ఒప్పో ఫైండ్ N2 ఫ్లిప్ ఫోన్ ఇండియా లో లాంచ్ అయింది! స్పెసిఫికేషన్ల వివరాలు!
ఒప్పో తన మొదటి ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్, ఫైండ్ N2 ఫ్లిప్ ఫోన్ ను ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను భారతదేశంలో కూడా లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఫోల్డబుల్ స్క్రీన్ డిజైన్ ఆధారంగా కాంపాక్ట్ ఫ్లిప్ డిజైన్ ఫ్యాక్టర్ తో, ఈ స్మార్ట్‌ఫోన్ శాంసంగ్ గాలక్సీ Z ఫ్లిప్ 4 మరియు మోటో రేజర్ 2 తో పోటీగా మార్కెట్లో సేల్ కానుంది. ఒప్పో ఫైండ్ N2 తో పాటు చైనాలో లాంచ్ చేసిన తర్వాత ఈ స్మార్ట్‌ఫోన్ లండన్‌లో జరిగిన గ్లోబల్ ఈవెంట్‌లో చాలా మంది అభిమానుల మధ్య లాంచ్ చేయబడింది.

ఒప్పో ఫైండ్ N2 ఫ్లిప్ డిజైన్ యొక్క కొన్ని మార్పులతో అచ్చం గెలాక్సీ Z ఫ్లిప్ 4 ఫోన్ మాదిరిగానే ఉంటుంది. ఈ ఫోన్ మరిన్ని పనులు చేయగల పెద్ద కవర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. కానీ మరీ ముఖ్యంగా, ఒప్పో యొక్క కొత్త కీలు డిజైన్, డిస్ప్లే మధ్యలో ఉన్న క్రీజ్‌ను దాదాపు కనిపించకుండా చేస్తుంది.
ఒప్పో ఫైండ్ N2 ఫ్లిప్ స్మార్ట్ ఫోన్ ఫీచర్‌లు మరియు స్పెసిఫికేషన్‌లు
ఫైండ్ N2 ఫ్లిప్ అనేది క్లామ్‌షెల్ డిజైన్‌లో ఉన్న ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్. ఈ ఒప్పో ఫోన్ యొక్క ముందున్న వాటర్ డ్రాప్ హింజ్ మెకానిజం కారణంగా ఈ స్మార్ట్‌ఫోన్ కనిపించే లైన్ లేకుండా మెయిన్ డిస్‌ప్లే తెరుచుకుంటుంది. బయట డిస్‌ప్లే శామ్‌సంగ్ ఫోన్లతో పోలిస్తే చాలా పెద్దదిగా ఉంటుంది. ఇది మీడియా టెక్ చిప్‌సెట్‌తో నడిచే మొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ కూడా.

ఈ ఫైండ్ N2 ఫ్లిప్ ఫోన్ 720x382 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 3.26-అంగుళాల కవర్ డిస్‌ప్లేతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 21:9 యాస్పెక్ట్ రేషియోతో 6.8-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 9000+ SoCతో పాటు 8GB RAM మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 44W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 4300mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
శాంసంగ్ Z ఫ్లిప్ 4 ఫోన్ లాగా కవర్ డిస్‌ప్లే కెమెరాకు వ్యూఫైండర్‌గా ఉపయోగించబడుతుంది. ఇది విడ్జెట్‌లకు కూడా మద్దతు ఇస్తుంది మరియు నోటిఫికేషన్‌లను త్వరగా చూసేలా చేస్తుంది. ఈ ఫైండ్ N2 ఫ్లిప్ ఫోన్ 50MP ప్రైమరీ కెమెరాతో పాటు 8MP అల్ట్రావైడ్ కెమెరాను కూడా కలిగి ఉంది. ముందు భాగంలో 32MP సెల్ఫీ షూటర్ కూడా ఉంది.

ఒప్పో ఫైండ్ N2 ఫ్లిప్ ఫోన్ ధర మరియు లభ్యత
ఒప్పో ఫైండ్ N2 ఫ్లిప్ ఫోన్ UK లో 8+256GB వేరియంట్ ధర GBP 849 (సుమారు రూ. 84,000) ధరతో లాంచ్ చేయబడింది. ఒప్పో సంస్థ సమాచారం ప్రకారం భారతదేశంలో ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంటుందని ధృవీకరించింది, అయితే అధికారిక ధరను ఇంకా ప్రకటించలేదు.
ఒప్పో ప్యాడ్ 2 టాబ్లెట్ గురించి లీక్ అయిన సమాచారం ప్రకారం, ఒప్పో కంపెనీ ఒప్పో ప్యాడ్ 2 అనే టాబ్లెట్ మోడల్‌ను త్వరలో పరిచయం చేయబోతోంది. ఒప్పో ప్యాడ్ 2 మోడల్ యొక్క ఫీచర్లు ను గమనిస్తే పెద్ద డిస్‌ప్లేతో వస్తుందని ఆన్‌లైన్‌లో లీక్ అయిన వివరాలు సూచిస్తున్నాయి. ఇప్పుడు ఈ వివరాలు వివరంగా పరిశీలిద్దాం. ఒప్పో ప్యాడ్ 2 మోడల్ 11-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఒప్పో ప్యాడ్ 2 మోడల్‌లో 2800 x 2000 పిక్సెల్‌లు, 144 Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్, HDR 10 ప్లస్ సపోర్ట్ వంటి అనేక ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. ఒప్పో ప్యాడ్ 2 మోడల్‌లో మీడియా టెక్ డైమెన్సిటీ 9000 చిప్‌సెట్ ఉన్నట్లు రిపోర్ట్ లు తెలియచేస్తున్నాయి. అలాగే, ఈ టాబ్లెట్ యొక్క గేమింగ్ ప్రయోజనాల ను ఒక్కసారి గమనిస్తే, ఈ టాబ్లెట్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో లాంచ్ కావడం ప్రధాన విషయంగా చెప్పుకోవచ్చు.


Click it and Unblock the Notifications