Home
News

Oppo కొత్త 5G ఫోన్, ఇండియా లాంచ్ తేదీ! రాజమౌళి... యాడ్ చేసిన ఫోన్ ఇదే!

By Maheswara

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ సంస్థ అయిన ఒప్పో ఇప్పుడు, Oppo Reno 10 5G సిరీస్ తో Oppo Reno 10, Reno 10 Pro మరియు Reno 10 Pro+ ఫోన్లను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ఫోన్లు వచ్చే వారం భారతదేశంలో లాంచ్ చేయబడతాయి. ఒప్పో రెనో 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లకు కంపెనీ వారసులు ఈ సంవత్సరం ప్రారంభంలో చైనాలో ప్రారంభించిన మోడళ్లతో పోలిస్తే కొద్దిగా భిన్నమైన స్పెసిఫికేషన్‌లతో ఇండియాలో లాంచ్ చేస్తారని భావిస్తున్నారు.

ఈ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు భారతదేశంలో ఈ ఫోన్లను ప్రారంభించటానికి కొన్ని రోజుల ముందు Oppo Reno 10 Pro+ ఫోన్ యొక్క కొన్నిస్పెసిఫికేషన్‌లను వెల్లడించింది. సోమవారం, Oppo Reno 10 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను భారతదేశంలో జూలై 10న లాంచ్ చేయబోతున్నట్లు కంపెనీ ప్రకటించింది. లాంచ్ తేదీని ప్రకటించిన కంపెనీ మైక్రోసైట్ ను కూడా లాంచ్ చేసింది.

Oppo Reno 10 5G Series Launch Date Confirmed For July 10 In India. Price,Specifications And Other Details

OISతో కూడిన 64 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాతో సహా కొన్ని రెనో 10 సిరీస్ ఫీచర్‌లను కూడా టీజ్ చేస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 SoC, మరియు 100W సూపర్ ఊక్ ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది.ఇప్పటివరకు లీక్ అయిన వివరాలను ఇక్కడ గమనిద్దాం.

ఒక టిప్‌స్టర్ గతంలో రెనో 10 సిరీస్‌లోని మూడు హ్యాండ్‌సెట్‌ల ధరల వివరాలను లీక్ చేశాడు. భారతదేశంలో Oppo Reno 10 ధర రూ. 30,000 అయితే Oppo Reno 10 Pro ధర రూ.40,000 నుండి మరియు టాప్-ఆఫ్-ది-లైన్ Oppo Reno 10 Pro+ ధర రూ. 50,000 నుండి మొదలవుతుంది. ఈ ధరలు చైనాలోని హ్యాండ్‌సెట్‌ల ధరలతో సరిపోలుతున్నప్పటికీ, ప్రస్తుతానికి వీటిని అంచనాలుగా మాత్రమే భావించడం మంచిది, ఈ ఫోన్ల యొక్క ధరలపై కంపెనీ ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు.

అలాగే, కంపెనీ వెబ్‌సైట్‌లో Oppo Reno 10, Reno 10 Pro మరియు Reno 10 Pro+ కోసం ప్రత్యేక స్టోర్ జాబితాలు ఈ ఫోన్ల లాంచ్ కు ముందు లైవ్ లో ఉన్నాయి. ఈ ఫోన్‌ల ధర ఇంకా వెల్లడి కాలేదు, అయితే Oppo Reno 10 5G స్మార్ట్ ఫోన్ 8GB + 256GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో ఐసీ బ్లూ మరియు సిల్వరీ గ్రే కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది, అయితే Reno 10 Pro 5G మరియు Reno 10 Pro+ 5G అందుబాటులో ఉంటాయి. ఇంకా, 12GB + 256GB స్టోరేజీ కాన్ఫిగరేషన్‌లో గ్లోసీ పర్పుల్ మరియు సిల్వరీ గ్రే రంగుల లో వస్తుంది.

గత నెలలో, ఒప్పో రెనో 10 5G సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల గ్లోబల్ వేరియంట్‌లు బెంచ్‌మార్కింగ్ వెబ్‌సైట్ గీక్‌బెంచ్‌లో కనిపించాయి. ఒప్పో రెనో 10 5G స్మార్ట్ ఫోన్ MT6877V/TTZA చిప్‌సెట్‌ను కలిగి ఉండటానికి జాబితా చేయబడింది. ఇది మీడియా టెక్ డైమెన్సిటీ 7050 SoC ప్రాసెసర్ ని కలిగి ఉంటుందని చెప్పబడింది. అదేవిధంగా, రెనో 10 ప్రో 5G మరియు రెనో 10 ప్రో+ 5G ఫోన్లు గతంలో స్నాప్‌డ్రాగన్ 778G మరియు స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 చిప్‌లతో వస్తున్నట్లు గుర్తించబడ్డాయి.బాహుబలి ,RRR వంటి సినిమాల డైరెక్టర్ రాజమౌళి గారు ఈ ఫోన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

More from GizBot

Best Mobiles in India

English summary
Oppo Reno 10 5G Series Launch Date Confirmed For July 10 In India. Price,Specifications And Other Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X