Home
News

Oppo K10 5G మొదటి అమ్మకంలో రూ.1500 వరకు డిస్కౌంట్ ఆఫర్లు..

ఒప్పో స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ నేడు ఇండియాలో ఇటీవల ఒప్పో K10 5G మిడ్-రేంజ్ 5G స్మార్ట్‌ఫోన్ ని విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క అమ్మకాలు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం కానున్నాయి. మొదటి అమ్మకంలో కొన్ని అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లతో దీనిని పొందవచ్చు. ఇది మీడియాటెక్ యొక్క డైమెన్సిటీ 810 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతూ డ్యూయల్ కెమెరా మరియు 33W సూపర్ VOOC ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ మద్దతుతో 5,000mA బ్యాటరీ, అల్ట్రా లీనియర్ స్టీరియో స్పీకర్ వంటి అద్భుతమైన ఫీచర్లతో లభించే ఈ స్మార్ట్‌ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఒప్పో K10 5G స్మార్ట్‌ఫోన్ ధరలు & సేల్స్ ఆఫర్లు

ఒప్పో K10 5G స్మార్ట్‌ఫోన్ ధరలు & సేల్స్ ఆఫర్లు

ఒప్పో బ్రాండ్ యొక్క కొత్త ఫోన్ ఒప్పో K10 5G కేవలం ఒకే ఒక వేరియంట్‌లో విడుదలైంది. 8GB RAM మరియు 128GB స్టోరేజ్ వేరియంట్‌లో లభించే ఈ ఫోన్ రూ.17,499 ధర వద్ద మిడ్‌నైట్ బ్లాక్ మరియు ఓషన్ బ్లూ కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది. నేడు ఫ్లిప్‌కార్ట్‌లో మధ్యాహ్నం 12 గంటల నుంచి మొదలయ్యే ఈ సేల్స్ లో SBI, కోటక్ మహీంద్రా మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి క్రెడిట్ కార్డ్‌లు మరియు డెబిట్ కార్డ్‌లను ఉపయోగించి కొనుగోలు చేసిన వారికీ రూ.1,500 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. దానితో పాటు వినియోగదారులకు మూడు నెలలపాటు నో-కాస్ట్ EMIని కూడా అందిస్తోంది.

ఒప్పో K10 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

ఒప్పో K10 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

ఒప్పో K10 5G స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది 6.56-అంగుళాల HD+ డిస్ప్లేను 1612 x 720 పిక్సెల్‌ల రిజల్యూషన్ మరియు 90Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌తో లభిస్తుంది. అలాగే ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 810 5G చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతూ 8GB RAM + 5GB వర్చువల్ RAM తో జతచేయబడి లభిస్తుంది. అలాగే ఇది ARM Mali-G57 MC2 GPU ద్వారా రన్ అవుతూ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో లభిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 12-ఆధారిత ColorOS 12.1తో రన్ అవుతుంది.

ఒప్పో K10 5G

ఒప్పో K10 5G స్మార్ట్‌ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 48MP ప్రైమరీ సెన్సార్ మరియు 2MP డెప్త్ సెన్సార్‌తో కలిపి వస్తుంది. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. బ్యాక్ కెమెరాలు నైట్, పోర్ట్రెయిట్, ఎక్స్‌పర్ట్, ఎక్స్‌ట్రా హెచ్‌డి, పనోరమా, టైమ్‌లాప్స్ మరియు స్లో మోషన్‌తో వంటి వివిధ రకాల షూటింగ్ మోడ్‌లకు మద్దతునిస్తాయి. ఫ్రంట్ కెమెరా కూడా పనోరమిక్, పోర్ట్రెయిట్, నైట్ మరియు టైమ్‌లాప్స్ మోడ్‌లకు మద్దతునిస్తుంది. చివరిగా బ్యాటరీ విషయానికి వస్తే ఇది 33W సూపర్ VOOC ఛార్జింగ్ టెక్నాలజీ మద్దతుతో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

ఒప్పో K10 5G లాగ్-ఫ్రీ ప్రాసెసింగ్ & మల్టీ టాస్కింగ్

ఒప్పో K10 5G లాగ్-ఫ్రీ ప్రాసెసింగ్ & మల్టీ టాస్కింగ్

ఒప్పో K10 5G స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్‌సెట్ ద్వారా రన్ అవుతూ ఇది 2.4GHz క్లాక్ స్పీడ్‌ను అందిస్తోంది. అలాగే ఇందులోని 6nm ప్రాసెసర్ మీ డివైస్ లో ఉపయోగించే ప్రతిదానిని అవాంఛనీయ మరియు మృదువైన మల్టీ టాస్కింగ్ పనితీరును అందిస్తుంది. గేమింగ్ లేదా హెవీ యాప్‌లు వంటి అధిక-వనరుల పనులు అయినా కుడా SoC ప్రతిదానిని సులభంగా నిర్వహించగలదు. ఇది 8GB RAM ఎంపికను కలిగి ఉండి అదనంగా 5GB వరకు RAM విస్తరణ టెక్నాలజీతో లభిస్తుంది.

33W SUPERVOOCTM ఫాస్ట్ ఛార్జింగ్

ఒప్పో K10 5G స్మార్ట్‌ఫోన్‌ అధికసమయం పనిచేయడానికి వీలుగా 5,000mAh బ్యాటరీ సెల్‌తో ప్యాక్ చేయబడి లభిస్తుంది. ఇది 33W SUPERVOOCTM ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో లభిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ను అధిక సమయం పాటు వినియోగించే వారికి కూడా ఫుల్ ఛార్జ్ మీద రెండు రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. 33W ఫాస్ట్-ఛార్జర్ తక్కువ సమయంలోనే బ్యాటరీని ఫుల్ రీఛార్జ్ చేయగలదు. 5,000mAh బ్యాటరీని ఛార్జ్ చేయడానికి కేవలం ఒక గంట మాత్రమే సమయం పడుతుంది. అలాగే ఇది రివర్స్ ఛార్జింగ్‌కు కూడా మద్దతును ఇస్తుంది. USB కేబుల్ ద్వారా స్మార్ట్ వాచ్, TWS ఇయర్‌బడ్స్ వంటి ఇతర పరికరాలను రీఛార్జ్ చేయడానికి అనుమతిని ఇస్తుంది.

మల్టీ మొబైల్ స్పీకర్

ఒప్పో K10 5G కొత్త స్మార్ట్‌ఫోన్‌ దాని ధర కేటగిరీలో మల్టీ మొబైల్ స్పీకర్ సెటప్‌ను అందిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో 'అల్ట్రా-లీనియర్ డ్యూయల్ స్టీరియో' స్పీకర్లు ఉన్నాయి. ఇవి తక్కువ మొత్తంలో బ్యాటరీని వినియోగించుకుంటూ కవర్ వైబ్రేషన్‌తో సినిమా-గ్రేడ్ సౌండ్‌ను అందిస్తాయి. స్పీకర్లు గరిష్ట వాల్యూమ్ స్థాయిలలో కూడా వక్రీకరించని స్పష్టమైన ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి.సౌండ్ మెరుగుదలలో స్పెషలిస్ట్ అయిన డిరాక్‌తో ఒప్పో సంస్థ యొక్క భాగస్వామ్యం కారణంగా బెస్ట్-ఇన్-క్లాస్ ఆడియో పనితీరును డివైస్ యొక్క రింగ్‌టోన్‌ల ద్వారా కూడా పొందవచ్చు. K10 5G కస్టమ్-మేడ్ 3D సరౌండ్ సౌండ్ రింగ్‌టోన్‌లతో అందించబడుతుంది. ఇది అల్ట్రా-లీనియర్ స్పీకర్ అర్రే యొక్క నిజమైన శక్తిని అందిస్తుంది.

Best Mobiles in India

English summary
Oppo K10 5G Smartphone First Sale Starts Today in India Via Flipkart: Price, Specs sales Offers and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X