Home
News

ఒప్పో నుంచి మరో కొత్త ఫోన్, లాంచ్ తేదీ విడుదలైంది! వివరాలు

By Maheswara

ఒప్పో సంస్థ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ Oppo K11 5G మోడల్, ఏప్రిల్ 2022లో లాంచ్ చేయబడిన Oppo K10 5G కి కొనసాగింపుగా జూలై 25న చైనాలో విడుదల కానుంది. ఒప్పో K10 5G 8GB RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజీ తో జత చేయబడిన మీడియా టెక్ డైమెన్సిటీ 810 SoCతో వస్తుంది. 33W వైర్డు SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ కలిగి ఉంది.

అయితే, లాంచ్‌కు ముందు, ఒప్పో K11 5G యొక్క ధర మరియు కొన్ని కీలక స్పెసిఫికేషన్‌లను కంపెనీ టీజర్ రూపంలో విడుదల చేసింది. ఈ, రాబోయే హ్యాండ్‌సెట్ యొక్క ఇతర స్పెసిఫికేషన్‌లు టిప్‌స్టర్ ద్వారా ఇప్పటికే లీక్ చేయబడ్డాయి.ఈ లీక్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Oppo K11 5G Smartphone Set To Launch On July 25. Price,Specifications And Other Details Teased.

ఒప్పో సంస్థ చైనా ప్రెసిడెంట్ బాబీ లు Weibo పోస్ట్‌ ద్వారా ఒప్పో K11 5G ధర CNY 2,000 (దాదాపు రూ. 22,900) ఉంటుందని మరియు ఈ ఫోన్లో ఫ్లాగ్‌షిప్ స్థాయి కెమెరా వస్తుందని టీజ్ చేసారు. ఈ ఫోన్ 50-మెగాపిక్సెల్ సోనీ IMX890 సెన్సార్‌తో వస్తుందని కూడా నిర్ధారించబడింది. ఇది గ్లేసియర్ బ్లూ మరియు మూన్ షాడో గ్రే (చైనీస్ నుండి అనువదించబడింది) రంగులలో లాంచ్ చేయబడుతుంది.

ఇక ఒప్పో K11 5G ఫోన్ యొక్క ధర వివరాలు గమనిస్తే, బేస్ వేరియంట్ 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 1,399 (దాదాపు రూ. 15,900)తో ఉంటుంది. ఇది, ఇదే ధరలో ప్రారంభమయ్యే హానర్ X50తో పోటీపడే విధంగా ఈ ఫోన్ ను లాంచ్ చేయాలని సంస్థ భావిస్తున్నట్లు అంచనాలున్నాయి.

ఒప్పో K11 5G ఫోన్ యొక్క రంగుల ఎంపికలు మరియు డిజైన్‌ను కూడా కంపెనీ వెల్లడించింది. ఈ ఫోన్ ఫ్లాట్ డిస్‌ప్లేతో మరియు గుండ్రని అంచులతో 2.8D వంపుతో కనిపిస్తుంది. వీటిలో ట్రిపుల్ వెనుక కెమెరా యూనిట్‌లు ఉన్నాయి, వాటి పక్కన LED ఫ్లాష్ యూనిట్‌ను కలిగి ఉంటుంది. వాల్యూమ్ రాకర్ మరియు పవర్ బటన్ కుడి అంచున కనిపిస్తాయి. హ్యాండ్‌సెట్ 8.23mm మందం మరియు 184 గ్రాముల బరువు కలిగి ఉన్నట్లు నిర్ధారించబడింది.

ఇక కెమెరా, ఆప్టిక్స్ వివరాలు గమనిస్తే, ట్రిపుల్ కెమెరా సెటప్‌లో 50 మెగాపిక్సెల్ సోనీ IMX890 ప్రైమరీ సెన్సార్‌తో పాటు 8 మెగాపిక్సెల్ మరియు 2 మెగాపిక్సెల్ సెన్సార్ కూడా ఉంటాయి. ఒప్పో K11 5G ని సెల్ఫీ కెమెరా 16 మెగాపిక్సెల్ సెన్సార్‌తో అమర్చబడిందని టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ (@yabhishekd) తెలిపారు. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 782G SoC, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 "పూర్తి-HD+ OLED డిస్‌ప్లే మరియు UFS 3.1 స్టోరేజ్‌తో LPDDR4x RAMని కలిగి ఉంటుందని టిప్‌స్టర్ సూచిస్తున్నారు.

ఒప్పో యొక్క K11 5G 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ తో వస్తుందని భావిస్తున్నారు. ఇంకా భద్రత కోసం, ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వచ్చే అవకాశం ఉంది. ఇది NFC కనెక్టివిటీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది మరియు X యాక్సిస్ హాప్టిక్ మోటార్, ఒక IR బ్లాస్టర్ మరియు డ్యూయల్ స్పీకర్లతో అమర్చబడి ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Oppo K11 5G Smartphone Set To Launch On July 25. Price,Specifications And Other Details Teased.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X