డిసెంబర్ 8న ఇండియాకు వస్తున్న ఒప్పో ఎఫ్5 యూత్ స్మార్ట్ ఫోన్ !

Posted By: Madhavi Lagishetty

చైనాకు చెందిన ఒప్పో కంపెనీ గత నెల నవంబర్ లో ఒప్పో ఎఫ్ 5 స్మార్ట్ ఫోన్ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ధర 19,990రూపాయలుగా నిర్ణయించింది. ఒప్పో ఎఫ్ 5 రెండు వేరియంట్లలో రిలీజ్ అయ్యింది. 6జిబి ర్యామ్, 4జిబి ర్యామ్ తో లభిస్తుంది. వీటి ధరలు వరుసుగా 19,990, రూ. 24,990లకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

డిసెంబర్ 8న ఇండియాకు వస్తున్న ఒప్పో ఎఫ్5 యూత్ స్మార్ట్ ఫోన్ !

ఈ మోడల్స్ తోపాటు...ఇండియాలో ఈ డిసెంబర్ నెలలో ఒప్పో ఎఫ్ 5 యూత్ అని పిలిచే మూడవ వేరియంట్ కూడా త్వరలో రిలీజ్ కానుంది. ఈ డివైస్ గత వారంలో ఫుల్ స్క్రీన్ డిజైన్ తో చైనీస్ మార్కెట్లో లాంచ్ చేయబడింది. ఇప్పుడు, ఒప్పో ఎఫ్5 యూత్...ఇండియాలో డిసెంబర్ 8న రిలీజ్ కానున్నట్లు ఒఫ్పో అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రకటించింది.

అయితే ఒప్పో ఎఫ్5 యూత్...స్మార్ట్ ఫోన్ ధర మరియు లభ్యత గురించి కంపెనీ ఎలాంటి వివరాలను ప్రకటించలేదు. ఇక స్పెసిఫికేషన్స్ చూసినట్లయితే...ఒప్పో ఎఫ్5 యూత్ ఇతర రెండు వేరియంట్ల కంటే కొద్దిగా డిఫరెంట్ లూక్ తో అట్రాక్ట్ చేయనుంది. ఒప్పోఎఫ్5 మరియ ఒప్పోఎఫ్5 6జిబిలో కనిపించే డివైస్ మాదిరిగానే మెటల్ బిల్ట్ కలిగి ఉంటుంది. డిస్ప్లే ఫుల్ హెచ్ డి + 2160,1080పిక్సెల్స్ రిజల్యూషన్ తో వస్తుంది.

18:9 నిష్పత్తిలో 6 అంగుళాల ఫుల్ వ్యూ LTPS ప్యానెల్ ఉంటుంది. దాని హుడ్ కింద డివైస్ ఒక మైక్రో డిడి కార్డు ఉపయోగించి 256 జిబి వరకు విస్తరించగల 3జిబి ర్యామ్ మరియు 32జిబి స్టోరేజి కెపాసిటి జతచేసి ఉంటుంది. ఆక్టా కోర్ మీడియా టెక్ MT6763T ప్రొసెసర్ను ఉపయోగిస్తుంది.

ఒప్పో ఎఫ్5 యూత్ ఇమేజింగ్ అంశాలు పరిశీలించినట్లయితే...13మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా f/2.2 ఎపర్చరు మరియు 16మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో f/2.0ఎపర్చరు కలిగి ఉన్నాయి. ఒప్పో ఎఫ్5 లైనప్లో ఇతర మోడళ్లపై 20మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా మాదిరిగానే...16మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా నుంచి బ్యూటీఫుల్ సెల్ఫీల కోసం AI కెపబులిటీ కలిగి ఉంది.

ఆకట్టుకున్న గూగుల్ స్పెషల్ డూడుల్ !

ఇక బోర్డులో కనెక్టివిటీ ఆప్షన్స్ పరంగా చూస్తే...ఒప్పో ఎఫ్5 యూత్ 4జి వోల్ట్ , USB, OTG, GPS, బ్లూటూత్ 4.2 మరియు ఇతర ప్రామాణిక అంశాలను కలిగి ఉంటాయి. డివైస్ గూడీస్ 3200ఎంఏహెచ్ బ్యాటరీ మరియు ఆండ్రాయిడ్ 7.1 నూగట్, కలర్ ఓఎస్ 3.2ఆధారంగా రన్ అవుతుంది.

ఒప్పోఎఫ్5 యూత్ ఇతర రెండు స్మార్ట్ ఫోన్లలో కనిపించే సేఫ్ అన్లాక్ ఫేషియల్ రికగ్నైజ్ టెక్నాలజీతో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్లు 16,990రూపాయలకు ఆఫ్ లైన్, ఆన్ లైన్ ఛానల్స్ అంతటా అందుబాటులో ఉన్నాయి.

Read more about:
English summary
The Oppo F5 Youth with an AI selfie camera is all set to be launched in India on December 8.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot