ఫ్లిప్‌కార్ట్‌లో ఒప్పో ఎఫ్3 ప్లస్ ఆఫర్స్..రూ.22,990లకే 6జిబి ర్యామ్ ఫోన్!

By Madhavi Lagishetty
|

చైనీస్ కంపెనీ ఒప్పో తన ఎఫ్3 ప్లస్ ఈ ఏడాది మార్చిలో ఇండియా మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఏప్రిల్లో ఇండియాలో ఈ స్మార్ట్‌ఫోన్ను రిలీజ్ చేసే సమయంలో, కంపెనీ 4జిబి ర్యామ్ మరియు 64జిబి స్టోరేజి వేరియంట్ను మాత్రమే 30,990రూపాయలకు మార్కెట్లోకి రిలీజ్ చేసింది.

 
ఫ్లిప్‌కార్ట్‌లో ఒప్పో ఎఫ్3 ప్లస్ ఆఫర్స్!!

ఈ వారంలో ఒఫ్పో కొత్త స్మార్ట్‌ఫోన్ 6జిబి ర్యామ్ వేరియంట్ను ప్రకటించింది. 4జిబి ర్యామ్ వేరియంట్ లాగే ఉంటుంది. ఆన్‌లైన్‌ రిటైలర్‌ ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా ఎక్స్ క్లూజివ్ గా లభ్యం కానుంది. ఒప్పోఎఫ్3 ప్లస్ 6జిబి వేరియంట్ 22,990రూపాయలకు ఈ ఫోన్ను విక్రయించారు. 4జిబి ర్యామ్ వేరియంట్ మార్చిలోనే 30,990రూపాయలకు లాంచ్ చేసిన విషయం తెలిసిందే.

ఇక ఫ్లిప్‌కార్ట్‌ ఒప్పో ఎఫ్3 ప్లస్ తో అనేక ఆఫర్లను అందిస్తోంది. స్మార్ట్ ఫోన్ నోకాస్ట్, EMI లతో 1,916రూపాయలకు ప్రారంభం అవుతున్నాయి. అంతేకాదు ఈ స్మార్ట్ ఫోన్ పై 50శాతం క్యాష్ బ్యాక్ గ్యారేంటీని అందిస్తోంది. HDFC డెబిట్ , క్రెడిట్ కార్డును ఉపయోగించి కొనుగోలు చేయడానికి 5 శాతం అదనపు డిస్కౌంట్ను అందిస్తోంది. అంతేకాదు ఈ స్మార్ట్ ఫోనుపై ఉచితంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి హాట్ స్టార్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ను ఫ్లిప్ కార్టు అందిస్తుంది.

అమెజాన్‌లో వింటర్ కార్నివాల్ పేరిట వివో ఫోన్లపై ఆఫర్లుఅమెజాన్‌లో వింటర్ కార్నివాల్ పేరిట వివో ఫోన్లపై ఆఫర్లు

ఇక ర్యామ్ లో ఎలాంటి వ్యత్యాలు లేకుండా మిగిలిన ఫీచర్స్ మరియు స్సెసిఫికేషన్స్ ఒకే విధంగా ఉంటాయి. ఒప్పో ఎఫ్3 ప్లస్ రిఫ్రెష్ చేయడానికి స్మార్ట్ ఫోన్ అనేది 16మెగాపిక్సెల్ మరియు 8మెగాపిక్సెల్ సెన్సార్లతో ముందు ఉన్న డ్యుయల్ కెమెరాలతో సెల్ఫీ సెంట్రిక్ డివైస్ను కలిగి ఉంటుంది. LED ఫ్లాష్ తో బ్యాక్ సైడ్ 16మెగాపిక్సెల్ కెమెరా ఉంది. సెల్ఫీ కెమెరాను అందంగా తీర్చిదిద్దారు. మంచి సెల్ఫీ క్లిక్ కోసం బ్యూటిఫై 4.0 స్క్రీన్ ఫ్లాష్ , సెల్ఫీ పనోరమా మరియు షట్టర్ తో వస్తుంది.

ఈ స్మార్ట్ ఫోన్ 6అంగుళాల ఫుల్ హెచ్డి 1080పిక్సెల్ JDI ఇన్ సెల్ డిస్ల్పెను కలిగి ఉంటుంది. 2.5డిగ్రీల క్వార్డ్ గ్లాస్ తో డిజైన్ చేయబడింది. ఆక్టా కోర్ స్నాప్ డ్రాగెన్ 653 SOC 64జిబి స్టోరేజి స్పేస్ తో జతగా ఉంది. ఇక మైక్రో ఎస్డి కార్డును మరింతగా 256జిబి వరకు విస్తరించుకునే అవకాశం ఉంటుంది. 4జి వోల్ట్, వై-ఫై , బ్లూటూత్ 4.1, మైక్రో USB,3.5MM ఆడియో జాక్ మరియు GPS వంటి కనెక్టివిటీ కారకాలు ఉన్నాయి. మొత్తంగా VOOC ఆల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో 4000ఏంఏహెచ్ బ్యాటరీ నుంచి ఛార్జింగ్ పొందుతుంది. డివైస్ ఆండ్రాయిడ్ ఓఎస్ మార్ష్ మాలోను కలర్ ఓఎస్ 3.0తో అగ్రస్థానంలో ఉంది.

Best Mobiles in India

Read more about:
English summary
Oppo F3 Plus with 6GB RAM goes on sale for the first time in India at a price point of Rs. 22,990 via Flipkart.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X