ఒప్పో F21 ప్రో రివ్యూ: మెరుగైన కెమెరా పనితీరుతో ఈ ధర విభాగంలో ఇతరులకు దీటుగా

|

భారతీయ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో ఒప్పో బ్రాండ్ కి ప్రత్యేక స్థానం ఉంది. ఈ సంస్థ మార్కెట్‌లోని పోటీ దృష్ట్యా ఎప్పటికప్పుడు స్మార్ట్‌ఫోన్‌లను మరియు వాటి యొక్క ఉపకరణాలను విడుదల చేస్తూ మిగిలిన వారికి సవాలును విసురుతున్నది. Oppo ఫోన్‌లు అన్ని కూడా స్థిరమైన మరియు పోర్ట్రెయిట్ మోడ్‌లతో మెరుగైన సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటాయి. అటువంటి ఫీచర్లతో లాంచ్ అయిన కొత్త ఒప్పో F21 ప్రో స్మార్ట్‌ఫోన్ ఖచ్చితమైన సెల్ఫీలను సంగ్రహించడానికి వీలుగా గొప్ప తాజా టెక్నాలజీలతో ప్యాక్ చేయబడి వచ్చింది. అయితే ఈ ధర విభాగంలో ఇతర బ్రాండ్లు 5G మద్దతును అందిస్తుంటే ఇది 5Gకి మద్దతు ఇవ్వదు. నేను గత కొన్ని రోజులుగా ఒప్పో F21 ప్రో ని ఉపయోగిస్తున్నాను. ఈ ఫోన్ అందించే అన్ని రకాల వివరాలను ప్రతిదాన్ని కనుగొన్నాను. దీని యొక్క పనితీరు, కెమెరా లక్షణాలు, డిజైన్ వంటి మరిన్నింటి గురించి తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

33W SuperVOOC ఫాస్ట్ ఛార్జర్

ప్లస్ పాయింట్స్

** ప్రత్యేకమైన మరియు మెరుగైన బ్యాక్ ప్యానెల్
** శక్తివంతమైన సెల్ఫీ కెమెరా
** 33W SuperVOOC ఫాస్ట్ ఛార్జర్

మైనస్ పాయింట్స్

** 5G కనెక్టివిటీ సౌకర్యం లేకపోవడం
** అధిక హీటింగ్ సమస్యలు

 

ఒప్పో F21 ప్రో స్పెసిఫికేషన్లు

ఒప్పో F21 ప్రో స్పెసిఫికేషన్లు

డిస్ప్లే: 6.4-అంగుళాల AMOLED డిస్ప్లే
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680
మెమరీ: 8GB RAM
స్టోరేజ్: 128GB
బ్యాటరీ: 4,500 mAh
ప్లాట్‌ఫారమ్: ColorOSతో ఆండ్రాయిడ్ 12
కెమెరా: 64MP మైక్రోలెన్స్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా

ఒప్పో F21 ప్రో డిజైన్
 

ఒప్పో F21 ప్రో డిజైన్

ఒప్పో F21 ప్రో స్మార్ట్‌ఫోన్‌ ను ఎంచుకోవడానికి మొదటి కారణం దాని యొక్క ప్రత్యేకమైన డిజైన్. సంస్థ ఈ స్మార్ట్‌ఫోన్‌ కోసం మొదటిసారి "ఫైబర్‌గ్లాస్-లెదర్ డిజైన్"ని ఉపయోగించింది. ఇది స్మార్ట్‌ఫోన్‌కు ప్రత్యేకమైన టచ్ అనుభూతిని ఇస్తుంది. ఇది స్క్రాచ్-రెసిస్టెంట్‌గా పనిచేస్తుంది మరియు కఠినమైన ఉపయోగాల కోసం అనువైనది. మేము సన్‌సెట్ ఆరెంజ్ వేరియంట్ ను పరిశీలించాము. ఇది బోల్డ్ స్టైల్ స్టేట్‌మెంట్‌ను కలిగి ఉంది. వెనుకవైపు కెమెరా బంప్ చాలా స్పష్టంగా ఉండడంతో పాటుగా సొగసైన మరియు తేలికైన నిర్మాణంను కలిగి ఉంది. అలాగే ఫోన్ ముందు భాగంలో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.4-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే అమెజాన్ హెచ్‌డిఆర్ మరియు యూట్యూబ్ హెచ్‌డి సర్టిఫికేట్ పొందింది. నేను దీనిని ఇంటి లోపల మరియు వెలుపల అన్ని రకాల కార్యకలాపాల కోసం ఉపయోగించాను. బయటి కాంతితో సంబంధం లేకుండా డిస్‌ప్లే సజావుగా ఉండడంతో పాటుగా లీనమయ్యే అనుభవాన్ని అందిస్తున్నట్లు నేను గుర్తించాను.

ఒప్పో F21 ప్రో కెమెరా పనితీరు

ఒప్పో F21 ప్రో కెమెరా పనితీరు

ఒప్పో F21 ప్రో స్మార్ట్‌ఫోన్‌ లో మరొక గొప్ప ఫీచర్ కెమెరా సెటప్. ఇందులో 64MP ప్రైమరీ లెన్స్, 2MP మైక్రో కెమెరా మరియు 2MP డెప్త్ సెన్సార్‌తో వెనుకవైపు ట్రిపుల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అదనంగా ముందు భాగంలో సోనీ IMX709 లెన్స్‌తో 32MP అల్ట్రా-సెన్సింగ్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ముఖ్యంగా సెల్ఫీ కెమెరా మరియు మైక్రోస్కోపిక్ లెన్స్ ఆకట్టుకునేలా ఉన్నట్లు నేను గుర్తించాను. ఒప్పో ఎల్లప్పుడూ సెల్ఫీ కెమెరా విషయంలో మెరుగ్గా ఉంటుంది. ఒప్పో F21 ప్రోలోని సోనీ IMX 709 RGBW లెన్స్ సెల్ఫీ కెమెరా కూడా పగటి పూట ఎక్కువ కాంతి ఉన్న సమయంలో కూడా ఫోటోలను మెరుగ్గా సంగ్రహించగలదు. ఇది ఒప్పో క్వాడ్రా బిన్నింగ్ అల్గోరిథంతో కలిపి ఉంటుంది కావున ఇవి బోకె పోర్ట్రెయిట్, AI పోర్ట్రెయిట్ ఎన్‌హాన్స్‌మెంట్ మరియు సెల్ఫీ HDR వంటి లక్షణాల ద్వారా సెల్ఫీలను మరింత అందంగా తీయడానికి అనుమతిస్తుంది.

మైక్రోలెన్స్‌ని

నేను ఒప్పో F21 ప్రోలో మైక్రోలెన్స్‌ని కూడా ఇష్టపడ్డాను. ఈ 2MP లెన్స్ ఏదైనా ఒక వస్తువును 15x లేదా 30x సార్లు మాగ్నిఫై చేసి దాని మైక్రోస్కోపిక్ వీక్షణను మీకు అందిస్తుంది. నేను ఈ లెన్స్‌ని నా పెంపుడు కుక్కపై ఉపయోగించినప్పుడు దాని ప్రత్యేక ఆకృతిని కనుగొన్నాను. ఇది ఈ ఫోన్ యొక్క ప్రత్యేకమైన మరియు అత్యుత్తమ ఫీచర్‌గా మారుతుంది. అలాగే ఇందులోని నైట్ మోడ్‌ మైక్రోలెన్స్ మాత్రం శక్తివంతమైన సెల్ఫీ కెమెరా వలె సంతృప్తికరంగా లేదు. నేను MariSilicon X NPUతో నైట్ మోడ్‌ను కూడా ఉపయోగించాను. ఇవి చెప్పుకోదగ్గ విధంగా లేనప్పటికీ మెరుగైన మరియు ఖచ్చితమైన ప్రదర్శనను అందించాయి.

ఒప్పో F21 ప్రో పనితీరు

ఒప్పో F21 ప్రో పనితీరు

ఒప్పో F21 ప్రో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 చిప్‌సెట్ తో శక్తిని పొందుతూ 8GB RAM మరియు 128GB స్టోరేజ్ తో జత చేయబడి వస్తుంది. వినియోగదారులు RAM మరియు డిఫాల్ట్ స్టోరేజ్ రెండింటినీ మరింత విస్తరించవచ్చు. వినియోగదారులు మైక్రో SD కార్డ్ ద్వారా RAMని 5GB వరకు మరియు మొత్తం స్టోరేజ్ ను 1TB వరకు వర్చువల్‌గా విస్తరించవచ్చు. స్నాప్‌డ్రాగన్ 680 చిప్ 5Gకి మద్దతు ఇవ్వదు కావున ఇది 4G స్మార్ట్‌ఫోన్‌గా మాత్రమే పనిచేస్తుంది. దాని పనితీరును గుర్తించడానికి నేను రెండు బెంచ్‌మార్క్‌లను అమలు చేసాను. ముందుగా నేను గీక్‌బెంచ్ పరీక్షను నిర్వహించాను మరియు ఫోన్ సింగిల్-కోర్ పరీక్షలో 385 పాయింట్లు మరియు మల్టీ-కోర్ పరీక్షలో 1,667 పాయింట్లను స్కోర్ చేసింది.

ఒప్పో F21 ప్రో యొక్క GPU మరియు గేమింగ్ పవర్‌లను గుర్తించడానికి నేను 3M మార్క్ బెంచ్‌మార్క్‌ని కూడా అమలు చేసాను. ఇక్కడ ఫోన్ మొత్తం పనితీరు కోసం 443 పాయింట్లను స్కోర్ చేసింది. ఇది ఫోన్ భారీ యాప్‌లు లేదా GPU-హెవీ గేమింగ్ టైటిల్‌ల కోసం రూపొందించబడలేదని సూచిస్తుంది. కావున ఇది సాధారణ స్మార్ట్‌ఫోన్ వినియోగానికి బాగా సరిపోతుందని బెంచ్‌మార్క్‌లు వెల్లడిస్తున్నాయి.

 

ఒప్పో F21 ప్రో బ్యాటరీ & ఫాస్ట్ ఛార్జర్ పనితీరు

ఒప్పో F21 ప్రో బ్యాటరీ & ఫాస్ట్ ఛార్జర్ పనితీరు

ఒప్పో F21 ప్రో ఫోన్ 33W SuperVOOC ఫాస్ట్ ఛార్జర్‌తో పాటుగా 4,500 mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఈ ధర విభాగంలోని చాలా ఫోన్‌లు 5,000 mAh బ్యాటరీని అందిస్తున్నాయి. అయితే ఇది చిన్న బ్యాటరీని కలిగి ఉండటం కొంత నిరాశపరిచింది. అయినప్పటికీ పనితీరు మెచ్చుకోదగినది. ఒక్క ఛార్జ్‌తో ఫోన్‌ను ఒక రోజు మొత్తం ఉపయోగించుకునేలా నన్ను అనుమతిస్తుంది. 33W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్ ఫోన్ యొక్క అత్యుత్తమ ఫీచర్లలో ఒకటి. దాదాపు 90 నిమిషాల్లో ఫోన్ పూర్తిగా ఛార్జ్ అవుతుంది. నేను గేమింగ్ కాని యాప్‌ల కోసం ఉపయోగించినప్పుడు ఒక రోజు మొత్తం ఛార్జింగ్ ఉన్నట్లు నేను కనుగొన్నాను. మొత్తం మీద ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో బ్యాటరీ పనితీరు మెరుగ్గా ఉంటుంది.

తీర్పు

తీర్పు

భారతదేశంలో రూ.25000 సెగ్మెంట్ ధర లోపు ఇప్పుడు 5G ఎంపికలతో స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. కొనుగోలుదారులు ఇంత మొత్తం ఖర్చు చేయగలిగితే వారు ప్రీమియం 5G స్మార్ట్‌ఫోన్‌లను పొందుతారు. కావున ఇంత మొత్తం వెచ్చించి ఒప్పో F21 ప్రో వంటి 4G ఫోన్‌ను పొందడం సమంజసం కాదు. భారతదేశంలో 5G ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ త్వరలోనే 5G నెట్‌వర్క్‌ అందుబాటులోకి రానున్నట్లు ఇప్పటికే సంస్థలు ప్రకటించాయి. ఒప్పో F21 ప్రో ప్రీమియం ఫీచర్లను కలిగి ఉన్నాయి. ముఖ్యంగా కెమెరా విభాగంలో శక్తివంతమైన సెల్ఫీ కెమెరాను కలిగి ఉన్నాయి. మీరు 5G ఫ్యాక్టర్‌ని విస్మరిస్తే ఒప్పో F21 ప్రో ఈ విభాగంలో మంచి ఎంపిక అవుతుంది.

Best Mobiles in India

English summary
Oppo F21 Pro Review: Powerful Cameras Steal The Show

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X