ఆగస్ట్ 12న ఒప్పో ఎఫ్ 3రెడ్ లాంచ్!

By: Madhavi Lagishetty

చైనా మొబైల్ దిగ్గజం ఒప్పో తన తాజా స్మార్ట్ ఫోన్ లో ఒప్పో ఎఫ్ 3 రెడ్ కొత్త వేరియంట్ లో ప్రారంభించనుంది. ఒప్పో ఎఫ్3 రెడ్ వేరియంట్ ను ఆగస్టు 12న రిలీజ్ చేస్తున్నట్లు అధికారిక ఫేస్ బుక్ పేజీలో ప్రకటించింది.

ఆగస్ట్ 12న ఒప్పో ఎఫ్ 3రెడ్ లాంచ్!

రెడ్ వేరియంట్ ప్రారంభాన్ని ఫిలిఫ్పీన్స్ లో ఒక కొత్త ఒప్పో స్టోర్ ప్రారంభించనున్నారు. అయితే ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ వివరాలను కంపెనీ వెల్లడించలేదు. అయితే ఒప్పో ఎఫ్3 వేరియంట్ల కంటే ఇది ఎక్కువ ధర ఉంటుందని అంచనా వేస్తున్నాం. రోజ్ గోల్డ్ కలర్ లో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ భారత్ లో ప్రారంభించనున్నారు.

రోజ్ గోల్డ్ ఒప్పో రూ. 19,990 మార్కెట్లో అందుబాటులో ఉండనుంది. Oppo F3 1920 × 1080 పిక్సెల్స్ రిజల్యూషన్ 5.5అంగుళాల పూర్తి హెచ్ డి డిస్ ప్లే కలిగి ఉంది. 2.5డి క్వార్డ్ గ్లాస్ కార్నింగ్ గొరిల్లా, ఆక్టాకోర్ మీడియా టెక్ ఎంటి6750టి మాలీ టి86-MP2తో అగ్రస్థానంలోఉంది. 4జిబి ర్యామ్, 64జిబి ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటి కలిగి ఉంది. ఇది మైక్రో ఎస్డి కార్డును ఉపయోగించి 128జిబి వరకు విస్తరించబడింది.

నోకియా నుంచి ఈ ఫోన్ బయటకు వస్తే.. అన్నీ అవుటే !

కెమెరా సెంట్రిక్ ఫోన్ కావడంతో ఇదు ముందు డ్యుయల్ కెమెరాలతో వస్తుంది. 120డిగ్రీ వెడల్పు లెన్స్,16మెగాపిక్సెల్ మెయిన్ సెన్సర్, 8మెగాపిక్సెల్ సెంకరీ సెన్సర్ ఉంది. కెమెరా యాప్ ఇన్ బిల్ట్ స్మార్ట్ ఫేషియల్ రికగ్నిషన్ ఫీచర్ ను కలిగి ఉంది. గ్రూప్ సెల్ఫీలో ముగ్గురు కంటే ఎక్కువ మంది ఉంటే గ్రూప్ సెల్ఫీ మోడ్ కు మారడానికి యూజర్స్ కు తెలియజేస్తుంది. డ్యుయల్ పిడిఏఎఫ్, ఫ్లాష్ , పూర్తి హెచ్ డి 1080పిక్సెల్ వీడియో రికార్డింగ్ 13మెగా పిక్సెల్ కెమెరా కలిగి ఉంది.

3,200ఎంఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ, కలర్ 3.0, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో, 4జి వోల్ట్, వైఫై 802.11/a/b/g/n/ac, బ్లూటూత్ 4.1 జిపిఎస్ , హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ (నానో, నానో) 3.5ఎంఎం ఆడియో జాక్, మైక్రో –usbఅందిస్తుంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ కలిగి ఉంది.

Read more about:
English summary
The launch of the Oppo F3 Red variant will coincide with the opening of a new Oppo concept store in the Philippines.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting