లడించింది.

Read More : లీ1ఎస్ ఫోన్‌లో ఆ సమస్యలా..?

మొదటి క్విక్ చార్జింగ్ 1.0 టెక్నాలజీని క్వాల్కమ్ సంస్థ 2012లో అందుబాటులోకి తీసుకువచ్చింది. కొంత కాలం తరువాత Snapdragon 800 సాక్‌తో పాటు 2.0 క్విక్ చార్జింగ్ టెక్నాలజీని క్వాల్కమ్ అందుబాటులోకి తీసుకువచ్చింది. క్వాల్కమ్ బాటలోనే ఒప్పో (Oppo) కూడా వేగవంతంగా చార్జ్ చేయగలిగే VOOC చార్జర్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ తరువాత మోటరోలా టర్బో చార్జింగ్ టెక్నాలజీని పరిచయం చేసింది. స్మార్ట్‌‌ఫోన్ బ్యాటరీ‌లను నిమిషాల్లో చార్జ్ చేయగలిగే క్విక్ ఛార్జింగ్ టెక్నాలజీతో మార్కెట్లో సిద్ధంగా ఉన్న 6 లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

క్విక్ ఛార్జింగ్ టెక్నాలజీతో మార్కెట్లో సిద్ధంగా ఉన్న 6 హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లు

శక్తివంతమైన 2550 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో సామ్‌సంగ్ ఇటీవల ఓ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఫాస్ట్ అడాప్టివ్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తోన్న ఈ డివైస్‌ను కేవలం 1 గంట 18 నిమిషాల్లో పూర్తిగా చార్జ్ చేయవచ్చు. పూర్తిగా చార్జ్ కాబడిన బ్యాటరీ 7 గంటల 14 నిమిషాల బ్యాకప్‌ను ఇస్తుంది.

 

క్విక్ ఛార్జింగ్ టెక్నాలజీతో మార్కెట్లో సిద్ధంగా ఉన్న 6 హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లు

ఒప్పో సంస్థ ఇటీవల ఒప్పో ఫైండ్ 7ఏ పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 28000 ఎమ్ఏహెచ్. VOOC చార్జింగ్ టెక్నాలజీతో వస్తోన్న ఈ ఫోన్‌ను 1 గంట 22 నిమిషాల్లో పూర్తిగా చార్జ్ చేయవచ్చు. పూర్తిగా చార్జ్ కాబడిన బ్యాటరీ 6 గంటల 6 నిమిషాల బ్యాకప్‌ను ఇస్తుంది.

క్విక్ ఛార్జింగ్ టెక్నాలజీతో మార్కెట్లో సిద్ధంగా ఉన్న 6 హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లు

శక్తివంతమైన 3,220 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో సామ్‌సంగ్ విడుదల చేసిన గెలాక్సీ నోట్ 4 ఫాస్ట్ అడాప్టివ్ చార్జింగ్ టెక్నాలజీని కలిగి ఉంది. ఈ డివైస్‌ను కేవలం 1 గంట 38 నిమిషాల్లో పూర్తిగా చార్జ్ చేయవచ్చు. పూర్తిగా చార్జ్ కాబడిన బ్యాటరీ 8 గంటల 43 నిమిషాల బ్యాకప్‌ను ఇస్తుంది.

క్విక్ ఛార్జింగ్ టెక్నాలజీతో మార్కెట్లో సిద్ధంగా ఉన్న 6 హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లు

మోటరోలా టర్బో ఛార్జింగ్ టెక్నాలజీ పై పని చేస్తున్న గూగుల్ నెక్సుస్ 6 స్మార్ట్‌ఫోన్‌ను 1 గంట 38 నిమిషాల్లో పూర్తిగా చార్జ్ చేయవచ్చు. పూర్తిగా చార్జ్ కాబడిన బ్యాటరీ 7 గంటల 53 నిమిషాల బ్యాకప్‌ను ఇస్తుంది.

క్విక్ ఛార్జింగ్ టెక్నాలజీతో మార్కెట్లో సిద్ధంగా ఉన్న 6 హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లు

క్విక్‌చార్జ్ 2.0 టెక్నాలజీతో వస్తోన్న హెచ్‌టీసీ వన్‌ ఎమ్9 స్మార్ట్‌ఫోన్ బ్యాటరీని కేవలం 1 గంట 46 నిమిషాల్లో పూర్తిగా చార్జ్ చేయవచ్చు. పూర్తిగా చార్జ్ కాబడిన బ్యాటరీ 6 గంటల 25 నిమిషాల బ్యాకప్‌ను ఇస్తుంది.

క్విక్ ఛార్జింగ్ టెక్నాలజీతో మార్కెట్లో సిద్ధంగా ఉన్న 6 హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లు

మోటరోలా ఇటీవల విడుదల చేసిన మోటో జీ టర్బో ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ 2470 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. టర్బో పవర్ బ్యాటరీ చార్జర్‌తో వస్తోన్నఈ ఫోన్‌ను 15 నిమిషాలు చార్జ్ చేస్తే చాలు 6 గంటలకు సరిపోయే చార్జింగ్ సమకూరుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Oppo announces Super VOOC, Charges Smartphone Battery in 15 minutes.Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot