ఒప్పో ఎఫ్5లో టాప్ ఫీచర్స్ ఇవే..

|

గత కొద్ది సంవత్సరాలుగా సెల్ఫీ ఎక్స్‌పర్ట్ ఫీచర్లతో అత్యుత్తమ కెమెరా ఫోన్‌లను మార్కెట్‌కు పరిచయం చేస్తోన్న చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒప్పో, మరో అత్యాధునిక సెల్ఫీ సెంట్రిక్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది.

 
Oppo F5 top features that you can brag about

Oppo F5 పేరుతో లాంచ్ అయిన ఈ ఫోన్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. 4జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్ వర్షన్ ధర రూ.19,990. 6జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్ వర్షన్ ధర రూ.24,990. ప్రీ-ఆర్డర్స్ ఇప్పటికే Flipkartలో మొదలయ్యాయి. నవంబర్ 9 నుంచి సేల్ స్టార్ట్ అవుతుంది.

మొబైల్ ఫోటోగ్రఫీ టెక్నాలజీ విభాగంలో లీడింగ్ బ్రాండ్‌గా కొనసాగుతోన్న ఒప్పోకు ప్రపంచవ్యాప్తంగా 20 కోట్లకు పైగా యువ వినియోగదారులు ఉన్నట్లు ఓ అంచనా. సెల్ఫీ ప్రియుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తోన్న ఒప్పో తాజాగా తన Oppo F5 స్మార్ట్‌ఫోన్‌లోనూ పలు టాప్‌క్లాస్ ఫీచర్లను యూడ్ చేసింది. వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ బ్యూటీ టెక్నాలజీ

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ బ్యూటీ టెక్నాలజీ

సెల్ఫీ ఫోటోగ్రఫీ విభాగంలోకి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని తీసుకువచ్చిన మొట్టమొదటి బ్రాండ్‌గా ఒప్పో చరిత్ర సృష్టించింది. అనేక సంవత్సరాల రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ తరువాత ఈ విప్లవాత్మక
ఫీచర్‌ను Oppo F5 స్మార్ట్‌ఫోన్ ద్వారా మార్కెట్లోకి తీసుకువచ్చినట్లు ఒప్పో తెలిపింది.

Oppo F5లో ఇన్‌స్టాల్ చేసిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ బ్యూటీ టెక్నాలజీ, గ్లోబల్ డేటా బేస్ రిఫరెన్స్‌తో యూజర్ ముఖం పై 200కు పైగా ఫేషియల్ రికగ్నిషన్ స్పాట్‌లను గుర్తించగలుగుతుంది. ఈ ఫీచర్‌ను మరింత సహజసిద్ధంగా మలిచే క్రమంలో ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్‌తో పాటు మేకప్ ఆర్టిస్టుల సలహాలు, సూచనలను పరిగణంలోకి తీసుకున్నట్లు ఒప్పో తెలిపింది.

గ్లోబల్ ఇమేజ్ డేటాబేస్ ఆఫ్ హ్యూమన్ ఫేస్
 

గ్లోబల్ ఇమేజ్ డేటాబేస్ ఆఫ్ హ్యూమన్ ఫేస్

ఒప్పో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ బ్యూటీ టెక్నాలజీలోని 200కు పైగా ఫేషియల్ రికగ్నిషన్ స్పాట్స్, హ్యూమన్ ఫేసెస్‌కు సంబంధించిన గ్లోబల్ డేటా బేస్ ఆధారంగా యూజర్ ముఖానికి సంబంధించిన ఫేషియల్ షీచర్స్, షేప్స్ ఇంకా స్ట్రక్షర్‌ను ఐడెంటిఫై చేయటం జరుగుతుంది.

ఫేషియల్ రికగ్నిషన్ ప్రాసెస్ పూర్తి అయిన తరువాత ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ బ్యూటీ టెక్నాలజీ యూజర్ స్కిన్ టోన్, కళ్లు, లిప్స్ ఇంకా ఫేస్ షేప్ ఆధారంగా బ్యూటిఫైను కస్టమైజ్ చేయటం జరుగుతుంది.దీంతో వారి సెల్ఫీ షాట్స్ మరింత అందంగా తీర్చిదిద్దబడతాయి.

ఐఫోన్ ఎక్స్ పై జియో సంచలన ఆఫర్ఐఫోన్ ఎక్స్ పై జియో సంచలన ఆఫర్

ఫేస్ అన్‌లాక్

ఫేస్ అన్‌లాక్

Oppo F5 స్మార్ట్‌ఫోన్ విప్లవాత్మక ఫేషియల్ అన్‌లాక్ ఫీచర్‌తో వస్తోంది. ఈ సరికొత్త ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ, యూజర్ ముఖాన్ని గుర్తించి తద్వారా ఫోన్‌ను అన్‌లాక్ చేయటం జరుగుతుంది. యూజర్లు ఈ సదుపాయాన్ని వద్దనుకుంటున్నట్లయితే సాంప్రదాయ ఫింగర్ ప్రింట్ అన్‌లాక్ ఫీచర్‌కు మారిపోవచ్చు. ఫింగర్ ప్రింట్ రీడర్ ఫోన్ వెనుక భాగంలో యాక్టివేట్ అయి ఉంటుంది.

గేమ్ యాక్సిలరేషన్..

గేమ్ యాక్సిలరేషన్..

Oppo F5 స్మార్ట్‌ఫోన్‌లోని ప్యత్యేకమైన ఫీచర్లలో గేమ్ యాక్సిలరేషన్ ఒకటి. ఈ ఫీచర్ ద్వారా స్మూత్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను యూజర్లు ఆస్వాదించే వీలుంటుంది. ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసకోవటం ద్వారా గేమ్ ఆడుతోన్న సమయంలో అంతరాయలు అనేవి చాల తక్కువుగా ఉంటాయి. గేమ్‌ప్లే సమయంలో వచ్చే ఇన్‌కమ్మింగ్ కాల్స్‌ను బ్యానర్ రూపంలో డిస్‌ప్లే చేయటం జరుగుతుంది.

ఇతర స్పెషల్ షీచర్స్...

ఇతర స్పెషల్ షీచర్స్...

Oppo F5 స్మార్ట్‌ఫోన్‌లో లోడ్ చేసిన O-share ఫైల్ షేరింగ్ టెక్నాలజీ బ్లుటూత్ కంటే 100 రెట్ల వేగంతో పనిచేస్తుందని ఒప్పో చెబుతోంది. ఈ ఫీచర్ ద్వారా సెకనుకు 10 ఫోటోలను ట్రాన్స్‌ఫర్ చేసుకునే వీలుంటుందట.

Best Mobiles in India

Read more about:
English summary
Oppo has yet again launched the new selfie-centric smartphone Oppo F5 in the Indian market.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X