OPPO F27 5G టీజర్ విడుదలైంది! ధర, స్పెసిఫికేషన్లు, లాంచ్ వివరాలు
OPPO సంస్థ త్వరలో భారతదేశంలో OPPO F27 5G గా పిలువబడే కొత్త F-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. రాబోయే ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీని బ్రాండ్ ధృవీకరించనప్పటికీ, ఇది OPPO F27 5G యొక్క టీజర్‌ను షేర్ చేసింది.
ఈ టీజర్ లో ఫోన్ యొక్క వెనుక వైపు డిజైన్ యొక్క వివరాలను బహిర్గతం చేస్తుంది. త్వరలో, రాబోయే ఈ OPPO F27 5G నుండి ఎటువంటి ఫీచర్ ఆశించాలో తెలుసుకుందాం.

OPPO F27 5G అంచనా స్పెసిఫికేషన్ల వివరాలు
OPPO F27 5G స్మార్ట్‌ఫోన్ ప్రస్తుత OPPO F27 Pro+ సిరీస్ లో చేరనుంది, OPPO F27 Pro+ IP69 రేటింగ్‌తో భారతదేశంలో మొదటి స్మార్ట్‌ఫోన్‌గా ఈ సంవత్సరం జూన్‌లో లాంచ్ చేయబడింది.
OPPO F27 5G రాక టీజర్ ను OPPO దాని అధికారిక X ఖాతాలో షేర్ చేసింది. అధికారిక టీజర్ రాబోయే స్మార్ట్‌ఫోన్‌లో OPPO F27 Pro+ వలె వృత్తాకార వెనుక కెమెరా మాడ్యూల్ ఉంటుందని తెలియచేస్తుంది.
OPPO బ్రాండ్ ఈ ఫోన్ యొక్క ముందువైపు డిజైన్‌ను వెల్లడించనప్పటికీ, OPPO F27 5G యొక్క లీక్డ్ లైవ్ ఇమేజెస్ ద్వారా ఇది ఫ్లాట్ ఎడ్జ్‌లు మరియు ముందు భాగంలో పంచ్-హోల్‌ను కలిగి ఉంటుందని వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్ OPPO F27 Pro+ లో కర్వ్డ్ డిస్‌ప్లే మరియు వేగన్ లెదర్ బ్యాక్‌కు విరుద్ధంగా మెటల్ ఫ్రేమ్‌తో గ్రేడియంట్ కలర్ డిజైన్‌ను కలిగి ఉందని కూడా చెప్పబడింది.
అంతేకాకుండా, OPPO F27 రెండు స్టోరేజ్ వేరియంట్‌లతో వస్తుందని భావిస్తున్నారు. అవి, 8GB RAM + 128GB ROM మరియు 8GB RAM + 256GB ROM. ఈ ఫోన్ వచ్చే వారం భారతదేశంలో అధికారికంగా వచ్చే అవకాశం ఉంది. అయితే, ఖచ్చితమైన ప్రారంభ తేదీ ఇంకా ప్రకటించలేదు.
OPPO F27 5G అధికారిక ఫీచర్లు మరియు ధర వివరాలు ఇంకా తెలియలేదు. అయితే, బేస్ 8G/128GB మోడల్‌కు రూ. 27,999 నుండి ప్రారంభమయ్యే OPPO F27 Pro+ కంటే ఇది చౌకగా ఉంటుందని మేము భావిస్తున్నాము. రాబోయే OPPO F27 5G కూడా ప్లస్ వేరియంట్ లాగా IP69 రేటింగ్‌ను కలిగి ఉంటుందో లేదో చూడాలి.
ఇటీవల, ఒప్పో భారత్ మార్కెట్‌లోకి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఒప్పో A3x 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. 5100mAh బ్యాటరీ, 6.67 అంగుళాల LCD డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. ఈ హ్యండ్‌సెట్ మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.12499 గా ఉంది. ఆగస్టు 7 నుంచి ఒప్పో అధికారిక వెబ్‌సైట్, ఈ-స్టోర్‌ల నుంచి కొనుగోలు చేయవచ్చు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియా ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








