ఒప్పో K10 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది!! ధరలు, ఫీచర్స్ ఇవిగో...

|

ఒప్పో స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ నేడు ఇండియాలో వర్చువల్ ఈవెంట్ ద్వారా ఒప్పో K10 5G స్మార్ట్‌ఫోన్ ని విడుదల చేసింది. ఈ సంవత్సరం ప్రారంభంలోనే ఒప్పో K10 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. మరియు ఈ రోజు 5G వేరియంట్‌ను విడుదల చేసింది. ఇది మీడియాటెక్ యొక్క డైమెన్సిటీ 810 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతూ డ్యూయల్ కెమెరా మరియు 33W సూపర్ VOOC ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ మద్దతుతో లభించే ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క ఫీచర్స్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

ఒప్పో K10 5G స్మార్ట్‌ఫోన్ ధరలు & లాంచ్ ఆఫర్లు

ఒప్పో K10 5G స్మార్ట్‌ఫోన్ ధరలు & లాంచ్ ఆఫర్లు

ఇండియాలో నేడు లాంచ్ చేసిన ఒప్పో బ్రాండ్ యొక్క కొత్త ఫోన్ ఒప్పో K10 5G కేవలం ఒకే ఒక వేరియంట్‌లో లభిస్తుంది. 8GB RAM మరియు 128GB స్టోరేజ్ వేరియంట్‌లో ఈ ఫోన్ రూ.17,499 ధర వద్ద మిడ్‌నైట్ బ్లాక్ మరియు ఓషన్ బ్లూ కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది. ఇది ఫ్లిప్‌కార్ట్ ద్వారా జూన్ 15 మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. లాంచ్ ఆఫర్‌లో భాగంగా SBI బ్యాంక్, కోటక్ మహీంద్రా మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి క్రెడిట్ కార్డ్‌లు మరియు డెబిట్ కార్డ్‌లను ఉపయోగించి కొనుగోలు చేసిన వారికీ ఫ్లిప్‌కార్ట్ రూ.1,500 వరకు తగ్గింపును అందిస్తోంది. దానితో పాటు వినియోగదారులకు మూడు నెలల నో-కాస్ట్ EMIని కూడా అందిస్తోంది.

ప్రపంచంలో బెస్ట్ ఇంటర్నెట్ స్పీడ్ ఇదే! ఎంతో తెలుసా ...? మీరు అసలు ఊహించలేరు.ప్రపంచంలో బెస్ట్ ఇంటర్నెట్ స్పీడ్ ఇదే! ఎంతో తెలుసా ...? మీరు అసలు ఊహించలేరు.

 ఒప్పో K10 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్
 

ఒప్పో K10 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

ఒప్పో K10 5G స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది 6.56-అంగుళాల HD+ డిస్ప్లేను 1612 x 720 పిక్సెల్‌ల రిజల్యూషన్ మరియు 90Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌తో లభిస్తుంది. అలాగే ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 810 5G చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతూ 8GB RAM + 5GB వర్చువల్ RAM తో జతచేయబడి లభిస్తుంది. అలాగే ఇది ARM Mali-G57 MC2 GPU ద్వారా రన్ అవుతూ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో లభిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 12-ఆధారిత ColorOS 12.1తో రన్ అవుతుంది.

WhatsApp సెక్యూరిటీ కొత్త అప్‌డేట్!! లాగిన్ మరింత సురక్షితం...WhatsApp సెక్యూరిటీ కొత్త అప్‌డేట్!! లాగిన్ మరింత సురక్షితం...

ఆప్టిక్స్

ఒప్పో K10 5G స్మార్ట్‌ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 48MP ప్రైమరీ సెన్సార్ మరియు 2MP డెప్త్ సెన్సార్‌తో కలిపి వస్తుంది. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. బ్యాక్ కెమెరాలు నైట్, పోర్ట్రెయిట్, ఎక్స్‌పర్ట్, ఎక్స్‌ట్రా హెచ్‌డి, పనోరమా, టైమ్‌లాప్స్ మరియు స్లో మోషన్‌తో వంటి వివిధ రకాల షూటింగ్ మోడ్‌లకు మద్దతునిస్తాయి. ఫ్రంట్ కెమెరా కూడా పనోరమిక్, పోర్ట్రెయిట్, నైట్ మరియు టైమ్‌లాప్స్ మోడ్‌లకు మద్దతునిస్తుంది. చివరిగా బ్యాటరీ విషయానికి వస్తే ఇది 33W సూపర్ VOOC ఛార్జింగ్ టెక్నాలజీ మద్దతుతో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

Best Mobiles in India

English summary
Oppo K10 5G Smartphone Launched in India With MediaTek Dimensity 810 5G Chipset: Price, Specs, Sales Date and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X