12GB ర్యామ్, ట్రిపుల్ కెమెరా OPPO స్మార్ట్‌ఫోన్ ధర రూ.2000 తగ్గింపు.. ఫీచర్లు, సేల్ వివరాలు.. !
ఒప్పో రెనో 10 Pro స్మార్ట్‌ఫోన్ (Oppo Reno 10 Pro 5G Smartphone) గత సంవత్సరం జులైలో భారత్ మార్కెట్‌లో విడుదల అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ పుల్ HD+ డిస్‌ప్లే మరియు క్వాల్‌కాం చిప్‌సెట్‌ను కలిగి ఉంది. మరియు 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో వచ్చింది. ప్రస్తుతం ఈ ఫోన్ సిల్వరీ గ్రీన్, గ్లోసీ పర్పల్ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.
ఒప్పో రెనో 10 Pro స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు :
ఒప్పో రెనో 10 Pro స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల పుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. 1080*2412 పిక్సల్ రిజల్యూషన్, 120Hz రీఫ్రెష్ రేట్ మరియు 950 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే AGC DT స్టార్2 గ్లాస్ తో రక్షణ పొందుతుంది.

ఒప్పో రెనో 10 Pro స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ColorOS 13 పైన పనిచేస్తుంది. మరియు ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 778G ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ఈ ప్రాసెసర్ 12GB ర్యామ్ మరియు 256GB అంతర్గత స్టోరేజీతో జతచేయబడుతుంది.
ఒప్పో రెనో 10 Pro స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. f/1.8 అపేచర్‌తో 50MP ప్రైమరీ కెమెరా, f/2.2 అపేచర్‌తో 8MP IMX355 అల్ట్రావైడ్ కెమెరా మరియు f/2.0 అపేచర్ 32MP IMX709 2x టెలీఫోటో కెమెరాను కలిగి ఉంటుంది. 32MP సెల్ఫీ కెమెరాను అమర్చారు.

80W ఫాస్ట్ ఛార్జింగ్, 4600mAh బ్యాటరీ సామర్థ్యం : ఒప్పో రెనో 10 Pro స్మార్ట్‌ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 4600mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ ఒప్పో స్టోర్ సహా ఇతర ఈ-కామర్స్, ఇతర రిటైర్ దుకాణాల్లో కొనుగోలు చేయవచ్చు.
కనెక్టివిటీపరంగా ఈ స్మార్ట్‌ఫోన్ వైఫై 802, బ్లూటూత్ V5.30, USB OTG, USB-C, 5G, 4G LTE వంటి కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంది. యాక్సిలిరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, మాగ్నిటోమీటర్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ వంటి సెన్సార్లును కలిగి ఉంది. భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్లున్నాయి.
విడుదల సమయంలో ఒప్పో రెనో 10 Pro స్మార్ట్‌ఫోన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.39,999గా ఉంది. తాజాగా సంస్థ ఈ హ్యాండ్‌సెట్ ధరను రూ.2000 (Oppo Reno 10 Pro 5G Smartphone Price Drop) తగ్గించింది. ఫలితంగా ఈ స్మార్ట్‌ఫోన్ రూ.37,999 కే కొనుగోలు చేయవచ్చు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications