Home
News

Oppo కొత్త స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌ వివరాలు లీక్‌.. 100W ఫాస్ట్‌ ఛార్జర్‌, ట్రిపుల్‌ కెమెరా సహా..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్లు త్వరలో విడుదల కానున్నాయి. Oppo FInd X7 త్వరలో లాంచ్‌ అవుతుందని తెలుస్తోంది. ఈ ఫోన్లు మూడు మోడళ్లలో అందుబాటులో ఉన్నాయని తెలుస్తోంది. ఈ ఫోన్‌ డిజైన్‌, సహా ఇతర ఫోటోలు ఇప్పటికే లీక్‌ అయ్యాయి. ఈ సిరీస్‌లో ఒప్పో Find X7, Pro, Ultra మోడళ్లు ఉన్నాయి.

అయితే తాజాగా ఆసక్తికర లీక్‌ వెలుగులోకి వచ్చింది. ఈ సిరీస్‌లో ఒప్పో FInd X7, Find X7 అల్ట్రా మరియు అల్ట్రా శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ మోడల్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ మూడు మోడల్‌లు కూడా వృత్తాకార వెనుక కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉండనున్నాయి.

Oppo Find X7 series smartphone

లీక్‌ ఆధారంగా ఒప్పో Find X7 మోడల్‌ స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 9300 SoC చిప్‌పైన పనిచేస్తుంది. ఈ ఫైండ్‌ ఫోన్‌ అల్ట్రా మోడల్‌ హ్యాండ్‌సెట్‌లు స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 3 చిప్‌సెట్‌ను కలిగి ఉంటాయి. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్లు LPDDR5X ర్యామ్‌కు సపోర్టు చేస్తాయి. దీంతోపాటు ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత కలర్‌OS 14ను కలిగి ఉంటాయి.

ఒప్పో ఫైండ్‌ X7 అల్ట్రా మోడల్‌ స్మార్ట్‌ఫోన్లు 6.82 అంగుళాల 2k స్క్రీన్‌లను కలిగి ఉంటాయని లీక్‌ల ఆధారంగా తెలుస్తోంది. అదే బేస్‌ మోడల్‌ 6.78 అంగుళాల 1.5k డిస్‌ప్లేతో BOE 8T OLED LTPO ప్యానల్‌ను కలిగి ఉంటుంది. మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 2160Hz డిమ్మింగ్ రేట్‌తో వస్తుంది.

ఒప్పో ఫైండ్‌ X7 50MP LYT-808 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ కెమెరా OIS- ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ ఫీచర్‌తో వస్తుంది. దీంతోపాటు 50MP శాంసంగ్‌ JN1 సెన్సార్‌తో అల్ట్రావైడ్‌ లెన్స్ మరియు 64MP ఓమ్ని విజన్‌ OV64B పెరిస్కోప్‌ టెలిఫోటో కెమెరా 3X జూమ్‌ మరియు OIS సపోర్టుతో రానుంది.

ఒప్పో ఫైండ్ అల్ట్రా X7 అల్ట్రా, అల్ట్రా శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ మోడల్‌ స్మార్ట్‌ఫోన్లు 50MP LYT-900 ప్రధాన కెమెరా OIS సపోర్టుతో వస్తుంది. మరియు 50MP LYT800 సెన్సార్‌తో అల్ట్రావైడ్‌ లెన్స్‌ మరియు OIS సపోర్టుతో 50MP IMX858 సెన్సార్‌ టెలిఫోటో లెన్స్‌ 3X ఆప్టికల్‌ జూమ్‌ లెన్స్‌ను కలిగి ఉంటుంది. మరియు 50MP OIS సపోర్టుతో IMX858 సెన్సార్తో టెలిఫోటో లెన్స్ సహా 6x ఆప్టికల్‌ జూమ్‌తో వస్తుంది.

దీంతోపాటు ఈ ఒప్పో ఫైండ్‌ X7 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లు 100W వైరడ్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. అయితే ఈ ఫోన్లు ఎంత ధరలో అందుబాటులో ఉంటాయి అనే దానిపై ఎటువంటి స్పష్టత లేదు. అయితే స్పెసిఫికేషన్లపై సంస్థ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Oppo Find X7 smartphone specifications leaked ahead of launch
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X