Home
News

Oppo Reno 11 5G స్మార్ట్‌ఫోన్ సేల్‌ ప్రారంభం అయింది.. ధర, ఆఫర్ల వివరాలు..!

ఒప్పో ఇటీవల భారత్‌లో మిడ్‌ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ Oppp Reno 11 ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ పుల్‌ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు ఈ హ్యాండ్‌సెట్‌ మీడియాటెక్‌ చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ ఒప్పో కొత్త హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత OSపై పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుకు అందుబాటులో ఉంది.

ఒప్పో రెనో 11 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు: ఒప్పో రెనో 11 స్మార్ట్‌ఫోన్‌ 1080*2412 పిక్సల్‌ రిజల్యూషన్‌తో 6.7 అంగుళాల పుల్‌ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో వస్తుంది. డ్యూయల్‌ సిమ్‌ను సపోర్టు చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత ColorOS 14 పైన పనిచేస్తుంది. మూడు సంవత్సరాల పాటు ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్లు, నాలుగు సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్లు పొందనుంది.

 oppo-reno-11-5g-smartphone-sale-is-live

రెండు అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో : ఒప్పో రెనో 11 స్మార్ట్‌ఫోన్‌ ఆక్టో కోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7050 చిప్‌సెట్.. 8GB ర్యామ్‌తో జతచేయబడుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 128GB, 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది. ఈ ఒప్పో హ్యండ్‌సెట్‌ 67W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది.

32MP సెల్ఫీ కెమెరా : ఈ ఒప్పో రెనో 11 హ్యాండ్‌సెట్‌ వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. f/1.8 అపేచర్‌తో 50MP ప్రధాన కెమెరా, f/2.2 అపేచర్‌తో 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ లెన్స్‌, f/2.0 అపేచర్‌తో 32MP టెలిఫోటో కెమెరాని కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 32MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.

 oppo-reno-11-5g-smartphone-sale-is-live

రెండు రంగుల్లో అందుబాటులోకి : ఒప్పో రెనో 11 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్‌+ 128GB అంతర్గత స్టోరేజీ, 8GB ర్యామ్‌+ 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. 128GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.29,999గా ఉంది. అదే 256GB వేరియంట్ రూ.31,999 గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ వేవ్‌ గ్రీన్‌, రాకీ గ్రే రంగుల్లో లభిస్తోంది.

ఈ ఒప్పో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్టు మరియు ఇతర రిటైల్‌ దుకాణాల్లోను కొనుగోలు చేయవచ్చు. ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.3000 క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. దీంతోపాటు బజాజ్‌, టీవీఎస్‌ క్రెడిట్‌, హోం క్రెడిట్‌, HDB ఫైనాన్సియల్‌ సర్వీసెస్, IDFC ఫస్ట్‌ బ్యాంక్‌ల ద్వారా తక్కువ డౌన్‌ పేమెంట్‌ మరియు జీరో డౌన్‌ పేమెంట్‌ స్కీ్మ్‌ల ప్రయోజనాలు పొందవచ్చు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Oppo Reno 11 5G smartphone sale is live in india specs and offers
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X