Home
News

Oppo నుంచి కొత్త ఫోల్డబుల్ ఫోన్ వివరాలు లీక్! అత్యంత పలుచని డిజైన్ తో రానుంది, వివరాలు 

Oppo నుంచి Oppo Find N5 , గత సంవత్సరం లాంచ్ అయిన ఫైండ్ N3 కి కొనసాగింపుగా వస్తుందని చెప్పబడింది. ఒప్పో దాని తర్వాతి ఫోన్ ను బుక్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్ గా లాంచ్ చేయబోతోంది. దీని గురించి సంస్థ ఇప్పటికి ఏమీ ప్రకటించనప్పటికీ, ఒక టిప్‌స్టర్ దాని లాంచ్ టైమ్‌లైన్ మరియు స్పెసిఫికేషన్‌లను లీక్ చేసారు.

ఈ ఒప్పో ఫైండ్ N5 వచ్చే ఏడాది ప్రారంభంలో అధికారికంగా అందుబాటులోకి రానుంది. ఇది ఒక సన్నని డిజైన్ బిల్డ్‌తో వస్తుందని మరియు ఇంకా లాంచ్ కాని, స్నాప్ డ్రాగన్ 8 జెన్ 4 SoC పై రన్ అవుతుందని సూచించబడింది.

Oppo Find N5 Launch Details  Specifications Leaked Online

ఒప్పో ఫైండ్ N5 ఎంపిక చేయబడిన మార్కెట్‌లలో వన్‌ప్లస్‌ ఓపెన్ 2 గా వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. గత సంవత్సరం, వన్‌ప్లస్‌ ఓపెన్ ఎంపిక చేయబడిన మార్కెట్‌లలో రీబ్యాడ్జ్ చేయబడిన Find N3 గా లాంచ్ అయిన సంగతి మీకు తెలిసిందే.

Oppo Find N5 ముఖ్యమైన స్పెసిఫికేషన్ల వివరాలు లీక్ అయ్యాయి
ప్రముఖ, టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ Weibo లో పోస్ట్ చేసిన సమాచారం ప్రకారం. ఒప్పో ఫైండ్ N5 యొక్క లాంచ్ టైమ్‌లైన్ మరియు స్పెసిఫికేషన్‌లను సూచించింది. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో ఈ హ్యాండ్‌సెట్‌ను లాంచ్ కానున్నట్లు తెలిపింది. ఇది వన్‌ప్లస్ ఓపెన్ 2 లాంచ్ గురించి మునుపటి లీక్‌లకు అనుగుణంగా ఉంది. అయితే, ఒప్పో ఫైండ్ N3, అక్టోబర్ 2023లో లాంచ్ అయింది.

ఒప్పో ఫైండ్ N5 2K రిజల్యూషన్ డిస్‌ప్లేలను కలిగి ఉండవచ్చని టీజ్ చేయబడింది. ఇది స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 SoC పై రన్ అవుతుందని చెప్పబడింది. ఈ ఫోల్డబుల్ ఫోన్ 50-మెగాపిక్సెల్ సోనీ కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. కెమెరా సెటప్‌లో ఒక పేర్కొనబడని పెరిస్కోప్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఇది హెచ్చరిక స్లయిడర్ మరియు వాటర్ రెసిస్టెంట్ నిర్మాణాన్ని కూడా కలిగి ఉంటుంది.

మునుపటి మాదిరిగానే, ఒప్పో ఫైండ్ N5 పెద్ద వృత్తాకార కెమెరా ఐలాండ్ ని కలిగి ఉందని చెప్పబడింది. ఇది 9.xmm మందంతో సన్నని మరియు తేలికైన నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఇది "రికార్డ్-బ్రేకింగ్" సన్నగా ఉంటుందని టిప్‌స్టర్ వ్యాఖ్యానించాడు. ఇది నిజమని తేలితే, ఇది Galaxy Z Fold 6 (12.1mm) మరియు Oppo Find N3 (11.7mm) కంటే తక్కువ మందం తో ఉంటుంది.

ఒప్పో ఫైండ్ N3 గ్లోబల్ మార్కెట్‌లలో వన్‌ప్లస్‌ ఓపెన్‌గా ప్రారంభించబడింది. దీని ఆధారంగా, Find N5 వన్‌ప్లస్ ఓపెన్ 2గా రీబ్రాండ్ చేయబడుతుందని అంచనాలున్నాయి.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియా ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Oppo Find N5 Launch Details, Specifications Leaked Online. Thinnest Foldable Design Revealed.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X