Home
News

ఒప్పో కొత్త ఫోన్ ఇలానే ఉంటుంది?

సెల్ఫీ స్పెషలిస్టు కెమెరాలతో అక్టోబర్ 26న కొత్త ఫోన్ను రిలీజ్ కానున్న ఒప్పో ఎఫ్5

By Madhavi Lagishetty

మొబైల్ యూజర్లను ఆకర్షించేందుకు విదేశీ మొబైల్ సంస్థ ఒప్పో ..సరికొత్త స్మార్ట్‌ఫోన్ను రిలీజ్ చేసిందుకు రెడీగా ఉంది. ఒప్పో ఎఫ్5గా పిలవబడే కొత్త స్మార్ట్‌ఫోన్కు సంబంధించిన ప్రమోషనల్ పిక్చర్స్, వీడియోలు ఆన్‌లైన్‌లో సందడి చేస్తున్నాయి.

Oppo F5 with dual selfie cameras to be launched on October 26

అక్టోబర్ 26న ఫిలిప్పీన్స్ లో జరిగే ఓ కార్యక్రమంలో ఒప్పో ఎఫ్5 నుంచి ఎఫ్ సీరిస్ స్మార్ట్‌ఫోన్ను రిలీజ్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఒప్పో ఫేస్‌బుక్ పేజీలో ఆహ్వానం పలుకుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫుల్ స్క్రీన్ డిజైన్తో వస్తుంది. డిస్ప్లే 18:9 నిష్పత్తిలో ఉంటుంది. ఒఫ్పో ఎఫ్5 ఒక రేర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, బ్యాక్ సైడ్ కెమెరా, డ్యుయల్ ఫ్రంట్ కెమెరాలతో ఒక సెల్ఫీ-సెంట్రిక్ స్మార్ట్‌ఫోన్తో లభిస్తుంది.

ఒప్పో ఎఫ్5కు సంబంధించి ఇప్పటికే ఎన్నో రూమర్స్ హాల్ చల్ చేస్తున్నాయి. ఒప్పో ఎఫ్5, 6అంగుళాల ఫుల్ హెచ్డి+డిస్ప్లేతోపాటు 18:9 రేషియోలో అమర్చబడి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్తో పాటు 20మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు దాని బ్యాక్ సైడ్ LED ఫ్లాష్ వస్తుంది. ఫ్రంట్ సైడ్లో ఆకట్టుకునే సెల్ఫీల కోసం 12మెగాపిక్సెల్ లేదా 16మెగాపిక్సెల్ డ్యుయల్ కెమెరాలను కలిగి ఉంటుంది.

ఒప్పో ఎఫ్5 స్మార్ట్‌ఫోన్ ఒక స్నాప్ డ్రాగెన్ 625, స్నాప్ డ్రాగెన్ 630లేదా స్నాప్ డ్రాగెన్ 660 SOC ద్వారా ఉంటుందన్న విషయంపై స్పష్టత లేదు. ప్రొసెసర్ 4జిబి,6జిబి ర్యామ్ మరియు 64జిబి డిఫాల్ట్ మెమెరీ కెపాటిసిటిని జత చేయబడింది.

ఒప్పో ఎఫ్5 విడుదలను కొన్ని వారాల ముందుగానే, స్మార్ట్‌ఫోన్కు సంబంధించి మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ను ఆసియా మార్కెట్లలో రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో ఇండియాతో సహా కొన్ని దేశాల్లో ఒప్పో ఎఫ్3 ప్లస్ రిలీజైంది.

Best Mobiles in India

English summary
Oppo F5, the smartphone with dual selfie cameras is all set to be launched on October 26. The company's invite for the launch event tips at the specs.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X