Home
News

Oppo Kash: అప్పు కావాలా? ఇప్పుడు దీని ద్వారా సులభంగా పొందవచ్చు!!!

చైనా యొక్క స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు ఇండియాలో తమ స్మార్ట్‌ఫోన్లతో పాటు ఫిట్ నెస్ బ్యాండ్లు మరియు ఫైనాన్సియల్ సర్వీసులను విడుదల చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు ఒప్పో సంస్థ కూడా 'ఒప్పో క్యాష్' పేరుతో ఫైనాన్సియల్ రంగంలోకి అడుగుపెడుతున్నది. ఇప్పటికే షియోమి సంస్థ Mi క్రెడిట్ పేరుతో మరియు రియల్‌మి సంస్థ రియల్‌మి క్యాష్ పేరుతో వ్యక్తిగత రుణాలను అందిస్తున్నాయి.

ఒప్పో కాష్ సర్వీస్

ఒప్పో కాష్ సర్వీస్

ఇండియాలో నిన్న ఒప్పో రెనో 3 ప్రో ను లాంచ్ చేసారు. ఈ లాంచ్ ఈవెంట్ లో ఒప్పో సంస్థ తన ఎయిర్ పోడ్ లను మరియు ఒప్పో కాష్ సర్వీసులను కూడా ప్రారంభించింది. ఒప్పో కాష్ సేవతో ఇండియా యొక్క మార్కెట్లో ఆర్థిక రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు ఒప్పో ప్రకటించింది. ఉచిత క్రెడిట్ రిపోర్టులతో పాటు రూ.2 లక్షల వరకు వ్యక్తిగత రుణాలతో మ్యూచువల్ ఫండ్స్ సేవను కంపెనీ అందించనుంది. కంపెనీ రూ.2 కోట్ల వరకు వ్యాపార రుణాలు, స్క్రీన్ ఇన్సూరెన్స్ లను కూడా అందిస్తోంది.

 

 

ఒప్పో SIP సర్వీస్

ఒప్పో SIP సర్వీస్

ఒప్పో సంస్థ నుంచి వస్తున్న కొత్త స్మార్ట్‌ఫోన్‌లలో ఈ బ్రాండ్ యొక్క కొత్త బీటాలోని ఐదు సేవలు ముందే ఇన్‌స్టాల్ చేయబడి ఉంటాయి. ఇందులోని ఫ్రీడమ్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ఒక ప్రత్యేకమైన ఆఫర్ ను అందిస్తుంది. ఈ కొత్త ఫ్రీడమ్ SIP సర్వీసుతో వినియోగదారులు తమ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిని చాలా తక్కువ మొత్తంలో 100 రూపాయల నుండి పెట్టుబడితో కూడా ప్రారంభించవచ్చు.

 

 

OPPO వైస్ ప్రెసిడెంట్

OPPO వైస్ ప్రెసిడెంట్

OPPO Kash సర్వీసుతో వినియోగదారులు వారి యొక్క అరచేతులలో ఎండ్-టు-ఎండ్ ఆర్థిక పరిష్కారాలను పొందవచ్చు. ఇండియాలో ఈ సర్వీస్ కోసం రూ.50,000 కోట్లను పెట్టుబడిగా పెట్టనున్నారు. ఈ ఫైనాన్షియల్ సర్వీసుల ప్లాట్‌ఫామ్‌లో రాబోయే 5 సంవత్సరాలలో సుమారుగా 10 మిలియన్ల మంది వినియోగదారులను కలిగి ఉండటమే మా లక్ష్యం అని OPPO వైస్ ప్రెసిడెంట్ సుమిత్ వాలియా అన్నారు.

 

 

ఒప్పో కాష్ సర్వీసులు

ఒప్పో కాష్ సర్వీసులు

రాబోయే 18 నెలల్లో ఒప్పో కాష్ కింద మరో ఆరు సర్వీసు ఆఫర్లను వినియోగదారులకు అందించాలని ఒప్పో లక్ష్యంగా పెట్టుకుంది. వీటిలో పెమెంట్స్, రుణాలు, సేవింగ్స్,ఇన్సూరెన్స్ , ఆర్థిక విద్య మరియు ఆర్థిక శ్రేయస్సు స్కోరు వంటివి ఉన్నాయి. ఈ యాప్ ఒప్పో యొక్క కొత్త స్మార్ట్‌ఫోన్‌లలో ముందే ఇన్‌స్టాల్ చేయబడి ఉంటుంది. ఒప్పోయేతర వినియోగదారులు దీన్ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఐఫోన్ వినియోగదారులు ప్రస్తుతం ఒప్పో కాష్ సౌకర్యాలను పొందలేరు. ఏదేమైనా బ్రాండ్ ఈ సంవత్సరం తరువాత ఐఫోన్ వినియోగదారుల కోసం తమ సేవలను ప్రారంభించడాన్ని పరిగణించవచ్చు.

 

 

Mi క్రెడిట్ సర్వీస్

Mi క్రెడిట్ సర్వీస్

రియల్‌మి, షియోమి వంటి స్మార్ట్‌ఫోన్ ప్లేయర్‌లు కూడా తమ సొంత సేవలతో ఇటీవల ఆర్థిక సేవల రంగంలోకి అడుగుపెట్టాయి. షియోమి Mi పే అప్లికేషన్‌తో పాటు Mi క్రెడిట్-లెండింగ్ సేవను ప్రారంభించింది. దీనితో వినియోగదారులు భీమా మరియు ఫైనాన్సింగ్ వంటి అంశాలను అందిస్తుంది. చైనా తరువాత Mi క్రెడిట్ సర్వీస్ కోసం ఇండియా అతిపెద్ద మార్కెట్ అని కంపెనీ పేర్కొంది. రియల్‌మి కూడా ఇటీవల భారతీయ వినియోగదారుల కోసం రియల్‌మి పేసాను ప్రారంభించింది. ఈ అప్లికేషన్ కస్టమర్లు మరియు SME లకు ఆర్థిక సేవలను అందిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Oppo Kash Service Launched in India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X