ఒప్పో నుంచి కలర్ ఓఎస్ 7, గేమింగ్ నెక్ట్స్ లెవల్‌కే ఇక

By Gizbot Bureau
|

4జీ శకం ఇంకా పూర్తిగా అయిపోలేదు. కానీ 5జీ ఫోన్లు ఒక్కటొక్కటిగా మార్కెట్లోకి రావడం మొదలవుతోంది. అయితే కొత్త నెట్‌వర్క్‌ రాగానే అందరూ కొత్త ఫోన్లు కొనేసుకోలేరు కాబట్టి - ఉన్న ఫోన్‌నే 5జీ కి అప్‌గ్రేడ్‌ చేసుకునే ఆప్షన్‌ కూడా కొన్ని ఫోన్స్‌ లో లభిస్తోంది.ఇప్పుడు కలర్‌ ఓఎస్‌ 7 వెర్షన్‌ మంచి ఫీచర్లతో జనాన్ని ఆకట్టుకోబోతోంది. కలర్‌ ఓఎస్‌ 7 ఫోన్లో ఇంటర్‌ఫేస్‌ పరంగా విప్లవాత్మకమైన మార్పులతో రాబోతోంది. అందుకే ఈ వెర్షన్‌ పట్ల జనంలో క్రేజ్ నెలకొని ఉంది.ముఖ్యంగా గేమింగ్ విభాగంలో ఈ ఫీచర్ వినియోగదారులను ఎక్కడికో తీసుకెళ్లనుంది.

కలర్‌ ఓఎస్‌ 7
 

మొబైల్‌లో ఛార్జింగ్‌ 20కి తగ్గిపోతే... ఛార్జింగ్‌ పెట్టుకో బాబూ అంటూ ఓ నోటిఫికేషన్‌ వస్తుంది. అయితే ఇది ప్రస్తుతం. త్వరలో ఈ మెసేజ్‌తోపాటు మీకు దగ్గర్లో ఫలానా ప్రాంతంలో ఛార్జింగ్‌ స్టేషన్‌ ఉందనే నోటిఫికేషన్ రాబోతోంది. అయితే ఇది కేవలం కలర్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పని చేసే మొబైల్స్‌కు మాత్రమే. కాగా ఒప్పొ, రియల్‌మీ ఫోన్లలోనే ఈ ఫీచర్‌ రాబోతోంది. కలర్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లో వస్తున్న కొత్త వెర్షన్‌ ‘కలర్‌ ఓఎస్‌ 7'లో ఈ ఫీచర్‌ను తీసుకొస్తున్నారు. ప్రస్తుతానికి ఇది చైనాలో మాత్రమే అందుబాటులోకి వస్తోంది.

చైనాలో పవర్‌ బ్యాంక్‌ రెంటింగ్‌

చైనాలో పవర్‌ బ్యాంక్‌ రెంటింగ్‌ స్టేషన్స్‌ను ఎక్కువగా ఏర్పాటు చేశారు. వాటిని కలర్‌ ఓఎస్‌ చక్కగా వాడుకోవాలని నిర్ణయించుకుంది. ఈ ఫీచర్‌ ప్రకారం మీ మొబైల్‌లో ఛార్జింగ్‌ తగ్గగానే నీకు 100 మీటర్ల దూరంలో ఛార్జింగ్‌ స్టేషన్‌ ఉందని మెసేజ్‌ వస్తుంది. దీంతోపాటు అక్కడ ఎన్ని ఛార్జింగ్‌ పోర్ట్‌లు ఉన్నాయి. వాటిలో ఎన్ని అందుబాటులో ఉన్నాయనేది చెబుతుంది.

లైట్‌ డిజైన్‌తో కలర్‌ ఓఎస్‌ 7

ఇప్పటివరకు వచ్చిన ఓఎస్‌ వెర్షన్లకు భిన్నంగా పూర్తిస్థాయి లైట్‌ డిజైన్‌తో కలర్‌ ఓఎస్‌ 7 ఉండబోతుందని ఒప్పో చెబుతోంది. మన దేశ యూజర్ల కోసం కొన్ని ప్రత్యేక ఫీచర్లు కూడా యాడ్‌ చేస్తున్నారని తెలుస్తోంది. ఇటీవల వన్‌ప్లస్‌ కూడా ఇలాంటి ప్రయత్నమే చేసింది. ఇండియా స్పెషల్‌ ఫీచర్లు అంటూ కొన్ని విడుదల చేసింది. ముఖ్యంగా గేమింగ్ విభాగంలో ఈ కలర్ ఓఎస్7 అదిరిపోయేలా అనుభూతిని ఇవ్వనుంది. మల్టిటాస్కింగ్ ఫీచర్లు, డిఫరెండ్ మోడ్స్ తో పాటు మొబైల్ గేమింగ్ యాప్ లో ఓ కొత్త ప్రపంచాన్ని చూపించబోతోంది.

రియల్‌మీ ఫోన్లలో కలర్‌ ఓఎస్‌
 

రియల్‌మీ ఫోన్లలో కూడా కలర్‌ ఓఎస్‌నే వాడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి రియల్‌మీ ఫోన్ల కోసం కలర్‌ ఓఎస్‌లో మార్పులు చేసి ప్రత్యేక వెర్షన్‌ను తీసుకొస్తారని తెలుస్తోంది. ఇప్పటికే రియల్‌మీ ఇండియా సీఈవో మాధవ్‌ సేథ్‌ కూడా ఈ విషయాన్ని చెప్పాడు. స్టాక్‌ ఆండ్రాయిడ్‌కి దగ్గరగా ఈ ఓఎస్‌ ఉంటుందనే వార్తలూ వచ్చాయి. అవేంటో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Oppo ColorOS 7 takes gaming to the next level

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X