Home
News

32MP సెల్ఫీ కెమెరా, 12GB ర్యామ్ Oppo స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్‌.. స్పెసిఫికేషన్లు, ధర వివరాలు.

ఒప్పో రెనో 11 ప్రో స్మార్ట్‌ ఫోన్‌ (Oppo Reno 11 Pro Smartphone Price Drop Offers) తగ్గింపు ధరను పొందింది. ఈ హ్యాండ్‌సెట్ మెరుగైన కెమెరా స్పెసిఫికేషన్లతో అందుబాటులోకి వచ్చింది. బ్యాంకు ఆఫర్లు, ఎక్స్చేంజీ ఆఫర్‌లతో కలిపి గరిష్ఠంగా రూ.8000 వరకు తగ్గింపును పొందవచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన కథనం.

ఒప్పో రెనో 11 ప్రో స్మార్ట్‌ ఫోన్‌ ధర..
ఒప్పో రెనో 11 ప్రో స్మార్ట్‌ ఫోన్‌ 12GB ర్యామ్‌ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర ప్రస్తుతం రూ.39,999 గా ఉంది. పెర్ల్‌ వైట్‌ మరియు రాకీ గ్రే రంగుల్లో అందుబాటులో ఉంటుంది. SBI, ICICI, HDFC బ్యాంకు డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.4000 వరకు తగ్గింపును పొందవచ్చు.

Oppo reno 11 Pro smartphone flipkart offer 2024

మరియు ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్లను ఎక్స్చేంజీ చేయడం ద్వారా మరో రూ.4000 వరకు తగ్గింపును పొందవచ్చు. ఈ ఆఫర్‌ ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. ఫలితంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ వేరియంట్‌ ధర రూ.35 వేల కంటే తక్కువ ధరకే అందుబాటులో వస్తుంది.

ఒప్పో రెనో 11 ప్రో స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్లు :
ఒప్పో రెనో 11 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల పుల్‌ HD+ కర్వడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 950 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్ ఆకట్టుకుంటుంది.

ఈ హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత colorOS 14 పైన పనిచేస్తుంది. అండర్‌ ది హుడ్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 8200 CPU మరియు ఆర్మ్ Mali G610 GPU పైన పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 12GB ర్యా్మ్‌ +256GB అంతర్గత స్టోరేజీ మరియు 12GB ర్యామ్‌ +512GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.

కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్‌ వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ కెమెరా, 32MP టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌ 32MP కెమెరాను కలిగి ఉంటుంది.

80W Supervooc ఛార్జింగ్‌ సపోర్టుతో.. :
ఈ ఒప్పో రెనో 11 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 80W Supervooc ఛార్జింగ్‌ సపోర్టుతో 4600mAH బ్యాటరీని కలిగి ఉంటుంది. కనెక్టివిటీ పరంగా ఈ ఒప్పో రెనో 11 ప్రో స్మార్ట్‌ఫోన్ వైఫై 6, బ్లూటూత్‌ 5.3, NFC, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంటుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Oppo reno 11 Pro smartphone gets RS 8000 discount on flipkart details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X