OPPO Reno 10x Zoom ఫోనే ఎందుకు కొనాలంటే కారణాలు

దిగ్గజ మొబైల్స్ మేకర్ ఒప్పో ఇండియా మార్కెట్లోకి రెండు ఫోన్లను తీసుకువచ్చింది. ఒప్పో రెనో, ఒప్పో రెనో 10 ఎక్స్ జూమ్ పేర్లతో ఈ ఫోన్లను ఇండియా మార్కెట్లో విడుదల చేసింది.

|

దిగ్గజ మొబైల్స్ మేకర్ ఒప్పో ఇండియా మార్కెట్లోకి రెండు ఫోన్లను తీసుకువచ్చింది. ఒప్పో రెనో, ఒప్పో రెనో 10 ఎక్స్ జూమ్ పేర్లతో ఈ ఫోన్లను ఇండియా మార్కెట్లో విడుదల చేసింది. ఒప్పో రెనో రూ.32,990 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ల‌భ్యం కానుంది. అలాగే ఒప్పో రెనో 10 ఎక్స్ జూమ్ 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.39,990 ధ‌ర‌కు, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.49,990 ధ‌ర‌కు ల‌భ్యం కానున్నాయి.

 
OPPO Reno 10x Zoom ఫోనే ఎందుకు కొనాలంటే కారణాలు

జూన్ 7వ తేదీ నుంచి ఈ రెండు ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. అయితే వీటిల్లో OPPO Reno 10x Zoom గురించే ప్రధానంగా చెప్పుకోవాలి. ఫోటోగ్రఫీ ప్రేమికులకు ఇది ఫర్ఫెక్ట్ ఫోన్ అని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఒప్పో రెనో 10ఎక్స్ జూమ్ ఎడిష‌న్ ఫీచ‌ర్లు

ఒప్పో రెనో 10ఎక్స్ జూమ్ ఎడిష‌న్ ఫీచ‌ర్లు

6.6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ అమోలెడ్ డిస్‌ప్లే, 2340 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్‌, 6/8 జీబీ ర్యామ్‌, 128/256 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 48, 13, 8 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 10ఎక్స్ హైబ్రిడ్ ఆప్టిక‌ల్ జూమ్‌, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, యూఎస్‌బీ టైప్ సి, డాల్బీ అట్మోస్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ, 4065 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.

డిజైన్

డిజైన్

6.6 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్‌, 8 జీబీ ర్యామ్‌ల‌ను ఏర్పాటు చేశారు. అందువ‌ల్ల ఫోన్ వేగవంతమైన ప్ర‌ద‌ర్శ‌న‌ను ఇస్తుంది. డిజైన్ పరంగా ఇది అదిరిపోయే లుక్ తో పాటు చూసేందుకు ఆకర్షణీయంగా ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6తో ఈ ఫోన్ వచ్చింది. చేతుల్లో ఇట్టే ఇమిడిపోయే విధంగా ఈ ఫోన్ ని తీర్చిదిద్దారు. Jet Black and Ocean Green రంగుల్లో వచ్చిన ఈ ఫోన్ వినియోగదారుల చేతుల్లో చాలా అందంగా కనిపిస్తుంది.

సెల్ఫీ కెమెరా
 

సెల్ఫీ కెమెరా

ఈ ఫోన్‌లో ముందు భాగంలో 16 మెగాపిక్స‌ల్ కెపాసిటీ ఉన్న సైడ్ లిఫ్టింగ్ కెమెరాను ఏర్పాటు చేశారు. అలాగే ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను ఈ ఫోన్‌లో అందిస్తున్నారు. సెల్ఫీ కెమెరాలో మునుపెన్నడూ లేని టెక్నాలజీని ఒప్పో తీసుకువచ్చింది. ఎల్ఈడీ ఫ్లాష్ లైట్ ద్వారా క్యాప్చర్ చేసే సమయంలో ఆటోమేటిగ్గా బ్రైట్ నెస్ లెవల్సె అడ్జెస్ట్ అవుతాయి. లో లైట్ వెలుతురులో కూడా అదిరిపోయే సెల్ఫీలు తీసుకునే విధంగా కెమెరాను అధునాతనంగా తీర్చిదిద్దారు.

అదిరిపోయే బ్యాక్ కెమెరాలు

అదిరిపోయే బ్యాక్ కెమెరాలు

ఈ ఫోన్ వెనుక భాగంలో 48 మెగాపిక్స‌ల్ భారీ కెపాసిటీ ఉన్న కెమెరాను ఏర్పాటు చేయ‌గా, 13 మెగాపిక్స‌ల్ ఉన్న మ‌రో టెలిఫొటో కెమెరాను కూడా వెనుక భాగంలో ఏర్పాటు చేశారు.అలాగే 8ఎంపీ కెమెరాను కూడా ఇందులో పొందుపరిచారు. దీనికి 10ఎక్స్ ఆప్టిక‌ల్ జూమ్ ల‌భిస్తుంది. వివిధ రకాల మోడ్ లతో వచ్చిన ఈ కెమెరా ద్వారా ఫోటోలను ఆకర్షణీయంగా తీసుకోవచ్చు. Ultra Night Mode 2.0 ఫీచర్ ఈ ఫోన్ కి అదనపు బలాన్ని ఇవ్వనుంది. 4K video recordingని ఈ ఫోన్లో రికార్డ్ చేయవచ్చు. 360 డిగ్రీల కోణంలో చుట్టుపక్కల ఉన్న మొత్తాన్ని ఆడియో వీడియో నాణ్యంగా అందిస్తుంది. ఓవరాల్ గా ఆడియో వీడియో క్వాలిటి అదిరిపోయే విధంగా ఉంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు.

డిస్ ప్లే

డిస్ ప్లే

OPPO Reno 10x Zoom 6.6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ అమోలెడ్ డిస్‌ప్లే వచ్చింది. మల్టీమీడియా అభిమానులకు అదిరిపోయే అనుభూతిని అందిస్తుంది. 2340 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్‌ తో ఆపరేటింగ్ చాలా వేగవంతంగా ఉంటుంది. ఎటువంటి అంతరాయం లేకుండా గేమింగ్ ను ఆడుకోవచ్చు. ముఖ్యంగా గేమింగ్ ప్రియులకు మధ్యలో ఎటువంటి అంతరాయం ఉండకుండా ప్రాసెసర్ వేగవంతంగా పనిచేస్తుంది.6/8 జీబీ ర్యామ్‌, 128/256 జీబీ స్టోరేజ్‌తో రావడం వల్ల మెమొరీ అయిపోయిందన్న బాధ ఉండదు. దీంతోపాటు 4065 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాట‌రీని కూడా ఈ ఫోన్‌లో ఏర్పాటు చేయ‌గా.. దీనికి ఫాస్ట్ చార్జింగ్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు

ఒప్పో రెనో ఫీచ‌ర్లు,

ఒప్పో రెనో ఫీచ‌ర్లు,

దీంతో పాటు ఒప్పో నుంచి మరో ఫోన్ ఒప్పో రెనో కూడా విడుదలయింది. దీని ఫీచర్లను ఓ సారి పరిశీలిస్తే..
6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 710 ప్రాసెస‌ర్‌, 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్, 48, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డాల్బీ అట్మోస్, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3765 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.

Best Mobiles in India

English summary
OPPO Reno 10x Zoom: Perfect Blend Of Style And Performance

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X