కొనుగోలుకు ఒప్పో ఆర్11 ఎఫ్ సి బార్సిలోనా ఎడిషన్ రెడీ!

By: Madhavi Lagishetty

చైనా మొబైల్ మేకర్ ఒప్పో జూన్ 2017చైనాలోజరిగిన ఒక కార్యక్రమంలో ఒప్పో ఆర్ 9 స్మార్ట్ ఫోనును ప్రకటించింది. లాంచింగ్ సమయంలో స్మార్ట్ ఫోన్ బ్లాక్, గోల్డ్, రోజ్ గోల్డ్ రకాల్లో వస్తుందని కంపెనీ పేర్కొంది. స్టాండర్డ్ కలర్ వేరియంట్స్ అయినప్పటికీ ..ఈ కంపెనీ ప్రస్తుతం స్మార్ట్ లిమిటెడ్ యొక్క కొత్త లిమిటెడ్ ఎడిషన్ ను ప్రకటించింది.

కొనుగోలుకు ఒప్పో ఆర్11 ఎఫ్ సి బార్సిలోనా ఎడిషన్ రెడీ!

ఒప్పో ఆర్ 11ఎఫ్ సి బార్సిలోనా ఎడిషన్ ప్రకటించింది. మరియు స్మార్ట్ ఫోన్ సంస్థ యొక్క అధికారిక చైనీస్ వెబ్ సైట్లో అమ్మకానికి ఉంది. స్మార్ట్ ఫోన్ ధర 3,499 సిఎన్ వై ఉంది. (సుమారు రూ. 33,580) అంతేకాదు ఈ హ్యాండ్ సెట్ ను కొనుగోలు చేయాలనే ఆసక్తి ఉంటే వెంటనే కొనుగోలు చేయండి. ఎందుకంటే స్టాక్ పరిమితంగా ఉంది.

ఏమైనప్పటికి...ఈ కొత్త వేరియంట్ స్మార్ట్ ఫోన్ ప్రధాన హైలైట్ ఫీచర్ 18కె బంగారం వెనుక భాగంలో fc బ్యాడ్జ్ని కలిగి ఉంటుంది. సాధారణమైన ఎరుపు మరియు నీలం రంగు కలయికతో ఉన్న బార్సిలోనా నేపథ్య రంగులతో కూడా ఈ స్మార్ట్ ఫోన్ తయారు చేయబడింది.

అయితే హర్డ్ వేర్ అంశాలు ఇతర ఒఫ్పో ఆర్ 11 వలే ఉంటాయి.

జస్ట్ రీకాల్ , ఒప్పో ఆర్ 11 5.5 అంగుళాల పూర్తి హెచ్ డి (1920 x 1080 పిక్సెల్స్) 401పిపిఐ పిక్సెల్ సాంద్రతతో ఆల్మోడ్ స్క్రీన్ తో వస్తుంది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 660 ప్రొసెసర్, 4జిబి ర్యామ్, 64జిబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రో ఎస్డి కార్డు ద్వారా ఈ నిల్వను విస్తరించవచ్చు.

కొనుగోలుకు ఒప్పో ఆర్11 ఎఫ్ సి బార్సిలోనా ఎడిషన్ రెడీ!

16మెగాపిక్సెల్ కెమెరా వైడ్ కోన్ లెన్స్ కలయికతో డ్యూయల్ రేర్ కెమెరా సెటప్ ను హ్యాండ్ సెట్ కలిగి ఉంది. f/1.7 ఎపర్చర్ మరియు పిడిఎఎఫ్ తో 20మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఎపర్చర్ f/2.6 తో కలిసి ఉంటుంది. ఈ డివైస్ 2 ఆప్టికల్ జూమ్ మరియు ఇమేజ్ ప్రొసెసింగ్ కోసం క్వాల్కమ్ స్పెక్ట్రా ఐఎస్పి ను కలిగి ఉంది. ఫ్రంట్ సెల్ఫీ మరియు వీడియో కాలింగ్ కోసం 20మెగాపిక్సెల్ షూటర్ కూడా ఉంది.

పాక్, చైనాలకు మూడింది, ఇండియన్ ఆర్మీలోకి రోబో సైన్యం

ఒప్పో ఆర్ 11 ఒక 3000ఎంఏహెచ్ బ్యాటరీ ప్యాక్ మరియు అది విఓఓసి ఫ్లాష్ చార్జింగ్ వస్తుంది. స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ పై నడుస్తుంది. 7.1.1 నౌగట్ ఓఎస్ తో కలర్ ఓఎస్ 3.1 పైన నడుస్తుంది.

ఫ్రంట్ కెనెక్టివిటీ ఫోన్ 4జి వోల్ట్ వైఫై 802.11 ఎసి, బ్లూటూత్ 4.2 జివిఎస్ గ్లోనాస్ మరియు డ్యూయల్ సిమ్స్ కు మద్దతు ఇస్తుంది. ఒప్పో ఆర్ 11 154.5 ×74.8 ×6.8 ఎంఎం మరియు 150 గ్రాముల బరువు ఉంటుంది.

కంపెనీ ఇటీవలే మార్కెట్లో ఒప్పో ఎఫ్3 ను ప్రముఖ బాలీవుడు హీరోయిన్ దీపికా పడుకొనే లిమిటెడ్ ఎడిషన్ను రిలీజ్ చేసింది.

Read more about:
English summary
Good news for Barcelona fans, Oppo has just launched Oppo R11 FC Barcelona Edition smartphone for consumers.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot