Home
News

సొంత OS తయారీ వేటలో ఒప్పో... చిప్‌సెట్‌ దిగ్గజాలకు పోటీ ఇవ్వగలదా!!!

స్మార్ట్‌ఫోన్ తయారీదారులు ఇప్పుడు తమ సొంత OS ప్రాసెసర్‌లను తయారుచేయడం మొదలుపెట్టారు. ఇప్పటికే హువాయి మరియు శామ్‌సంగ్ వంటి స్మార్ట్‌ఫోన్ తయారీదారులు తమ తమ చిప్ సెట్ లను తమ స్మార్ట్ ఫోన్లకు వినియోగిస్తున్నారు.

చిప్‌సెట్‌

వీటి తరహాలోనే ప్రముఖ చైనా హ్యాండ్‌సెట్ తయారీదారు ఒప్పో సంస్థ కూడా ఇప్పుడు తన సొంత మొబైల్ చిప్‌సెట్‌ను విడుదల చేయడానికి కృషి చేస్తున్నట్లు చెబుతున్నారు. భవిష్యత్లో రాబోయే ఒప్పో యొక్క అన్ని స్మార్ట్‌ఫోన్ మోడళ్లు తమ సొంత చిప్‌సెట్‌ ప్రాసెసర్ ను ఉపయోగించబడుతుందని నివేదించబడింది.

 

EUIPO

EUIPO (యూరోపియన్ యూనియన్ ఇంటెలెక్టుల్ ప్రొపర్టీ ఆఫీస్) దాఖలు చేసిన ట్రేడ్ మార్క్ ప్రకారం ఒప్పో యొక్క సొంత చిప్‌ కోసం ఒప్పో M1 అనే పేరు సూచించినట్లు తెలుస్తోంది. M1 చిప్‌ తయారీ కోసం పనిచేయడానికి ఒప్పో స్పీడ్‌ట్రమ్‌తో పాటు మీడియాటెక్ నుండి కొంత మంది ఇంజనీర్లను నియమించుకుందని లెట్స్ గో డిజిటల్ నివేదించింది.

 

ఒప్పో M1

ఒప్పో M1 చిప్‌సెట్‌కు సంబందించిన ఎటువంటి ప్రత్యేకతలు ప్రస్తుతానికి ఇంకా తెలియదు. కానీ ఒప్పో పేరెంట్ BBK ఎలక్ట్రానిక్స్ నుండి ఈ చిప్‌సెట్‌ను ఇతర స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లతో సహా ఇతర స్మార్ట్‌ఫోన్ తయారీదారులకు కూడా అందించబోతున్నట్లు సమాచారం.

 

మొబైల్ చిప్‌

హువాయి, శామ్‌సంగ్ మరియు ఆపిల్ సంస్థలు తమ స్మార్ట్‌ఫోన్ల ఉపయోగం కోసం మొబైల్ చిప్‌లను విజయవంతంగా తయారుచేస్తుండగా షియోమి కూడా 2017 లో ఒక చిప్ ను సర్జ్ S1 అనే పేరుతో మార్కెట్ లో వదిలిపెట్టినట్లు తెలిసింది. కానీ అది ఎక్కువగా ప్రాచుర్యం పొందలేకపోయింది. ప్రస్తుతం ఒప్పో యొక్క ఈ కొత్త ప్రయత్నం ఎంత వరకు ఆసక్తికరంగా ఉంటుందో వేచి చూడాలి.

 

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌

వచ్చే ఏడాది బార్సిలోనాలో జరిగే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో ఒప్పో M1 చిప్ గురించి పూర్తి వివరాలు వెల్లడించవచ్చని లెట్స్ గో డిజిటల్ తెలిపింది. 2020 లో అన్ని స్మార్ట్‌ఫోన్‌లలో 5G సేవలను అందించడానికి ఒప్పో పనిచేస్తోంది.

Best Mobiles in India

English summary
Oppo Designing Its Own "M1 " Chipset
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X