6జీబి ర్యామ్‌తో దుమ్మురేపుతున్న OPPO F5

By: BOMMU SIVANJANEYULU

ఒప్పో లేటెస్ట్ సెల్ఫీ సెంట్రిక్ స్మార్ట్‌ఫోన్ OPPO F5 ఎట్టకేలకు ఇండియన్ మార్కెట్లో రిలీజ్ అయ్యింది. ఈ ఫోన్ ద్వారా మెచీన్ లెర్నింగ్ టెక్నాలజీని ఒప్పో ప్రపంచానికి పరిచయం చేసింది. 20 మెగా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తోన్న ఈ స్మార్ట్‌ఫోన్‌లో అప్‌డేటెడ్ బ్యూటిఫై టెక్నాలజీని ఒప్పో పొందుపరిచింది. ఈ టెక్నాలజీ సంక్లిష్టమైన AI అల్గోరిథంలను ఉపయోగించుకుని హై-క్వాలిటీ సెల్ఫీ షాట్లను ప్రొవైడ్ చేయగలుగుతుంది.

6జీబి ర్యామ్‌తో దుమ్మురేపుతున్న OPPO F5

ఈ ఫోన్‌లోని 6 ఇంచ్ ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ స్ర్కీన్, 18:9 యాస్పెక్ట్ రేషియోతో వ్యూవింగ్ ఎక్స్‌పీరియన్స్ క్వాలిటీని మరింత రెట్టింపు చేస్తుంది.ఈ ఫోన్‌కు సంబంధించిన బ్యాటరీ లైఫ్‌తో పాటు కెమెరా క్వాలిటీని, గతంలో లాంచ్ చేసిన ఫోన్‌లతో పోలిస్తే ఒప్పో మరింతగా మెరుగుపరిచిచింది. ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేషియల్ అన్‌లాక్ వంటి ఫీచర్లు ఒప్పో ఎఫ్5కు మరింత మోడ్రన్ లుక్‌ను తీసుకువచ్చాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ బిజిల్-లెస్ లుక్స్..

ఒప్పో ఎఫ్5 స్మార్ట్‌ఫోన్‌లో ఏర్పాటు చేసిన 6-ఇంచ్ ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ స్ర్కీన్ 2160 x 1080పిక్సల్స్ రిసల్యూషన్‌తో సరికొత్త ఒరవడికి నాంది పలికింది. 18:9 యాస్పెప్ట్ రేషియో దాదాపుగా బిజిల్-లెస్ లుక్స్‌ను ఆఫర్ చేస్తుంది. పెద్ద డిస్‌ప్లే కారణంగా తెర పై ఎక్కువ కంటెంట్‌ను వీక్షించే వీలుంటుంది. గేమ్స్ ఆడుతున్న సమయంలో, వీడియోలను వీక్షిస్తున్న సమయంలో హైక్వాలిటీ మల్టీ మీడియా ఎక్స్‌పీరియన్స్‌ను ఈ డిస్‌ప్లే చేరువచేస్తుంది.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేషన్‌తో సరికొత్త సెల్ఫీ కెమెరా...

ఒప్పో ఎఫ్5 స్మార్ట్‌ఫోన్‌లోని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్ సెల్ఫీ ఎక్స్‌పీరియన్స్‌ను కొత్త లెవల్‌కు తీసుకువెళుతుంది. ఫోన్ ఫ్రంట్ కెమెరాతో అనుసంధానించబడిన ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మునుపెన్నడూ చూడని హైక్వాలిటీ సెల్ఫీలను అందిస్తుంది.

అప్‌డేట్ చేయబడిన బ్యూటిఫై టెక్నాలజీ సెల్ఫీ‌లకు మరిన్ని ఆధునిక హంగులను దిద్దుతుంది. ఒప్పో ఎఫ్5 స్మార్ట్‌ఫోన్‌లో నిక్షిప్తం చేసిన 20 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా సహజసిద్ధమైన bokeh ఎఫెక్టులను కూడా క్రియేట్ చేయగలుగుతుంది. డెప్త్ మోడ్‌లో సెల్ఫీలను క్యాప్పుర్ చేసుకునే సమయంలో ఈ bokeh ఎఫెక్టు పనితీరు మనకు తెలుస్తుంది.

బడ్జెట్ ధరలో భారీ బ్యాటరీతో సరికొత్త స్మార్ట్‌ఫోన్ !

సుధీర్ఘమైన బ్యాటరీ బ్యాకప్..

ఒప్పో ఎఫ్5 స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన 3,200 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. ఫుల్ ఛార్జ్ పై రోజు మొత్తం బ్యాకప్‌ను ఈ బ్యాటరీ అందించగలుగుతుంది. VOOC చార్జింగ్ టెక్నాలజీతో ఇన్‌స్టెంట్‌గా బ్యాటరీని రీఫ్యూయల్ చేసుకోవచ్చు. ఒప్పో ఎఫ్3తో పోలిస్తే ఒప్పో ఎఫ్5 ఫోన్ 18% ఎక్స్‌టెండెడ్ బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని ఒప్పో చెబుతోంది.

సాఫ్ట్‌వేర్‌లో అనేక ప్రత్యేకతలు..

ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన ColorOS V3.2 యూజర్ ఇంటర్‌ఫేస్ పై ఒప్పో ఎఫ్5 స్మార్ట్‌ఫోన్‌ రన్ అవుతుంది. ఈ సాఫ్ట్‌వేర్‌తో వచ్చే స్ప్లిట్ - స్ర్కీన్ మోడ్, గెస్ట్యుర్ అండ్ మోషన్, క్లోన్ యాప్స్ వంటి ఫీచర్లు యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింతగా ఎన్‌హాన్స్ చేస్తాయి. ప్రైవసీ ప్రొటెక్షన్, వైరస్ స్కాన్, పేమంట్ ప్రొటెక్షన్ వంటి సెక్యూరిటీ ఫీచర్లు డివైస్‌ను మరింత సెక్యూర్‌గా ఉంచుతాయి.

స్మూత్ పెర్ఫామెన్స్..

ఒప్పో ఎఫ్5 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి ఇంటర్నల్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే, ఈ ఫోన్ 2.5 GHz Mediatek MT6763T ఆక్టా కోర్ ప్రాసెసర్ పై రన్ అవుతుంది. మొత్తం రెండు వేరియంట్‌లలో ఫోన్ అందుబాటులో ఉంటుంది. అందులో మొదటి వేరియంట్ 4జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌తోనూ, రెండవ వేరియంట్ 6జీబి ర్యామ్ + 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌తోనూ అందుబాటలో ఉంటుంది. మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశాన్ని కల్పించారు.

Oppo F5 స్మార్ట్‌ఫోన్‌లోని ప్యత్యేకమైన ఫీచర్లలో గేమ్ యాక్సిలరేషన్ ఒకటి. ఈ ఫీచర్ ద్వారా స్మూత్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను యూజర్లు ఆస్వాదించే వీలుంటుంది. ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసకోవటం ద్వారా గేమ్ ఆడుతోన్న సమయంలో అంతరాయలు అనేవి చాల తక్కువుగా ఉంటాయి. గేమ్‌ప్లే సమయంలో వచ్చే ఇన్‌కమ్మింగ్ కాల్స్‌ను బ్యానర్ రూపంలో డిస్‌ప్లే చేయటం జరుగుతుంది.

బడ్జెట్ ధరకే బెస్ట్ స్మార్ట్‌ఫోన్..

Oppo F5 స్మార్ట్‌ఫోన్‌, ఇండియన్ మార్కెట్లో నవంబర్ 2న లాంచ్ అయ్యింది. 4జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,990, 6జీబి ర్యామ్ + 128జీబి స్టోరేజ్ వేరియంట్ ధర ధర రూ.24,990. ప్రీ-బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. నవంబర్ 9న మొదటి సేల్ జరుగుతుంది. ఆఫ్‌లైన్ స్టోర్‌లలో డిసెంబర్ 9 నుంచి ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
OPPO has officially taken the wraps off their latest Selfie Expert smartphone - OPPO F5 in the Indian market. OPPO F5 brings forth the machine learning technology to selfie camera in the smartphones for the first time.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot