Home
News

OPPO ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ విడుదల.. ధర, ఫీచర్లు, సేల్‌ వివరాలు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో నుంచి ఎప్పటి నుంచో ఎదురుచూస్తోన్న ఫోల్డబుల్‌ ఫోన్‌ OPPO Find N3 Flip విడుదల అయింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ ఆక్టాకోర్‌ డైమెన్సిటీ 9200 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ వెనుకవైపు 50MP ప్రైమరీ కెమెరా సహా మూడు కెమెరాలను కలిగి ఉంటుంది. మరియు మూడు రంగుల్లో లభిస్తుంది.

ఒప్పో Find N3 Flip ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : ఈ ఫోన్‌ డ్యూయల్‌ సిమ్‌ను సపోర్టు చేస్తుంది. మరియు ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత ఒప్పో కలర్ OS 13.2పైన పనిచేయనుంది. ఈ ఫోల్డబుల్‌ ఫోన్‌ 6.8 అంగుళాల (1080*2520 పిక్సల్‌) LTPO అమోలెడ్‌ ఇన్నన్‌ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. 1Hz నుంచి 120Hz డైనమిక్‌ రీఫ్రెష్‌ రేట్‌తో వస్తుంది.

OPPO Foldable smartphone launched

మరియు 1600 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. 3.26 అంగుళాల (382*720 పిక్సల్‌) అమోలెడ్‌ కవర్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 900 నిట్స్‌ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. మరియు ఫోన్‌ 4nm మీడియాటెక్‌ డైమెన్సిటీ 9200 చిప్‌తో ARM ఇమ్మోర్టాలిస్‌ G715 MC11 GPU పైన పనిచేస్తుంది.

ఒప్పో Find N3 Flip ఫోన్ కెమెరాలు : ట్రిపుల్‌ రియర్‌ కెమెరాతో తొలి క్లామ్‌షేల్‌ ఫోల్డబుల్‌ ఫోన్‌గా సంస్థ పేర్కొంది. ఈ ఫోల్డబుల్‌ ఫోన్‌ సోనీ IMX890 సెన్సార్‌, f/1.8 అపేచర్‌తో 50MP ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. అలాగే సోనీ IMX581 సెన్సార్‌ మరియు f/2.2 అపేచర్‌తో 48MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా, సోనీ IMX709 సెన్సార్‌, f/2.0 అపేచర్‌తో 32MP టెలిఫోటో కెమెరాను కలిగి ఉంటుంది.

సెల్పీలు, వీడియో కాల్స్‌ కోసం ఈ ఫోన్‌ సోనీ IMX709 RGBW సెన్సార్‌తో 32MP కెమెరాను కలిగి ఉంటుంది. ఈ ఫోల్డబుల్‌ ఫోన్ డాల్బీ అట్మాస్‌తో కూడిన డ్యూయల్‌ స్పీకర్లతో వస్తుంది. ఒప్పో Find N3 Flip స్మార్ట్‌ఫోన్‌ 44W సూపర్‌వాక్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 4300mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

కనెక్టివిటీ పరంగా ఒప్పో ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ 5G, 4G LTE, వైఫై 7, బ్లూటూత్‌ 5.3, NFC, GPS, USB-C పోర్టులను కలిగి ఉంది. ప్రాక్సిమిటీ సెన్సార్‌, యాక్సెలోరోమీటర్ సెన్సార్‌, గైరోస్కాప్‌, గ్రావిటీ సెన్సార్‌, యాంబియంట్‌ సెన్సార్‌, కంపాస్‌ వంటి సెన్సార్లను కలిగి ఉంటుంది. సైట్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ఫ్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.

ఒప్పో ఫైండ్‌ N3 ఫ్లిప్‌ స్మార్ట్‌ఫోన్ 12GB ర్యామ్‌, 256 GB స్టోరేజీ వేరియంట్‌లో మాత్రమే లభిస్తుంది. ఈ ఫోన్ ధర రూ.94,999గా ఉంది. ఈ ఫోన్‌ క్రీమ్‌ గోల్డ్‌, మిస్టీ పింక్‌, స్లీక్‌ బ్లాక్‌ రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

అక్టోబర్‌ 22 తేదీ 6PM గంటల నుంచి ఈ ఒప్పో ఫోల్డింగ్‌ ఫోన్‌.. ఒప్పో ఆన్‌లైన్‌ స్టోర్‌, ఫ్లిప్‌కార్ట్‌, దేశవ్యాప్తంగా రిటైర్‌ స్టోర్లలో లభిస్తుంది. పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్‌ చేయడం ద్వారా రూ.8000 వరకు తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు రూ.12000 వరకు క్యాష్‌బ్యాక్‌ ఆఫర్ల ఉన్నాయని తెలిపింది.

More from GizBot

Best Mobiles in India

English summary
OPPO Find N3 Flip smartphone launched in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X