Oppo నుంచి కొత్త 5G ఫోన్ లాంచ్ అయింది! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
ఒప్పో సంస్థ నుంచి ఒప్పో F23 5G స్మార్ట్ ఫోన్ ఇండియాలో ఈ రోజు మే 15, సోమవారం ప్రత్యక్ష ప్రసార ఈవెంట్ ద్వారా లాంచ్ చేయబడింది. ఈ కొత్త ఒప్పో F సిరీస్ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ SoC ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇంకా ఇది, 8GB RAM మరియు 256GB స్టోరేజ్‌తో జత చేయబడింది.
మీరు ఉపయోగించని ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో ఇన్‌బిల్ట్ ర్యామ్‌ను 16GB వరకు పెంచుకునే అవకాశం కూడా ఉంది. ఒప్పో F23 5G స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 64 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ తో వెనక వైపు ట్రిపుల్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది. మరియు 67W సూపర్ ఊక్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5,000mAh బ్యాటరీతో వస్తుంది.

భారతదేశంలో ఒప్పో F23 5G ధర వివరాలు
భారతదేశంలో ఒప్పో F23 5G ధర 8GB RAM + 256GB ఒకే ఒక్క స్టోరేజ్ మోడల్‌కు రూ. 24,999 గా ఉంది. ఇది బోల్డ్ గోల్డ్ మరియు కూల్ బ్లాక్ షేడ్ కలర్ లలో అందించబడుతుంది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం భారతదేశంలోని కంపెనీ వెబ్‌సైట్ మరియు అమెజాన్‌లో ప్రీ-ఆర్డర్‌ల కోసం సిద్ధంగా ఉంది మరియు మే 18 నుండి సేల్ చేయబడుతుంది.
ఇంకా, ఒప్పో ICICI మరియు HDFC బ్యాంక్ కార్డ్‌ల ద్వారా చేసే కొనుగోళ్లపై ఫ్లాట్ రూ.2,500 తగ్గింపు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ రూ. 23,748 మరియు అదనపు ఎక్స్ఛేంజ్ ఆఫర్ రూ. 2,000 లను అందిస్తోంది. అలాగే, నో కాస్ట్ EMI ఆప్షన్లు రూ.4,166 నుండి ప్రారంభమవుతాయి.
ఒప్పో F23 5G స్పెసిఫికేషన్ల వివరాలు,
ఒప్పో F23 5G డ్యూయల్ సిమ్ (నానో) తో ఆండ్రాయిడ్ 13 ఆధారిత కలర్ ఓస్ 13.1పై నడుస్తుంది మరియు 6.72 అంగుళాల పూర్తి HD+ (1,080x2,400 పిక్సెల్‌లు) LTPS LCD డిస్‌ప్లే 20:9 యాస్పెక్ట్ రేషియో, 91.4 శాతం స్క్రీన్ టు బాడీ రేషియోతో ఉంటుంది. మరియు 120Hz రిఫ్రెష్ రేట్. డిస్ప్లే 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ మరియు 391ppi పిక్సెల్ డెన్సిటీని అందజేస్తుంది.
ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ లో, అడ్రినో 619 GPU మరియు 8GB LPDDR4X RAMతో పాటు ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 5G SoCని కలిగి ఉంది. ఇది పనితీరును మెరుగుపరచడం కోసం వినియోగదారులు అందుబాటులో ఉన్న RAMని 16GB వరకు విస్తరించవచ్చు.
ఇక కెమెరా ఆప్టిక్స్ వివరాలు గమనిస్తే, ఒప్పో F23 5G ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో ఆటోఫోకస్ మరియు f/1.7 ఎపర్చర్‌తో కూడిన 64-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, f/2.4 ఎపర్చర్‌తో 2-మెగాపిక్సెల్ మోనో సెన్సార్ మరియు fతో 2-మెగాపిక్సెల్ మైక్రో సెన్సార్ ఉన్నాయి.సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం, ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.
ఇంకా, కనెక్టివిటీ ఎంపికలలో 5G, Wi-Fi, బ్లూటూత్, GPS మరియు USB టైప్-సి పోర్ట్ లు ఉన్నాయి. బోర్డ్‌లోని సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఇ-కంపాస్, గైరోస్కోప్, జియోమాగ్నెటిక్ సెన్సార్ మరియు ప్రాక్సిమిటీ సెన్సార్ ఉన్నాయి. ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఫోన్ ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది.
Oppo F23 5Gలో 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేసింది. ఇది ఒప్పో 67W సూపర్ ఊక్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఇది 44 నిమిషాల్లో ఫోన్‌ను పూర్తిగా ఛార్జ్ చేస్తుందని పేర్కొన్నారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే బ్యాటరీ గరిష్టంగా 39 గంటల కాలింగ్ సమయాన్ని మరియు 16 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తుంది. అంతేకాకుండా, ఇది 165x76x82mm కొలుస్తుంది. దీని బరువు 192 గ్రాములు గా ఉంది.


Click it and Unblock the Notifications








