5జీ మీద గురిపెట్టిన ఒప్పో, హైదరాబాద్‌ లోనే !

మొబైల్స్ తయారీ రంగంలో దూసుకుపోతున్నచైనా స్మార్ట్ ఫోన్ మేకర్ ఒప్పో సరికొత్తగా ముందుకు దూసుకువెళుతోంది. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా తమ కార్యకలాపాలను విస్తరించేందుకు పరిశోధనా సంస్థలను నెలకొల్పుతోంది. హై

|

మొబైల్స్ తయారీ రంగంలో దూసుకుపోతున్నచైనా స్మార్ట్ ఫోన్ మేకర్ ఒప్పో సరికొత్తగా ముందుకు దూసుకువెళుతోంది. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా తమ కార్యకలాపాలను విస్తరించేందుకు పరిశోధనా సంస్థలను నెలకొల్పుతోంది. హైదరాబాద్ లో కూడా ఒప్పో పరిశోధన సెంటర్ ని నెలకొల్పిన సంగతి అందరికీ తెలిసిందే.

5జీ మీద గురిపెట్టిన ఒప్పో, హైదరాబాద్‌ లోనే !

హైదరాబాద్‌లో నెలకొల్పిన పరిశోధన-అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) కేంద్రం 5జీ సొల్యూషన్స్‌పై పనిచేస్తున్నది. గ్లోబల్ మార్కెట్‌లో సంస్థ 5జీ కార్యకలాపాల కోసం ఈ పరిశోధనలు జరుగుతున్నాయి.

రాబోయే రెండు నుంచి మూడేండ్లలో

రాబోయే రెండు నుంచి మూడేండ్లలో

ఇండియా-స్పెసిఫిక్ మొబైల్ ఫోన్ సొల్యూషన్స్, ప్రోడక్ట్స్‌పైనా రిసెర్చ్‌లు నడుస్తున్నాయని ఒప్పో మొబైల్ ఇండియా ఆర్‌అండ్‌డీ విభాగం అధిపతి, ఉపాధ్యక్షుడు తస్లీం ఆరిఫ్ చెప్పారు. ఇక్కడి సెంటర్‌లో ప్రస్తుతం 150 మంది పనిచేస్తున్నారని, వ్యాపారావకాశాల ఆధారంగా రాబోయే రెండు నుంచి మూడేండ్లలో ఈ సంఖ్యను రెట్టింపు చేస్తామని ఆయన తెలిపారు.

అగ్రస్థానానికి ఎదుగాలన్న దిశగా

అగ్రస్థానానికి ఎదుగాలన్న దిశగా

భారత్.. వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కె ట్. ఇక్కడి మార్కెట్‌లో అగ్రస్థానానికి ఎదుగాలన్న దిశగా పయనిస్తున్నాం. ఈ క్రమంలోనే వినియోగదారుల అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా సరికొత్త శ్రేణిలో మొబైల్స్‌ను మార్కెట్‌కు పరిచయం చేసేందుకు కృషి చేస్తున్నాం అని పీటీఐతో అన్నారు.

మొదటి ఆర్‌అండ్‌డీ సెంటర్‌
 

మొదటి ఆర్‌అండ్‌డీ సెంటర్‌

గతేడాది డిసెంబర్‌లో హైదరాబాద్‌లో దేశంలోనే తమ మొదటి ఆర్‌అండ్‌డీ సెంటర్‌ను ఒప్పో ప్రారంభించిన విషయం తెలిసిందే. హైటెక్ సిటీలో ఉన్న ఈ కేంద్రం చైనాలో కాకుండా విదేశాల్లో ఉన్న వాటిలోకెల్లా అతిపెద్దది కావడం గమనార్హం. నిరుడు ప్రకటించిన 1.4 బిలియన్ డాలర్ల పెట్టుబడుల్లో భాగంగా దీన్ని ఒప్పో ఇక్కడ ఏర్పాటు చేసింది.

చైనా తర్వాతి స్థానంలో ఉన్న భారత్‌లో

చైనా తర్వాతి స్థానంలో ఉన్న భారత్‌లో

స్మార్ట్‌ఫోన్ల వినియోగంలో చైనా తర్వాతి స్థానంలో ఉన్న భారత్‌లో ఇతర ప్రత్యర్థి సంస్థలకు ఒప్పో గట్టి పోటీనే ఇస్తున్నది. షియోమి, హువాయి, వన్ ప్లస్ లాంటి చైనా సంస్థలను అలాగే శాంసంగ్,ఆపిల్ లాంటి ఇతర దేశాల కంపెనీలను తట్టుకుంటూ ముందుకువ వెళుతోంది.

మెజారిటీ యూజర్లను లక్ష్యంగా

మెజారిటీ యూజర్లను లక్ష్యంగా

దేశంలో 85 శాతం మంది 250 డాలర్ల కంటే తక్కువ విలువైన డివైజ్‌లను వాడుతున్నారని, దాదాపు 5 శాతం మంది 500-700 డాలర్ల శ్రేణిలోని డివైజ్‌లను వినియోగిస్తున్నారని ఆరిఫ్ చెప్పారు. దీంతో మెజారిటీ యూజర్లను లక్ష్యంగా చేసుకుని వ్యాపారాన్ని విస్తరిస్తున్నట్లు తెలియజేశారు.

Best Mobiles in India

English summary
oppo hyderabad facility working on 5g india specific mobile solutions

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X